అభిరుచులో, అభిమానాలో మన జీవితాలని పెనవేస్తాయి.. సమాంతరంగా..
మరేవో కారణాలు వాటిని అదుపులో ఉంచుతాయి
మన మధ్య దగ్గరితనం తెలుసుకోవాలంటే దూరాన్ని తెలుసుకోవాల్సిందే
నిన్ను నువ్వు కోల్పోబోతున్నప్పుడు నేను నీకే తెలియని నీ బందీని
నన్ను నీలో కలుపుకోబోతున్నప్పుడు నువ్వు అందుకోలేని దిగంతాల దూరాన్ని
నీ చుట్టూనే ఉండే ఏమీ కాని వాడిని
నా పరిధిలోనే బతికే పరాయివాడిని
నేస్తం! నేను కేవలం నీ నేస్తాన్ని!