ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Wednesday, April 21, 2010

అల్లుకున్న పువ్వు



ఏ తోటమాలి అంటుకట్టాడో ఆ తీగని
హుందాగా కాస్తుంది నిండుగా విచ్చుకుంటున్న ఆ పూవుని
గాలికి నాట్యమాడిస్తుంది కానీ పడనీయదు
నేలని ముద్దాడిస్తుంది కానీ మట్టి అంటనీయదు
తీగకి పువ్వు ఎప్పుడూ ముద్దే కదా
తన ఒడిని వదులుతుందని తెలిసీ సాకుతుంది!
వదిలి ఎటు చేరుతుందో?

తీగ ఏం చేస్తున్నా
పువ్వుకి ప్రోది చేస్తూనే ఉంటుంది
పువ్వు విధిగా పరిమళాలని వెదజల్లుతుంది

ఇంతకీ ఇక్కడికి ఎప్పుడు చేరాను
ఆ హిమ బిందువే కదా! పువ్వుపై చేరి తెలి కిరణాల మెరుపుతో
నన్నిక్కడికి రప్పించింది.

ఇదిగో! పరిమళాల పరవశపు మైమరపులో నేను

చేరువ కాగలనే కానీ చేరువ చేసుకోలేనే
తీగ నుండి వేరు చెయ్యలేనే

ఆ తీగనే అడగనా?
ఆ పందిరిని అడగనా?
పోనీ, ఆ తోటమాలినే అడగనా?
ఈ పువ్వుకో గమ్యం ఉంటే
అది నా హృదయపు లోగిలి కావాలని

Saturday, April 17, 2010

నెలవంక


నేల వంక చూపులు
నిట్టూర్పుకి ఆనవాలు

జీవన సాగరంలో
ఆశా నిరాశల
ధ్యాస అడియాసల ఆటు పోట్లు
ఏకాంత నౌకని ఓలలాడిస్తుంటాయి
వెన్నెల తీరాలని ఎండమావులు చేస్తూ

పున్నమి సమీపిస్తున్న కొద్దీ
ఆ ఆటు పోట్ల చెలగాటం ఉధృతమవుతుంది
ఏకాంతరంగాల్లో అలజడి తీవ్రమవుతుంది
అయినా ఆశల దిక్సూచి పని చేస్తూనే ఉంటుంది
వెన్నెల తీరాన్ని అన్వేషిస్తూ నౌక సాగుతూనే ఉంటుంది

అవును
నేల వంక చూపులు
నిట్టూర్పుకి ఆనవాలు

ఆశని శ్వాసించుకుని
చూపులు నింగిలోకి
అదిగో నవ్వుతూ నెలవంక

Tuesday, April 13, 2010

తోడు

పార్క్లో
చిలకల జంట
కలిసి తింటున్నాయి

~~~

అతడు ఆమె
అతడామె
ఆమ్యతడు

~~~

అన్నీ
జంట మందారాలే
ఆ మందార మొక్కకు

~~~

కార్లో
ముందు అతను ఆమె
వెనుక నేను

~~~

వర్షం మొదలైంది
చేతిలో టీ కప్పు, బాల్కనీలో బట్టలు
ఏం చెయ్యను?

~~~

ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద
మల్లెపూలు అమ్ముతున్నారు
తీసుకోనా?

~~~

Friday, April 9, 2010

'బజ్' ప్రేరేపితాలు :-)

మబ్బు పట్టిన ఆకాశపు అసలు రంగేంటో?
నాకు తెలిసేదెలా?

~~~~~~~~~~

వయసు మలుపుల్లో
మనసు చెట్టుకు వలపు దెబ్బలు
ఎదురుచూపులకు కళ్ళు కాయలు

~~~~~~~~~~

యాతమేసి తోడినా ఏరు ఎండదు
ఎన్ని బంధాలల్లుకున్నా మనసు పందిరి కూలదు

~~~~~~~~~~


నీకు తెలుసా
చేరువవ్వాలనే చొరవలో ఏకాంతం మన మధ్య తెరలని తెరచిందని
తెలుసుకోవాలనే తపనలో మన మౌనం కూడా ఊసులు పలికిందని

అసలు నీకెమైనా తెలుసా
ఇప్పుడీ ఏకాంతంలో మన మధ్య ఈ తెరలు ఎందుకో? అటూ ఇటూ ఒంటరిగా
మన మౌనం ఎందుకు మూగబోయిందో? అసలు ఊసులే కరువవుతూ

~~~~~~~~~~

Sunday, January 31, 2010

ఇది త్యజించు... { గీతాంజలి ~ 11 }

ఈ గానా భజానా జప తపాలని త్యజించు
తలుపులన్నీ మూసుకుని ఈ ఏకాంత మందిరంలో
మూలన చీకట్లో ఎవరిని పూజిస్తున్నావు?
నీ కళ్ళు తెరువు, నీ దేవుడు నీ ముందు సాక్షాత్కరించలేదు!

ఎక్కడ రైతు కటిక నేలని దున్నుతున్నాడో
ఎక్కడ బాటలు పరచు వాడు రాళ్ళని బద్ధలుకొడుతున్నాడో అక్కడ ఆతను ఉంటాడు.
వాళ్ళతో ఎండలోనూ వానలోనూ ఉంటాడు.
ఆతని వస్త్రాలు దుమ్ముతో కప్పబడి ఉంటాయి.
నీ పవిత్రమైన తొడుగుని త్యజించు, అతనిలా ఈ మురికి నేల మీదకి రా!

విముక్తా? ఎక్కడ దొరుకుతుందీ విముక్తి?
ఆ ప్రభువు తనంతట తాను ఈ సృష్టి బంధనాలతో ఆనందంగా పెనవేసుకున్నాడు.
ఆతడు మనకెప్పటికీ బంధీయే.

నీ ధ్యాన ముద్ర నుండి బయటకి రా, నీ పూలనీ ధూపాన్నీ త్యజించు.
నీ వస్త్రాలు చినిగితేనో, మరకలైతేనో జరిగే హాని ఏముంది?
పరిశ్రమతోనూ నీ కనుబొమ్మలపై చిందించే స్వేదంతోనూ ఆతనిని కలువు
ఆతని పక్కనే నిలబడు.




Leave this chanting and singing and telling of beads! Whom dost thou worship in this lonely dark corner of a temple with doors all shut? Open thine eyes and see thy God is not before thee!

He is there where the tiller is tilling the hard ground and where the pathmaker is breaking stones. He is with them in sun and in shower, and his garment is covered with dust. Put of thy holy mantle and even like him come down on the dusty soil!

Deliverance? Where is this deliverance to be found? Our master himself has joyfully taken upon him the bonds of creation; he is bound with us all for ever.

Come out of thy meditations and leave aside thy flowers and incense! What harm is there if thy clothes become tattered and stained? Meet him and stand by him in toil and in sweat of thy brow.

Wednesday, January 27, 2010

నిర్గతి... { గీతాంజలి ~ 10 }

ఎక్కడైతే అనాధలు దీనులు అసహాయులు నివసిస్తారో
అక్కడే నీవు పాదాలు మోపుతావు. అక్కడే నీ పాద పీఠం.

నేను నీకు ప్రణమిల్లడానికి ప్రయత్నించినప్పుడు,
ఎక్కడ అనాధలు దీనులు అసహాయులు మధ్య నీ పాదాలు మోపుతావో,
నా ప్రణతి ఆ లోతుకి చేరుకోలేకపోతుంది.

ఆశ్రితుల వస్త్రాలలో ఎక్కడైతే నీవు అనాధలు దీనులు అసహాయులు మధ్య
నడుస్తున్నావో అక్కడికి అతిశయం ఆశ్రయించలేదు.

ఎక్కడైతే నీవు తోడులేని వారితో సావాసం చేస్తావో,
ప్రభూ!అక్కడికి నా హృదయం తన దారిని ఎప్పటికీ కనుగొనలేదు.




Here is thy footstool and there rest thy feet where live the poorest, and lowliest, and lost.

When I try to bow to thee, my obeisance cannot reach down to the depth where thy feet rest among the poorest, and lowliest, and lost.

Pride can never approach to where thou walkest in the clothes of the humble among the poorest, and lowliest, and lost.

My heart can never find its way to where thou keepest company with the companionless among the poorest, the lowliest, and the lost.

Wednesday, September 2, 2009

చిన్మయ సూక్తి... { గీతాంజలి ~ 9 }



ఓ అవివేకీ, నిన్ను నీ భుజాలపై మోసుకో యత్నించు! ఓ బికారీ, నీ గడప వద్దకొచ్చి యాచించు!

నీ భారాన్నంతా అన్నీ మోయగల ఆతని చేతుల్లో వదిలివేయి, ఇక ఎన్నడూ విచారంతో వెనుదిరిగి చూడకు.

నీ కోరిక తన ఊపిరి తాకిన దీపం నుండి వెలుగుని ఒక్కసారిగా పోగొడుతుంది. అది కల్మషమైనది - మలినమైన దాని చేతులతో నీ కానుకలని తీసుకోకు. పవిత్రమైన ప్రేమతో అందించినవే స్వీకరించు.





O Fool, try to carry thyself upon thy own shoulders! O beggar, to come beg at thy own door!

Leave all thy burdens on his hands who can bear all, and never look behind in regret.

Thy desire at once puts out the light from the lamp it touches with its breath. It is unholy - take not thy gifts through its unclean hands. Accept only what is offered by sacred love.