ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Friday, August 21, 2009

తల్లీ,ఆడుకోనీవు!...{గీతాంజలి~8}



రాకుమారుని వస్త్రాలలో, మెడ చుట్టూ రతనాల హారాలతో అలంకృతుడైన చిన్నారి ఆటలో ఆనందాన్ని కోల్పోతాడు; అతని దుస్తులు అడుగడుగునా అడ్డుతగులుతాయి.

అవి చిరిగిపోతాయనో లేక దుమ్ముతో మరకలవుతాయనో భయంలో తనని తాను లోకానికి దూరం చేసుకుంటాడు, కదలడానికీ భయపడతాడు.

తల్లీ, నీ ముస్తాబుల పాశం, అతనిని కులాసైన ఈ నేల ధూళి నుండి వేరు చేస్తే, సర్వ జన జీవనాల మహా కొలువులోకి ప్రవేశపు హక్కుని అతనికి దూరం చేస్తే, ప్రయోజనం కాదు.




The child who is decked with prince's robes and who has jewelled chains round his neck loses all pleasure in his play; his dress hampers him at every step.

In fear that it may be frayed, or stained with dust he keeps himself from the world, and is afraid even to move.

Mother, it is no gain, thy bondage of finery, if it keeps one shut off from the healthful dust of the earth, if it rob one of the right of entrance to the great fair of common human life.

Monday, August 17, 2009

వినతి... {గీతాంజలి ~ 7}



నా పాట తన అలంకరణలని వదులుకుంది. తనకి అలంకారాల, ఆహార్యాల అతిశయం లేదు. ఆభరణాలు మన కలయికని చెడగొడతాయి; అవి నీకూ నాకూ మధ్యగా వస్తాయి; వాటి గలగలలు నీ మెత్తని మాటలని ముంచేస్తాయి.

నా కవి గర్వం నీ ఎదుట చిన్నతనంతో చచ్చిపోతుంది. ఓ కవీశ్వరా, నీ పాదాల చెంత కూర్చున్నాను. ఆ వెదురు వేణువులాగా, నీ చేత రాగాలు నింప, నా జీవనాన్ని నిరాడంబరంగా, సరళంగా మాత్రం చేసుకోనివ్వు.




My song has put off her adornments. She has no pride of dress and decoration. Ornaments would mar our union; they would come between thee and me; their jingling would drown thy whispers.

My poet's vanity dies in shame before thy sight. O master poet, I have sat down at thy feet. Only let me make my life simple and straight, like a flute of reed for thee to fill with music.

Tuesday, August 11, 2009

పువ్వు... { గీతాంజలి ~ 6 }


ఈ చిన్న పూవుని తుంచుకుని తీసుకో, ఆలస్యం చేయకు! లేకపోతే అది వాలిపోయి నేల రాలిపోతుందేమో అని భయంగా ఉంది.

నేను నీ మాలలో చోటు పొందకపోవచ్చు, కానీ ఈ పూవుని నీ చేయి తాకిడితో సత్కరించి తుంచుకో. లేకపోతే నాకు తెలిసేలోగా పొద్దు పోతుందేమో అని, అంజలి సమయం జారిపోతుందేమో అని కంగారుగా ఉంది.

ఈ పూవుకి మంచి రంగు లేకపోయినా పరిమళం గుబాళించకపోయినా నీ సేవలో వాడుకో, మరి సమయం మించిపోకుండా తుంచుకో.



Pluck this little flower and take it, delay not! I fear lest it droop and drop into the dust.

I may not find a place in thy garland, but honour it with a touch of pain from thy hand and pluck it. I fear lest the day end before I am aware, and the time of offering go by.

Though its colour be not deep and its smell be faint, use this flower in thy service and pluck it while there is time.