tag:blogger.com,1999:blog-58475918847976646332024-03-12T21:50:17.393-07:00ఏకాంతంఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...ఏకాంతపు దిలీప్http://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.comBlogger99125tag:blogger.com,1999:blog-5847591884797664633.post-22420667246297872582016-04-02T16:43:00.000-07:002019-09-21T23:06:23.358-07:00టొమాటీయో స్పైసీ గ్రీన్ సాస్

ఇందాకే లైబ్రరి దాటిపోయింది

అక్కడ రీడర్ స్టాట్యూ, చెట్టు దగ్గర గడిపిన క్షణాలు

మనం నడకతో కొలిచిన సన్నివేల్ రోడ్లు, ఎల్ కెమినొ రియల్

ఇప్పుడు కార్ స్టీరింగ్ వెనుక గతించిపోతున్నాయి

ఆ వేగంలోనూ ఇన్-న్-అవుట్ బర్గర్ కనిపిస్తే ఆగిపోతాను

గ్రిల్డ్ చీజ్ బర్గర్ తింటుంటే... ఎదురుగా నువ్వు..

యెల్లో చిలి పెప్పెర్ కొరుకుతున్నట్టు అనిపిస్తుంది

నీకో విషయం చెప్పాలి

ఈ మధ్య ఫార్మర్స్ మార్కెట్ కి కూరగాయల కోసం వెళ్ళడం మానేసాను

జేబులో డాలర్ బిల్లు లేకపోతే అసలు వెళ్ళడమే మానేసాను

అక్కడ టొమాటీయో స్పైసీ గ్రీన్ సాస్‌తో హెలపేనో చీజ్ తమాలే తిని

మ్యుజిషన్ కి నీ డాలర్ బిల్లు ఇచ్చి రావడమే నా శనివారం పని

అప్పుడప్పుడూ గమ్యం లేకుండా తిరుగుతుంటానా

దారిలో ఏదైనా పార్క్ కనపడితే ఉదాటున కార్ కర్బ్ సైడ్ పార్క్ అవుతుంది

దట్టమైన చెట్ల నీడల్లోనూ, ఆదమరిచిన నిద్రలోనే నీ మరపు తెలుస్తుంది

ఈ మధ్య, నీ గాఢతని మరింకేవీ నింపలేకపోతున్నాయి

ఇప్పుడు నాకు తెలుసు

ఇక నుండి ఆ నీడలు, నా నిద్ర నీకు శత్రువులని

ఏకాంతపు దిలీప్http://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.com7tag:blogger.com,1999:blog-5847591884797664633.post-17181881854621275932016-02-23T23:51:00.002-08:002016-04-02T16:31:58.511-07:00రావే దేవీ!

గుర్తుందా నీకు?

ముడి పడక ముందు

ఓ సారి చకోరంలా నా దగ్గర వాలావు

ఆ సాయంత్రం ఆ పార్క్‌లో చెట్లు ఆకాశానికి మెట్లన్నట్టే చేసావే!

కొత్తలో పెదమామ ఇంట్లో ఓ సాయంత్రం..

టీ కప్పులు ఇచ్చి వెళ్తూ గడప దగ్గర నువ్వు ఓరగా విసిరిన నీ వాలుకంటి చూపులు

ఎంత పని చేసాయీ!

ఓ సారి పొద్దు వాలాక

నీ పుట్టింట్లో చిన్న డాబా మీద నీ ఒడిలో

నిన్నూ చుక్కలని ఎంత నిశ్శబ్ధంగా చూసానూ!

ఆ మధ్య బయటకెళ్ళినపుడు

నా కుడి భుజం మీద నుండి బొట్టు తీసి ఖాళీగా ఉన్న నీ నుదిటి మీద అద్దినప్పుడు

నీ మొహమెంత పెద్దదయిందీ!

గుర్తే కదా నీకు?

ఈ రాత్రి గుప్పుమన్న మన తలపులు

నీ వలపుని కాచాయే!

అవునూ దేవీ? పున్నమీ వచ్చి వెళ్ళిపోయింది, నువ్వింకా రాలేదే!

ఏకాంతపు దిలీప్http://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.com1tag:blogger.com,1999:blog-5847591884797664633.post-38476519641618348752013-07-14T19:43:00.000-07:002013-07-28T12:59:30.339-07:00లాలి - ఊగూ ఉయ్యాల

చిన్నీ కృష్ణుడంట చిలిపీ కృష్ణుడంట

దొంగా కృష్ణుడంట మాయల కృష్ణుడంట

ఆటలు ఆపడంట నిదురే పోడంట

ఏమీ చేతునంట ఏమీ చేతునంట

లలలలల్లాయీ లలలలల్లాయీ

జోజోజోజోజో లాలీ

లాలీ జో జో... జో జో లాలా...

వేకువలో చీకటిలో జగమూగే ఉయ్యాల

ఆగదురా ఆగదురా ఊగే ఉయ్యాలా

ఊగూ ఉయ్యాలా జో జో లాలా లాలీ జో జో...

కలిమైనా లేమైనా ఊగూ ఉయ్యాల

ఆపకురా ఆపకురా ఆశల ఉయ్యాలా

ఊగూ ఉయ్యాలా జో జో లాలా లాలీ జో జో...

కయ్యాల్లో నెయ్యాల్లో ఊగూ ఉయ్యాల

వదలకురా వదలకురా కూరిమి జంపాలా

ఊగూ ఉయ్యాలా జో జో లాలా లాలీ జో జో...

నిజమైనా కలయైనా ఊగూ ఉయ్యాల

తేలాలా తేలాలా ఊహల డోలా

ఊగూ ఉయ్యాలా జో జో లాలా లాలీ జో జో...

ఏమైనా ఏదైనా ఊగూ ఉయ్యాల

సాగాలా సాగాలా మనుగడ నిలిచేలా

ఊగూ ఉయ్యాలా జో జో లాలా లాలీ జో జో...

వేకువలో చీకటిలో జగమూగే ఉయ్యాల

ఆగదురా ఆగదురా ఊగే ఉయ్యాలా

ఊగూ ఉయ్యాలా జో జో లాలా లాలీ జో జో

ఊగూ ఉయ్యాలా జో జో లాలా లాలీ జో జో

ఊగూ ఉయ్యాలా జో జో లాలా లాలీ జో జో

చిత్రం indkids.com వారి సౌజన్యంతో

ఏకాంతపు దిలీప్http://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.com8tag:blogger.com,1999:blog-5847591884797664633.post-87128937684562228062013-06-04T00:35:00.000-07:002013-07-28T12:59:47.790-07:00లాలి - రేవగలు

చిన్నారీ చిన్నయ్యా చిన్నారీ కన్నయ్యా జో జో.. జో జో

చిన్నారి చిన్నయ్యా చిన్నారి కన్నయ్యా

పగలేమిటి?

రేయేమిటి?

చిన్నారి చిన్నయ్యా చిన్నారి కన్నయ్యా

పగలేమిటి?

రేయేమిటి?

ఆహ? పగలేమిటి?! రేయేమిటి?!

చిన్నారీ చిన్నయ్యా

నీ మెలకువే నాకు పగలు నీ మెలకువే నాకు పగలు

మా ఇంటా సూరీడువి జో జో.. జో జో

మరి రేయేమిటి? రేయేమిటి?

చిన్నారీ కన్నయ్యా

నీ నిదురే నాకు రేయి నీ నిదురే నాకు రేయి

నా కంటీ జాబిలివి జో జో.. జో జో

చిన్నారీ చిన్నయ్యా జో జో

చిన్నారీ కన్నయ్యా జో జో

మా ఇంటా సూరీడువి జో జో

నా కంటీ జాబిలివి జో జో

జో జో.. జో జో.. జో జో

చిత్రం indkids.com వారి సౌజన్యంతో

ఏకాంతపు దిలీప్http://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.com6tag:blogger.com,1999:blog-5847591884797664633.post-46988883605899590922012-04-10T03:13:00.000-07:002012-04-10T03:13:09.839-07:00దేవీ నీలాల సరాలు ~ 1
వేచి ఉన్న ఏకాంతం వశమై ఆ యుగళం పారవశ్యంతో ఏకమవుతుంది...

ఏమయిందో...

మళ్లీ ఎదురవబోయే ఎడబాటు ఊహకంది ఆ క్షణంలో చొరబడింది..

ఒక్కసారిగా ఆమె కంపించి ఆతని మీద వాలిపోయింది

చేతులు దండలా ఆతని కంఠాన్ని చుట్టుకున్నాయి

మొహం ఛాతిలో దాగిపోయింది

లాలనగా అతను ముంగురులు సవరించబోతే

చేతుల బంధనం బిగుసుకుంది

ఫాలభాగామేమో ఆతని చుంబనాన్ని నిరాకరిస్తూ గారంగా ఛాతిని దోస్తుంది

కొనతేరిన ఆమె చుబుకం ఛాతి మధ్య గాయం చేస్తుంది

ఆమె నయనాలు ఏదో రచిస్తున్నాయి

అర్ధం చేసుకుంటున్న అతని హృదయం ద్రవిస్తుంది

చేదండని వదిలించి చుబుకాన్ని అందుకుని మాట కలుపుతూ అతను

ఆమె నయన కావ్యాల్లో ఆతని అనునయ వాక్యాలు కొట్టుకుపోతున్నాయి

ఏమయిందో...

తనే ఆ క్షణాన్ని వశం చేసుకుంది

ఆతని ఫాలాన్ని చుంబించి దరి చేర్చుకుంది

ఆతని నయనాలూ రచిస్తున్నాయి
ఏకాంతపు దిలీప్http://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.com8tag:blogger.com,1999:blog-5847591884797664633.post-71685427216180734112011-12-08T23:59:00.000-08:002011-12-09T10:46:24.100-08:00వెన్నెల బంతి

గోదావరీ తీరం

శరత్ నాటి సాయంత్రం

మబ్బులేని నింగిలో తెరలు తెరలుగా వెన్నెల పంచుతున్న నిండు చందమామ
వెన్నెల వెలుగుకి చిన్నబోయి తారలు నింగినొదిలి

ఈ తీరంలో చేరి పసిడిలా మెరుస్తున్నాయా అన్నట్టు ఇసుక దొంతరలు

ఒడ్డున వెన్నెలని భారంగా మోస్తూ దట్టమైన చెట్లు

చిక్కగా మెరుస్తున్న పచ్చని ఆకులు

అటు గోదారి మీద అలల బోయలు వెలుగుని ఏ లోకానికో రవాణా చేస్తున్నట్లు
అలలని తాకి తీరమంతా విహారం చేస్తున్న సమీరాలు

తన సమక్షంలోనే నన్ను గెలవాలని ప్రకృతి పదనిసలు
నేను మాత్రం తన మరపులోనే

వినిపిస్తూ తను పిల్లల మధ్య

ఏదైనా ఆట ఆడుకుందాం అక్కా! పిల్లల అరుపులు..

ఏ ఆట చెప్మా! ఉల్లాసంగా ఆరా తీస్తూ తను

గాల్లో చిటికెలు వేస్తూ అంది.. హా.. వెన్నెల బంతి!

ఏయ్ ఏయ్ వెన్నెల బంతి! వెన్నెల బంతి! పిల్లల కేరింతల గానం

చకచకా చిత్తు కాయితాలు ఆకులతో తన చేతుల్లో బంతి తయారు

పైకి ఎగరేస్తూ అంది.. ఎవరు పట్టుకుంటే వాళ్ళదే గెలుపు అని

నన్నూ చేరమని గాలిలోనే గేలం విసిరింది ఉత్సాహంగా

నేనూ వాళ్ళ మధ్య ..

బంతి గాలికి ఊరిస్తూ దొరకనంటుంది

మది చిలిపి రాగం అందుకుంది

తనలో చక్కిలిగింతలు పలికించింది

పడబోతూ తను నా చేతుల్లో..
మరు క్షణం ఇసుక పాన్పు మీద

పిల్లల్లో ఎవరో గెలిచారు

ఏయ్ ఆగు!

నను వెంటాడుతూ నా గెలుపు..

నిండా నా కన్నుల్లో నా వెన్నెలబంతి!

*తను చిన్నప్పుడు వెన్నెల్లో ఆడుకున్న ఆట 'వెన్నెల బంతి'

*చిత్రం గీసినది వెన్నెల కిరణ్! :-)

ఏకాంతపు దిలీప్http://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.com11tag:blogger.com,1999:blog-5847591884797664633.post-76513605693051932202011-11-23T06:13:00.000-08:002011-11-23T06:13:54.178-08:00మనసైంది…

మాటలతో మొదలైన బంధం చూపులతో రూపు దిద్దుకుంది

చూపుల్లోనే బయట పడ్డ మనసులు బలంగా పెనవేసుకుంటున్నాయి...

మన కలయిక నీ పలుకుల్లో వ్యక్తమవుతున్నపుడు

నా కలలకి నువ్వు భాష్యం చెప్తున్నట్టుంటుంది

నీ చిలిపి విసురుల్లో

నీ వెవ్వెవ్వేల... ఆ ఆ ఆ కారాల

గారాల నయగారాల్లో పులకించిపోతున్నాను

యధేచ్చగా నువ్వు నన్ను నీలో కలుపుకుంటుంటే

నన్ను నేను మరిచిపోతున్నాను

చుట్టూ ఏమవుతున్నా, కాలం ఎరుగక

మనసు ప్రశాంతంగా ఉంది

రేపటి మన మనుగడని ఆవిష్కరించుకుంటుంది..

పంచభూతాలు నాకు సరి కొత్తగా ప్రస్ఫుటమవుతున్నాయి
ఏకాంతపు దిలీప్http://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.com9tag:blogger.com,1999:blog-5847591884797664633.post-8406756744495266752011-11-04T06:39:00.000-07:002011-11-09T04:28:10.660-08:00ఏ(ఈ) కాంతపు దిలీప్!

ఏదీ నా చుక్కని తారా తీరంలో నే చూడని దిక్కు లేదు

నిరీక్షణలో కాలం పగలు రేయి తేడా కోల్పోయింది

అయినా ఆశ కోల్పోలేదు

అలుపు రానీలేదు

మరి ఏ తారలు ఏ వరసలో చేరాయో!

మనోహరమైన అనుభూతిని పంచే ఓ అందమైన జాబిల్లిని

గౌతమీ తీరంలోనే ప్రత్యక్షం చేసాయి..
నా ఏకాంతాన్ని వరిస్తానన్న ఆ నా జాబిల్లి... వర్ధిక!
ఏకాంతపు దిలీప్http://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.com21tag:blogger.com,1999:blog-5847591884797664633.post-7666223809377709072011-10-13T10:45:00.000-07:002011-10-13T10:46:23.870-07:00ఏకాంతవశం

లాలా లా లా ల లలలలా

చిరు గాలి.. ల లా లా.. సరాగాలలా...

వెండి వెన్నెల ల లా లా వెంటాడే ఊహలా...

వాన న నా నా వెల్లువయి పొంగే వలపులా...

తార ర రా రా తారాడే నీ తలపులా..

మే...ఘం! మ్ హు హూ నిండు కుండ నా హృదయంలా..

ఎందుకీ

ఎందుకీ

పరవశం?

పరవశం!

ఏకాంతపు దిలీప్http://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.com10tag:blogger.com,1999:blog-5847591884797664633.post-13194961808306879352011-10-01T10:40:00.000-07:002011-10-01T10:50:45.531-07:00ఎర్ర జాబిలి

చిరుగాలి కవ్వింపుగా కదం తొక్కుతోంది

ఏ కార్యం తలపోసిందో!

ఆతని కోసమేనేమో!

దూరంగా గాలికి విన్యాసాలు చేస్తున్న ఆ కురులు ఆమె ఉనికిని ఇట్టే తెలిపేసాయి!

గుండె కవాటపు వేగంతో ఆతని అడుగులు

ఆతని రాకని గమనించిన ఆమె క్షణాల్లో మొహం చాటుకుంది

ఎదురుచూపులకి ఎరుపెక్కిన ఆమె కళ్ళు

ఆతని చూసిన కోపంతో ఎరుపెక్కిన ఆమె బుగ్గలు

ఇంకాసేపట్లో ప్రళయం అన్నట్లు...

అడుగులు మందగించాయి..

చూపులు కలిపే ఆతని ప్రయత్నం విఫలం

బుజ్జగింపుల నిట్టూర్పులు వ్యర్ధం..

మోకరిల్లిన అతను

మౌనమే మధ్యవర్తిత్వం నెరపుతుంది

చేయి కలిపిన అతను

ఆమె స్పందనే తెలియనట్లు!

చొరవ చేసి చూపుని బంధించే ప్రయత్నంలో

నిండుగా ఆతని రెండు చేతుల్లో ఆమె బింబం

చూపు కలవక, రెప్ప నిలవక

కనులలోన కొలనులాయెను

ఎర్ర జాబిలి ఎరుపు పోయెను

కోపమేమో కౌగిలాయెనే!

మనసు మాటలు మౌ.....న..మే!

ఏకాంతపు దిలీప్http://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.com8tag:blogger.com,1999:blog-5847591884797664633.post-20087485491976650542011-07-26T11:23:00.000-07:002011-07-26T11:23:01.628-07:00ఏమీ కాని వాడిని

అభిరుచులో, అభిమానాలో మన జీవితాలని పెనవేస్తాయి.. సమాంతరంగా..

మరేవో కారణాలు వాటిని అదుపులో ఉంచుతాయి

మన మధ్య దగ్గరితనం తెలుసుకోవాలంటే దూరాన్ని తెలుసుకోవాల్సిందే

నిన్ను నువ్వు కోల్పోబోతున్నప్పుడు నేను నీకే తెలియని నీ బందీని

నన్ను నీలో కలుపుకోబోతున్నప్పుడు నువ్వు అందుకోలేని దిగంతాల దూరాన్ని

నీ చుట్టూనే ఉండే ఏమీ కాని వాడిని

నా పరిధిలోనే బతికే పరాయివాడిని

నేస్తం! నేను కేవలం నీ నేస్తాన్ని!
ఏకాంతపు దిలీప్http://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.com23tag:blogger.com,1999:blog-5847591884797664633.post-81355935670648444792011-06-19T11:22:00.000-07:002013-01-20T20:48:47.606-08:00మేఘాల నీడల్లో

ఎటు నుండి వస్తాయో..

అనుకోని వేళల్లో గొడుగు పడతాయి

ఎండల్లో సేదతీరుస్తాయి

వెన్నెల్లో అలరిస్తాయి

కరిగి కదిలిస్తాయి

కదిలి కరిగిస్తాయి

వాటి ఉనికిని కోల్పోయి నా ఉనికిని ప్రశ్నిస్తాయి

కాని నా ఉనికిని ఇష్టంగా చూసేది వాటి నీడల్లోనే

ఎటు నుండి వస్తాయో... ఎటెళ్తాయో..

మేఘాలు ఆడవే అన్నాను కదూ!

ఏకాంతపు దిలీప్http://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.com10tag:blogger.com,1999:blog-5847591884797664633.post-15008664996709296182011-05-13T11:54:00.000-07:002011-05-13T12:43:00.700-07:00వెన్నెల నీడలు

గది ఐమూలన కిటికీ వెనక చందమామ ఎదుగుతుంది

పడక మీద కంబళి చాటున దేహం ముడుచుకుపోతుంది

మొహమంతా వెన్నెల పరుచుకుంటుంది

ఏదో తెలియని శక్తి లోలో యుగాల నిర్లిప్తతని బుజ్జగించి నను బయటకు లాగింది

బయటేమో రెపరెపల గాలి..

రెప్పలని విప్పారనీయడం లేదు

అది మోసుకొస్తున్న చలి నిలువనీయడం లేదు
చూపులకీ చందమామ చిక్కడం లేదు

నిలువలేక నిదుర రాక పడక మీద అటు ఇటు అవుతూ నేను

వెన్నెల కన్నులలో వెలిగిపోతుంది

మనసేమో ఏదో ఆనవాల జాడని శోధిస్తుంది

వెన్నెల ఆచూకి ఈనాటిదా...

పొలం నుండి వస్తూ పందెమాడిన చందమామ

చిరుగాలికి కొబ్బరాకులు చీరేసిన చందమామ
చింతల చీకట్లో దారి చూపిన వెలుగుల చందమామ

భయాలను భ్రమింప చేసిన వేపాకు చుక్కల చందమామ

వెన్నెల స్నానాల్లో అలల మీద నలిగిపోయిన చందమామ

అరచేత పండిన చందమామ

ఏకాంతంలో తోడైన చందమామ

ఆటుపోట్ల అలజడితో ఎండమావులు చూపించిన చందమామ

వెన్నెలే వెలివేసిన ఒంటరి చందమామ

పున్నమే నిందించిన పున్నమి చందమామ

ఎన్నో కథలు విన్న చందమామ

అబ్బురాల అంతరిక్ష చందమామ

వరసగా మనసు తెర మీద ఛాయాచిత్రాలు

జాడ తెలియని వేళల్లో ఆ ఆనవాళ్ళే ఆసరా అవుతాయి

వచ్చిపోయే పున్నములయినా అవి పంచే వెన్నెల

వెంటే నిలిచే నీడలవుతాయి

చిత్రం 'విశాల ప్రపంచం' సౌజన్యంతో
ఏకాంతపు దిలీప్http://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.com10tag:blogger.com,1999:blog-5847591884797664633.post-90824381909298473342011-02-28T03:44:00.000-08:002011-02-28T21:54:46.291-08:00ఆకాశం దాటి వస్తావా?

ఏనాడు కనుగున్నానో నిను

చీకటిని అందంగా చూపే నీ వెలుగులో చుక్కలని తిరిగి లెక్కబెట్టాను

కవ్వించే నీ ఉనికితో నువ్వు పుట్టించిన ప్రశ్నలెన్ని!

ఆ ప్రశ్నల్లో సమాధానాలుగా నే జీవిస్తున్నపుడు ఎంత సంబరం!

గడిచే ప్రతీ క్షణం క్షణపు విలువని తిరగరాసింది

ఇది ఎందాకానో తెలియని నేను నిను అందుకోబోయాను

ఆకాశమంత దూరంగా నువ్వు..

నీ దగ్గరితనపు దూరం కనుగునే ప్రయత్నం నేనాపలేదు

నా నీడే నిను అలుముకుందో

మరి ఏ నీడ నిన్ను కమ్ముక్కుందో

నానాటికీ చిక్కిపోయావు

ఓ నాడు నా కన్నులకి చిక్కకుండాపోయావు

చిన్నబోయిన అవి నిన్ను వెతకడం మానేసాయి

వెలుగునే కనుగొనడం ఆపేసాయి

కాలం ఏ మాయ చేసిందో..

నా చూపుల దారిని మళ్ళించింది

ఇక నే ఎప్పటికీ కనుగోలేనేమొ అనుకున్న నువ్వు

అది నువ్వే - ఎన్నడూ చూడనంత నిండుగా!

పెల్లుబికే ప్రశ్నలు నీ సమాధానాల్లో జీవించమన్నాయి

ఈ క్షణపు విలువ ఎంత అంటూ,

నీ దూరం ఎంత దగ్గర అంటూ..

ఏదో తెలియని భావం కన్నుల్లో ముసురుకుంది

మసక మసకగా నువ్వు

చిత్రం 'విశాల ప్రపంచం' సౌజన్యంతో :)

ఏకాంతపు దిలీప్http://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.com9tag:blogger.com,1999:blog-5847591884797664633.post-74905862124784914192010-11-18T21:45:00.000-08:002010-11-18T21:45:00.489-08:00ఆదర్శం- స్వార్ధంనాకు తెలిసిన ప్రపంచం ఎప్పుడూ ఆదర్శాల కోసం జీవించడం లేదు... ఆదర్శాలు కూడా స్వార్ధంలో నుండి పుట్టుకొచ్చిన కోరికలే. మనకిష్టమైన వాటిని( అవి ఏవైనా) కుటుంబమో, సమాజమో, ప్రభుత్వమో ఏవో చెప్పి దూరం చేసే ప్రయత్నం చేసినప్పుడు ఒక ఆదర్శం పుట్టుకొస్తుంది... (లేకపోతే అప్పటివరకు పట్టించుకోని ఆదర్శాలని ఆశ్రయిస్తారు) అది ఒక్కోసారి వెంటనే అందరి అంగీకారం పొంది మార్పుకి దోహదం చేస్తుంది. ఒక్కోసారి వెంటనే అంగీకారం పొందదు. మార్పు మెల్లగా వస్తుంది.ఒక్కోసారి అలా కొందరి స్వార్ధంలో నుండి పుట్టిన కోరికలు అందరి అంగీకారం పొందవు, అవి అందరికీ ఆదర్శాల్లా కనిపించవు... ఒక్కోసారి కొన్ని ఏళ్ళ తరవాత అలా వచ్చిన మార్పు మంచికోసమొచ్చిందా, చేడూ కోసం వచ్చిందా అనే మీమాంశ కూడా జరుగుతుంది. చాలాసార్లు, ఆ ఆదర్శాలు వాళ్ళ కోరికలు తీరేవరకే, తీరిన తరవాత వాటితోనే జీవిస్తున్నారా లేదా అనేది అప్రస్తుతం అయిపోతుంది...

ఈలోగా ఆ ఆదర్శాలని అనుభవించిన తరానికి కొత్త కోరికలు పుట్టుకొస్తాయి... మరలా కొత్త ఆదర్శాలు, కొత్త ఆశయాలు...

అందుకే ఆదర్శానికి మూలాలు ఆ ఆదర్శాన్ని ప్రకటించే వారి స్వార్ధం లోనే ఉంటాయి. దాన్ని నిస్స్వార్ధంగా, దాని వల్ల తనకి ఉపయోగం లేకపోయినా, కేవలం ఆదర్శం కోసమే బతికే వాళ్ళు లక్షల్లో ఒకళ్ళు ఉంటారు...

ఎప్పుడైతే నేను అది తెలుసుకున్నానో, ఆదర్శాలని వెక్కిరించే వాళ్ళని అసహ్యించుకోవడం మానేసాను... ఎవరి స్వార్ధం వారిది అని మనసులో అనుకుని :-) ఎప్పుడో ఒకసారి వాళ్ళ స్వార్ధం కోసం ఆదర్శాన్ని ఆశ్రయిస్తారు, లేకపోతే స్వార్ధం కోసం ఆదర్శాన్ని వదిలేస్తారు...

ఆదర్శాలు నమ్మేవాళ్ళూ, నమ్మని వాళ్ళు ఒకరికొకరు హాని తలపెట్టుకోనంతవరకు నాకూ ఓకె.నేను పట్టించుకోను... నా స్వార్ధం నాది, నా ఆదర్శం నాది. వాళ్ళ స్వార్ధం వాళ్ళది, వాళ్ళ ఆదర్శాలు వాళ్ళవి...ఏకాంతపు దిలీప్http://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.com7tag:blogger.com,1999:blog-5847591884797664633.post-80336424160678417552010-11-12T04:27:00.001-08:002010-11-12T04:27:57.353-08:00ఒక చిన్న మాటఎదురు చూసిన పున్నమి రానే వచ్చింది

ఎన్నాళ్ళయ్యింది ఆకాశం కేసి చూసి?

పిల్ల గాలీ ఒక్కసారిగా పలకరిస్తున్నట్టుంది

ఏమైపోయింది ఇప్పటి వరకూ?

తారలన్నీ నన్నే చూస్తున్నట్టున్నాయి

వాటి తళుకులు నా కన్నుల్లో!

ఏది నా జాబిల్లి?

అదిగో!

ఒక చిన్న మాట ఇవ్వవా?

తనని నా దరికి చేరుస్తాననిఏకాంతపు దిలీప్http://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.com4tag:blogger.com,1999:blog-5847591884797664633.post-9743892532562748082010-11-11T02:37:00.000-08:002010-11-11T02:37:11.418-08:00కవిత-వర్ణన-భావుకత-వచనంఏమైనా, హృద్యమైన భావోద్రేకాలని సూటిగా చెప్పాలి అంటే నేను రాయడాన్ని ఆశ్రయించను. కవితా మార్గాన్ని అసలు ఎంచుకోను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నా చేత చెప్పించుకోవాలి అంటే, ముందు తను నాకేంటో అనేది నేను చెప్తుంటే వినాల్సిందే.. :) అలా చెప్పడం మొదలుపెట్టిన తరవాత, తను ఎంత ఎదురు చూసినా అసలు తనని ప్రేమిస్తునానని కూడా చెప్పకపోవచ్చు. కానీ, నా మాటలని తను వెతుక్కుంటే అంత కన్నా బరువైన, విలువైన భావాలని తను ఏరుకోవచ్చు. అసలు ఆ మాటలకోసమే ఎదురు చూసి, ఈ సుత్తంతా ఎందుకు అంటే, తనకి నా భావోద్రేకాలు అర్ధం కానట్టే! అప్పుడు అసలు తను నన్ను అర్ధం చేసుకున్నట్టేనా? ప్రేమించినట్టేనా? కానీ నేను తనని ప్రేమిస్తున్నాను అని నా ప్రతి వర్ణనలోనూ చెప్తున్నానే... నా వర్ణనలకి, నాలో భావావేశానికి ఆమే మీద ప్రేమే ప్రేరణే... కానీ కేవలం నా భావాన్నే వ్యక్తపరచాలి అంటే, నాలో భావావేశాన్ని నేను ఎవరితో పంచుకోను...

తనని చూడగానే పరుగున చెంత చేరి హత్తుకుని నువ్వంటే నాకిష్టం అంటే, అది చెప్పడానికి ఇలా పరుగుపెట్టి హత్తుకోవాలా? అక్కడ ఉండే చెప్పొచ్చు కదా అంటే..?! నా భావావేశం ఏం కానూ? దాన్ని ఎవరితో పంచుకోనూ?

అలంకారాలూ, అతిశయాలు లేని కవితను నేను అన్ని కాలాల్లో ఆస్వాదించలేను. నా వర్ణనని, భావావేశాన్ని పంచుకోలేని తను నా ప్రేమనీ ఆస్వాదించలేదు,నేను కూడా...

ఇంతకీ ఏది కవిత? ఏది వర్ణన? ఏది భావుకత? ఏది వచనం?ఏకాంతపు దిలీప్http://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.com6tag:blogger.com,1999:blog-5847591884797664633.post-89522782742921266772010-11-10T01:35:00.000-08:002010-11-10T10:38:30.457-08:00ఆలోచనలుఒకో క్షణం,

నన్ను ప్రశ్నిస్తాయి

నా అసహాయతని నిలదీస్తాయి

ఈ విశాల ప్రపంచంలో,

నా అస్థిత్వాన్ని శోధించమంటాయి

నేనేంటో తెలియని నన్ను నిర్దాక్షిణ్యంగా ఒంటరిని చేస్తాయి

చంచలత్వంతో మోసం చేస్తాయి

నా నమ్మకాన్ని వెక్కిరిస్తాయి

వాటిని పంచుకున్న పదిమందిలో

నన్ను అల్పుడుని చేస్తాయి

అనుక్షణం వెంటాడుతూ

నాతో పోరాడతాయి

నే పోరాడలేనని ఎదిరిస్తే

నాకు దూరమై శిక్షిస్తాయి...ఏకాంతపు దిలీప్http://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.com5tag:blogger.com,1999:blog-5847591884797664633.post-21781000846803198172010-11-02T12:03:00.000-07:002010-11-02T12:16:41.707-07:00ఆరాటాల పోరాటాలుఎడారి దాటి అలసిన నాకు సముద్రమే ఎదురైంది

అలలా కవ్విస్తూ నను తాకావు నీవు

నేను ఆరాటపడ్డాను
నీ మనసు తెలుసుకోవాలని
నీతో మనసు విప్పి మాట్లాడాలనుకున్నాను
నీ మనసులో చోటు సంపాదించాలని
నా ఆరాటాన్ని ఆరాధించావు
నువ్వూ నా కోసం ఆరాటపడ్డావు

నీ మనసు విప్పే ప్రయత్నం చేస్తావు
ఆశగా అమాంతం లోనికి చొరబడాలని చూస్తాను
లోన ఇంకెవరో ఉంటారు
వాకిట నుండే వెనుదిరుగుతాను
నే వెళ్ళిపోతుంటే నను ప్రేమగా చూస్తావు
నాకు తెలుసు నువ్వు నన్ను అలా చూస్తావని
అందుకే వీడ్కోలు చెప్పకుండానే వెళ్ళిపోతాను
కన్నీళ్ళకి సిగ్గూ లేదు, ధైర్యమూ లేదు

ఎప్పుడు ఆరుతుందో ఈ ఆరాటం
ఎందుకు పుడుతుందో తీరం వదిలే ఆ కెరటం?ఏకాంతపు దిలీప్http://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.com7tag:blogger.com,1999:blog-5847591884797664633.post-44023836321859070992010-10-29T06:32:00.000-07:002010-10-29T06:52:54.252-07:00కడలి - ఆకాశంపున్నమి తెచ్చిపెట్టే ఆకాశపు అందాలు చూస్తూ
ఆ పున్నమి తనలో పుట్టించే ఆశల కెరటాలతో
ఆకాశాన్ని అందుకోవాలనుకునే కడలి
కడలి ఆశలని తనివి తీరా ఆస్వాదించే ఆకాశం

పున్నమి జారిపోయింది
ఆశలూ అణిగిపోయాయి

ఎవరెవరు ఎవరెవరికి ఎవరో?

భావావేశపు అలలు సద్దుమణిగి
లోపలికి వెలుగు వ్యాప్తి చెందితే
కడలి ఆకాశాన్ని అందుకోవాలనుకోదేమో
ఆశ పడ్డ ఆకాశాన్ని నిందించకుండా
దాని అందాన్ని ఆస్వాదిస్తుంది
ప్రశాంతతలో అంతఃప్రకాశంతో తన అందాన్నీ ఆస్వాదిస్తుంది

అపుడు ఎవరికి వారికి ఎవరెవరు ఏంటో ద్యోతకమవుతుంది

కడలి ఆకాశానికి దూరంగా ఉంటూనే ఆవిరై చేరుతుంది
ఆకాశం కడిలికి దూరంగా ఉంటూనే తియ్యని వాన జల్లై వాలిపోతుంది

నేను నా బ్లాగులో రాసినదానికన్నా బ్లాగ్ స్నేహితుల బ్లాగుల్లో రాసినవే ఎక్కువ. వాటిని నా బ్లాగులో కూడా పెట్టమని అడిగేవారు.బద్ధకంతో ఇక్కడ పెట్టే వాడిని కాదు. ఇప్పుడు ఎందుకో బుద్ధి పుట్టింది.మీకు మీ మీ బ్లాగుల్లో నేను రాసినవి నచ్చి గుర్తుంటే నాకు చెప్పండి. ఇక్కడ పెట్టేస్తే ఓ పనైపోతుంది... :) నాకు గుర్తున్నవి కొన్ని నా బ్లాగ్ కి జత చేస్తా...ఏకాంతపు దిలీప్http://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.com5tag:blogger.com,1999:blog-5847591884797664633.post-38473205418487698112010-10-20T04:19:00.000-07:002010-10-20T06:13:20.281-07:00జాగృతి సేయరా { గీతాంజలి ~ 26 }
ఆతను నా చెంత చేరి నా పక్కనే ఆసీనుడైనాడు, అయినా నే మేలుకో లేదు
ఎంతటి పాడు నిద్ర! దౌర్భాగ్యుడిని కదా!

నిశీధి నిశ్శబ్ధతలో చేతిలో వీణతో చేరి రాగాలు పలికించాడు.
ఆ రాగాల మాధుర్యంతో నా కలలు అనునదించాయి

నిదురలో తన ఉనికి నను తాకినా , ఎందుకు ఆతని దర్శనం ఎప్పుడూ చేజారిపోతుంది?
అయ్యో! ఎందుకు నా రాత్రులు అలా జారిపోతున్నాయి?

చావా కిరణ్ అనువాదం ఇక్కడ

He came and sat by my side but I woke not. What a cursed sleep it was, O miserable me!

He came when the night was still; he had his harp in his hands, and my dreams became resonant with its melodies.

Alas, why are my nights all thus lost? Ah, why do I ever miss his sight whose breath touches my sleep?ఏకాంతపు దిలీప్http://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.com2tag:blogger.com,1999:blog-5847591884797664633.post-36926142795688502342010-10-13T06:40:00.000-07:002013-07-28T12:48:37.816-07:00సేదతీరనీ { గీతాంజలి ~ 25 }

బడలికైన రేయిలో నన్ను ప్రయాస పడకుండా నిదురలోకి జారుకోనివ్వు, నా నమ్మకాన్ని నీపై ఉంచి

నీరసిస్తున్న నా చిత్తాన్ని నీ ఆరాధనకై నిస్సారమైన సన్నాహానికి నెట్టుకోనీకు స్వామీ!

హాయిగొలుపు తొలి వేకువ మేల్కొలుపులో పొద్దు వెలుగుని పునరుద్ధరించేందుకు

తన అలసిన నయనాలపై చీకటి దుప్పటి కప్పేది నీవే కదా స్వామీ!

చావా కిరణ్ అనువాదం ఇక్కడ

In the night of weariness let me give myself up to sleep without struggle, resting my trust upon thee.

Let me not force my flagging spirit into a poor preparation for thy worship.

It is thou who drawest the veil of night upon the tired eyes of the day to renew its sight in a fresher gladness of awakening.

ఏకాంతపు దిలీప్http://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.com1tag:blogger.com,1999:blog-5847591884797664633.post-87597599563577832292010-10-08T05:22:00.000-07:002010-10-10T11:49:15.457-07:00పొద్దుగూకిపోతే { గీతాంజలి ~ 24 }
పొద్దుగూకిపోతే
కిలకిలలిక లేకపోతే
వీచేగాలి అలసిపోతే
నీవు ఈ జగత్తుని మత్తు ముసుగుతో చుట్టివేస్తూ
సందెవేళ వాలిపోయే ఆ కలువల రేకులని సుతారంగా దగ్గర చేస్తూ
అపుడు నా పైనా చీకటి తెరని కప్పు స్వామీ!

ఏ బాటసారి వనరులు గమ్యం చేరకుండానే నిండుకుంటాయో
వస్త్రాలు చిరిగి మకిలౌతాయో
బలం ఉడిగిపోతుందో
అతని చిన్నతనాన్ని, దీనతని తొలగించు.
చీకటి చాటున ఆ పూవుని ఆదరించినట్టు అతని జీవనాన్నీ పునరుద్ధరించు స్వామీ!

చావా కిరణ్ అనువాదం ఇక్కడ

If the day is done, if birds sing no more, if the wind has flagged tired, then draw the veil of darkness thick upon me, even as thou hast wrapt the earth with the coverlet of sleep and tenderly closed the petals of the drooping lotus at dusk.

From the traveller, whose sack of provisions is empty before the voyage is ended, whose garment is torn and dustladen, whose strength is exhausted, remove shame and poverty, and renew his life like a flower under the cover of thy kindly night.ఏకాంతపు దిలీప్http://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5847591884797664633.post-29304039306494649382010-09-28T12:32:00.000-07:002011-08-27T23:26:18.778-07:00ఎక్కడ ఉన్నావు నేస్తమా? { గీతాంజలి ~ 23 }
ఈ తుఫాను రేయి నీ ప్రేమ యాత్ర లో ఎక్కడ ఉన్నావు, నా నేస్తమా?

నింగి నిస్పృహతో నిట్టూర్చుతుంది.

ఈ రేయి నాకు కునుకు లేదు.

అప్పుడప్పుడూ తలుపు తెరచి చీకటిన నీకై వేచి చూస్తున్నాను, నేస్తమా!

నా ఎదుట ఎమీ కాన రావడం లేదు.

నువ్వు ఎక్కడున్నావో అని మథనపడుతున్నాను.

నా చెంత చేరడానికి

ఏ కాళ నదీ మసక తీరాన్నో,

కాఱడివి అంచుల్లోనో,

కటిక చీకటి చిక్కుల గుండానో నీ గమనాన్ని సాగిస్తున్నావా, నా నేస్తమా?

చావా కిరణ్ అనువాదం ఇక్కడ

Art thou abroad on this stormy night on thy journey of love, my friend? The sky groans like one in despair.

I have no sleep tonight. Ever and again I open my door and look out on the darkness, my friend!

I can see nothing before me. I wonder where lies thy path!

By what dim shore of the ink-black river, by what far edge of the frowning forest, through what mazy depth of gloom art thou threading thy course to come to me, my friend?
ఏకాంతపు దిలీప్http://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.com0tag:blogger.com,1999:blog-5847591884797664633.post-23770181964815812812010-09-27T11:50:00.000-07:002010-09-27T12:07:17.349-07:00వస్తావు కదా మిత్రమా? { గీతాంజలి ~ 22 }కారు శ్రావణపు పెన్నీడల మాటున,
నిశీధిలా నిశ్శబ్దంగా రహస్య అడుగులతో కాపరులని తప్పించుకు తిరుగుతావు.

ఈ రోజు పొద్దు కళ్ళు మూసుకునే ఉంది,
తీవ్రమైన తూర్పు గాలుల పట్టు విడవని పిలుపులని లెక్క చేయక.

నిత్య జాగరూకమైన నీలాకాశం మీద నీరంధ్రమైన తెర పరచబడింది.
వనాల్లో స్వనాలు సద్దుమణిగాయి. ప్రతి ఇంటా తలుపులు మూసుకున్నాయి.
ఈ నిర్జన వీధిలో ఏకాకి బాటసారివి నీవు.

ఓ నా ఏకైక మిత్రమా, ప్రియాతి ప్రియతమా,
నా ఇంట తలుపులు తెరిచే ఉన్నాయి - కలలా దాటిపోవు కదూ?

చావా కిరణ్ అనువాదం ఇక్కడ

In the deep shadows of the rainy July, with secret steps, thou walkest, silent as night, eluding all watchers.

Today the morning has closed its eyes, heedless of the insistent calls of the loud east wind, and a thick veil has been drawn over the ever-wakeful blue sky.

The woodlands have hushed their songs, and doors are all shut at every house. Thou art the solitary wayfarer in this deserted street. Oh my only friend, my best beloved, the gates are open in my house---do not pass by like a dream.ఏకాంతపు దిలీప్http://www.blogger.com/profile/00862202473562556085noreply@blogger.com0