ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Friday, October 29, 2010

కడలి - ఆకాశం

పున్నమి తెచ్చిపెట్టే ఆకాశపు అందాలు చూస్తూ
ఆ పున్నమి తనలో పుట్టించే ఆశల కెరటాలతో
ఆకాశాన్ని అందుకోవాలనుకునే కడలి
కడలి ఆశలని తనివి తీరా ఆస్వాదించే ఆకాశం

పున్నమి జారిపోయింది
ఆశలూ అణిగిపోయాయి

ఎవరెవరు ఎవరెవరికి ఎవరో?

భావావేశపు అలలు సద్దుమణిగి
లోపలికి వెలుగు వ్యాప్తి చెందితే
కడలి ఆకాశాన్ని అందుకోవాలనుకోదేమో
ఆశ పడ్డ ఆకాశాన్ని నిందించకుండా
దాని అందాన్ని ఆస్వాదిస్తుంది
ప్రశాంతతలో అంతఃప్రకాశంతో తన అందాన్నీ ఆస్వాదిస్తుంది

అపుడు ఎవరికి వారికి ఎవరెవరు ఏంటో ద్యోతకమవుతుంది

కడలి ఆకాశానికి దూరంగా ఉంటూనే ఆవిరై చేరుతుంది
ఆకాశం కడిలికి దూరంగా ఉంటూనే తియ్యని వాన జల్లై వాలిపోతుంది


--------------------------------------------------------------------------------
నేను నా బ్లాగులో రాసినదానికన్నా బ్లాగ్ స్నేహితుల బ్లాగుల్లో రాసినవే ఎక్కువ. వాటిని నా బ్లాగులో కూడా పెట్టమని అడిగేవారు.బద్ధకంతో ఇక్కడ పెట్టే వాడిని కాదు. ఇప్పుడు ఎందుకో బుద్ధి పుట్టింది.మీకు మీ మీ బ్లాగుల్లో నేను రాసినవి నచ్చి గుర్తుంటే నాకు చెప్పండి. ఇక్కడ పెట్టేస్తే ఓ పనైపోతుంది... :) నాకు గుర్తున్నవి కొన్ని నా బ్లాగ్ కి జత చేస్తా...

Wednesday, October 20, 2010

జాగృతి సేయరా { గీతాంజలి ~ 26 }


ఆతను నా చెంత చేరి నా పక్కనే ఆసీనుడైనాడు, అయినా నే మేలుకో లేదు
ఎంతటి పాడు నిద్ర! దౌర్భాగ్యుడిని కదా!

నిశీధి నిశ్శబ్ధతలో చేతిలో వీణతో చేరి రాగాలు పలికించాడు.
ఆ రాగాల మాధుర్యంతో నా కలలు అనునదించాయి

నిదురలో తన ఉనికి నను తాకినా , ఎందుకు ఆతని దర్శనం ఎప్పుడూ చేజారిపోతుంది?
అయ్యో! ఎందుకు నా రాత్రులు అలా జారిపోతున్నాయి?చావా కిరణ్ అనువాదం ఇక్కడ


He came and sat by my side but I woke not. What a cursed sleep it was, O miserable me!

He came when the night was still; he had his harp in his hands, and my dreams became resonant with its melodies.

Alas, why are my nights all thus lost? Ah, why do I ever miss his sight whose breath touches my sleep?

Wednesday, October 13, 2010

సేదతీరనీ { గీతాంజలి ~ 25 }

బడలికైన రేయిలో నన్ను ప్రయాస పడకుండా నిదురలోకి జారుకోనివ్వు, నా నమ్మకాన్ని నీపై ఉంచి

నీరసిస్తున్న నా చిత్తాన్ని నీ ఆరాధనకై నిస్సారమైన సన్నాహానికి నెట్టుకోనీకు స్వామీ!

హాయిగొలుపు తొలి వేకువ మేల్కొలుపులో పొద్దు వెలుగుని పునరుద్ధరించేందుకు
తన అలసిన నయనాలపై చీకటి దుప్పటి కప్పేది నీవే కదా స్వామీ!
చావా కిరణ్ అనువాదం ఇక్కడ
In the night of weariness let me give myself up to sleep without struggle, resting my trust upon thee.

Let me not force my flagging spirit into a poor preparation for thy worship.

It is thou who drawest the veil of night upon the tired eyes of the day to renew its sight in a fresher gladness of awakening.

Friday, October 8, 2010

పొద్దుగూకిపోతే { గీతాంజలి ~ 24 }


పొద్దుగూకిపోతే
కిలకిలలిక లేకపోతే
వీచేగాలి అలసిపోతే
నీవు ఈ జగత్తుని మత్తు ముసుగుతో చుట్టివేస్తూ
సందెవేళ వాలిపోయే ఆ కలువల రేకులని సుతారంగా దగ్గర చేస్తూ
అపుడు నా పైనా చీకటి తెరని కప్పు స్వామీ!

ఏ బాటసారి వనరులు గమ్యం చేరకుండానే నిండుకుంటాయో
వస్త్రాలు చిరిగి మకిలౌతాయో
బలం ఉడిగిపోతుందో
అతని చిన్నతనాన్ని, దీనతని తొలగించు.
చీకటి చాటున ఆ పూవుని ఆదరించినట్టు అతని జీవనాన్నీ పునరుద్ధరించు స్వామీ!చావా కిరణ్ అనువాదం ఇక్కడ


If the day is done, if birds sing no more, if the wind has flagged tired, then draw the veil of darkness thick upon me, even as thou hast wrapt the earth with the coverlet of sleep and tenderly closed the petals of the drooping lotus at dusk.

From the traveller, whose sack of provisions is empty before the voyage is ended, whose garment is torn and dustladen, whose strength is exhausted, remove shame and poverty, and renew his life like a flower under the cover of thy kindly night.