ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Wednesday, June 18, 2008

మోసం


పార్క్లో కొత్తగా వచ్చిన మెరిసే దీపం
నన్ను ఈ రాత్రి దిగ్భ్రాంతికి గురిచేస్తుంది
వెన్నెల పట్ల నా విశ్వాసాన్ని వెకిలిగా ప్రశ్నిస్తుంది
ఏ పున్నమి రాత్రి కోసం ఎదురుచూస్తానో
ఆ రాత్రిని నేను కనుగోలేకపోయానని..!

మరోసారి నా కళ్ళు నన్ను మోసం చేసాయి...

అట్టడుగున ఉన్న ప్రశ్నలు ఉబికి పైకి వస్తున్నాయి

కనిపించేదంతా అందం కాదు అని నమ్మిన నా కళ్ళు
కనిపించే అందాన్ని ఎందుకు ఆరాధిస్తున్నాయో
నాకర్ధం కావటం లేదు

ఆప్తుని జ్ఞాపకాలతో తడిసిన నా కళ్ళు
తను శాశ్వతంగా దూరమైనప్పుడు ఎందుకు తడవలేదో
నాకర్ధం కావటం లేదు

నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయి

ఈ క్షణంలో నాకు కళ్ళు మూసుకోవాలని ఉంది
నా పండు చందమామని,నిండు వెన్నెలని చూడాలని ఉంది
నిజమైన అందాన్ని శోధించాలని ఉంది
తడి లేని ఏడుపు ఏడవాలని ఉంది.

26 comments:

సూర్యుడు said...

బాగుంది కవిత

నిషిగంధ said...

I think this is the BEST of all your poems!!

'వెన్నెల పట్ల నా విశ్వాసాన్ని వెకిలిగా ప్రశ్నిస్తొంది ' చాలా బావుందీ లైన్.. అలాగే ఆఖరి ఖండిక కూడా! ఇప్పటికి ఎన్నిసార్లు చదివానో.. :-)

Bolloju Baba said...

కవిత లోని ఆర్ధ్రత గుండెను తాకింది.
సూటిగా స్పష్టంగా భావాలు, పదాల మద్య పరచుకున్నాయి.

తీవ్ర భావోద్వేగానికి, అనంత నిస్సహాయతకు, తీర్చలేని వేదనకు, చివరి స్థితి ని తెలియచేయటానికి తడిలెని ఏడుపు అన్న పదచిత్రం అద్భుతం గా సరిపోయింది.
రెండే రెండు చిన్న మాటలు, పైన చెప్పిన మానసిక స్థితిని సంపూర్ణంగా ఆవిష్కరించటం జరిగింది.

చాలా చాలా బాగుంది, మీ కవిత.
బొల్లోజు బాబా

Kathi Mahesh Kumar said...

భావుకతని వెక్కిరించే నవీనతపై ఎక్కుపెట్టిన హరి‘విల్లు’ లాంటి కవిత.స్వగతమే అయినా,సమాజ పయనాన్ని ప్రశ్నించినట్టుగా ఉంది.

Purnima said...

dileep:

ఆప్తుని జ్ఞాపకాలతో తడిసిన నా కళ్ళు
తను శాశ్వతంగా దూరమైనప్పుడు ఎందుకు తడవలేదో
-ee line ni digest chesukovatam naa valla kaavatam ledu. ennallagaano naa antharsangarshanani noru kattesi koorchObaditE.. mee kavita mallee rependi. I'm disturbed thorougly.

kavita baagundi, praasa baagundi, ee bhaavam baagundi.. mee prayasa baagundi.. ilantivi emi cheppalenu.

idi ok kavitalaa kaadu.. naa manasulaa anipistundi ee kshanam.

రాఘవ said...

చర్మచక్షువు మూసి మనోనేత్రంతో చందమామనీ వెన్నెలనీ చూడాలన్న భావన, దాగున్న మనో వేదన చక్కగా చెప్పారు.

రాధిక said...

పార్కు కీ మీకూ ఏదో ఒక అవినాభావ సంబధం వున్నట్టుంది.పా పదమున్న మీ కవితలన్నీ బాగుంటున్నాయి.కవిత కవిత కీ చాలా మెట్లు ఎక్కేస్తున్నారు.పరిణితి సాధిస్తున్నారు.చాలా బాగా రాసారు.గత రెండు సార్లుగా అనుకుంటూ వున్నాను ఈ కవిత ది బెస్ట్ అని.ఇప్పుడు ఆ రెండూ వదిలేసి దీనికి చెపుతున్నాను.మీరు రాసిన వాటిన వాటిలో ఇది బెస్ట్.తరువాతి సారి కూడా ఇలానే అనిపించుకోవాలని ఆశిస్తున్నాను.

Anonymous said...

మీ కవితలు చాలా అర్ధవంతంగానూ లొతుగానూ అనిపిస్తాయి. చాలా బావుంది దిలీప్

ఏకాంతపు దిలీప్ said...

@ సూర్యుడు
నెనర్లు :-)

ఏకాంతపు దిలీప్ said...

@ నిషిగంధ
మీ ప్రశంస ని తట్టుకోలేకపోతున్నాను... థాంక్ యూ :-)

ఏకాంతపు దిలీప్ said...

@బాబా గారు
ధన్యుణ్ని.. మీరు చెప్పిన భావనలన్నీ నన్ను ఇది రాసేట్టు పురికొల్పింది... మరో సారి నన్ను తాకారు.

ఏకాంతపు దిలీప్ said...

@కత్తి మహేష్ గారు
భావుకత గురించి తెలుసు గానీ నవీనత గురించి తెలియదు. అయినా నన్ను నవీన భావుకుడిని అనుకుంటాను.. :-) మీకు నెనర్లు.

ఏకాంతపు దిలీప్ said...

@పూర్ణిమ
I am sorry that it disturbed you but content that it spilled out your heart's content. And then, it must have brought peace in that regard.

మీ చిన్న కవిత నాకు నచ్చింది :-)
... అయితే నా కవితకి హాయ్ :-)

ఏకాంతపు దిలీప్ said...

@ రాఘవ గారు
నెనర్లు. మీ బ్లాగు ఇప్పుడే చూసాను. మీరింకా చందస్సుతో పద్యాలు రాయగలుగుతున్నారు... నిజంగా గ్రేట్...

ఏకాంతపు దిలీప్ said...

@ రాధిక గారు
చాలా థాంక్స్ అండి.. మీరిలా మెట్లు పెంచుకుంటూ పోతే నేను ఎక్కలేనేమో అనిపిస్తుంది...

ఏకాంతపు దిలీప్ said...

@ కీర్తి
నెనర్లు అంటే థాంక్స్ :-) మీరు తెలుగులో రాసారు...!! నేనిక్కడ ఎగిరి గంతేసేసాను... :-)

saisahithi said...

చాలా బాగుంది...మీ కవిత...
నిండు పున్నమి వెన్నెలలు
పచ్చ ని మైదానాలు
కారు మబ్బులు నిండిన ఆకాశం ...ఇలాటి
ప్రకృతి వర్ణనలు ఈ మధ్య కవితల్లో కనిపించటం లేదు.
వెండి వెన్నెలలని ఎ న్ని దీపాలు భర్తీ చేయగలవు.

Purnima said...

kavita ki photo ki link enti?

bharinchaleni anta velugu choopiste kaani kallu moosukuvu.. appudu gaani nijamaina andam kanipinchadu anaa??

Trying to play on the weakness of the eyes for the ultimate vision??

Purnima said...

kavita ki photo ki link enti?

bharinchaleni anta velugu choopiste kaani kallu moosukuvu.. appudu gaani nijamaina andam kanipinchadu anaa??

Trying to play on the weakness of the eyes for the ultimate vision??

ఏకాంతపు దిలీప్ said...

@ పూర్ణిమ

చిత్రంలో ఆ దీపపు కాంతి నేను పార్క్లో చూసిన కాంతి కన్నా ఎక్కువగా ఉంది. It is more than glorifying what I had seen. నేను చూసిన దృశ్యానికి దగ్గరగా ఇంకో చిత్రం దొరకలేదు.

1. దగ్గరగా ఉన్న ప్రకాశవంతమైన ఆ కాంతిలో నా వెన్నెలని నేను కనుగొనలేకపోయాను.
2. పైగా ఆ కాంతి బాగుందనుకుని అదే పనిగా చూసాను.
3. పౌర్ణమి అని తెలిసిన తరవాత దిగ్బ్రాంతికి గురయ్యాను. ఎందుకంటే నాకిష్టమైన పౌర్ణమిని, వెన్నలని మరచిపోయాను కాబట్టి. అది వెన్నెల పట్ల నా విశ్వాసాన్ని(my loyality towards Vennala) ప్రశ్నించింది.

ఇంక మానవ సంభంధాల్లో, నాకున్న అనుభవాల్తో నేను అది అంతర్గతంగా అన్వయించుకోగలిగాను. ఇప్పుడే, ఇక్కడే(righ now, right here) అనే ఆలోచనవిధానంతో చాలా మంది(వాళ్ళకి తెలిసొ తెలియకొ), ఒకప్పుడు,అక్కడ ఉన్న దగ్గర స్నేహాలని పట్టించుకోరు. దగ్గర్లో లేకపోవడం అనేది వాళ్ళు ఒకప్పుడు ఒకళ్ళకి ప్రకటించిన తిరుగులేని విశ్వాసాన్ని(loyality) వొమ్ము చేస్తుంది. దగ్గర్లో ఉన్న కొత్త వారికి దగ్గర చేస్తుంది. జీవితంలో అనుభవించి, శోధించి వెలకట్టలేనిది అని భావించి విశ్వాసం ప్రకటించినదాన్ని దగ్గరితనం మత్తులో నిర్లక్ష్యం చేయ్యడం జరుగుతుంది. కొంత మంది ఈ సత్యాన్ని కనుగొంటారు, తెలుసుకొని గతంలో ఉన్న స్నేహాలని నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. కొంతమంది తెలుసుకుని కూడా ప్రయోజనవాదం అనే ముసుగు తొడుక్కుని, ఎక్కడికెళ్తే అక్కడే అన్నట్టు గడిపేస్తారు. విశ్వాసపు విలువలు వాళ్ళు జీవిత కాలంలో కనుక్కోలేరు.

నేను చూసిన దీపపు కాంతి ఒక కిలోమీటర్ దూరం నుండి చూసుంటే వెన్నెలని మరిచిపోయేవాన్ని కాదు. నా విశ్వాసం సడలిపోయేది కాదు. నేను అంత దగ్గరగా చూసాను కాబట్టి ఆ క్షణంలో ఆ వెలుగుకి ఆకర్షితుడిని అయిపోయాను. పౌర్ణమి అని కనుగొన్న మరుక్షణం చాలా ప్రశ్నలు ఎదురుకున్నాను. నా కళ్ళు నన్ను మోసం చేసాయనుకున్నాను. నా విశ్వాసం ప్రకటించడానికి కళ్ళతో చూడకూడదనుకున్నాను.

P.S:కొంచెం బిజీగా ఉన్నాను.

ఏకాంతపు దిలీప్ said...

@పూర్ణిమ
ఇక నువ్వు అనుకున్న ఊహ కూడా దానికి సరిపోతుంది అనిపిస్తుంది. :-)

Purnima said...
This comment has been removed by the author.
Anonymous said...

Normalga Naaku kavithaliki vivarana vunte baaguntundi anipisthundi chadivetappudu...
endukaano ii kavitha chadivettappu vunnatha vooha sakthi mee vivarana chadivetappadu kalagaledu...
adenemo kavithalo vunna goppadanam...

Anonymous said...

last linelo chinna correctiom...

adenemo KAVITHALALO vunna goppadanam...

Purnima said...

@vamsi: even i agree with you.

reading poetry and comprehending itself makes you a poet!! Good point!!

ఏకాంతపు దిలీప్ said...

@ పూర్ణిమ
@ వంశి
నెనర్లు :-)
నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను... ఆ వివరణ రాసినప్పుడు కూడ నాకు సంతృప్తి కలగలేదు. ఇంకా చాలా చాలా చెప్పాలనిపించింది.