వేచి ఉన్న ఏకాంతం వశమై ఆ యుగళం పారవశ్యంతో ఏకమవుతుంది...
ఏమయిందో...
మళ్లీ ఎదురవబోయే ఎడబాటు ఊహకంది ఆ క్షణంలో చొరబడింది..
ఒక్కసారిగా ఆమె కంపించి ఆతని మీద వాలిపోయింది
చేతులు దండలా ఆతని కంఠాన్ని చుట్టుకున్నాయి
మొహం ఛాతిలో దాగిపోయింది
లాలనగా అతను ముంగురులు సవరించబోతే
చేతుల బంధనం బిగుసుకుంది
ఫాలభాగామేమో ఆతని చుంబనాన్ని నిరాకరిస్తూ గారంగా ఛాతిని దోస్తుంది
కొనతేరిన ఆమె చుబుకం ఛాతి మధ్య గాయం చేస్తుంది
ఆమె నయనాలు ఏదో రచిస్తున్నాయి
అర్ధం చేసుకుంటున్న అతని హృదయం ద్రవిస్తుంది
చేదండని వదిలించి చుబుకాన్ని అందుకుని మాట కలుపుతూ అతను
ఆమె నయన కావ్యాల్లో ఆతని అనునయ వాక్యాలు కొట్టుకుపోతున్నాయి
ఏమయిందో...
తనే ఆ క్షణాన్ని వశం చేసుకుంది
ఆతని ఫాలాన్ని చుంబించి దరి చేర్చుకుంది
ఆతని నయనాలూ రచిస్తున్నాయి

8 comments:
chaala bavundi... sveeya anubhavama ;) ???
chaala bavundi... sweeya anubhavama??? ;)
very nice.. maatalakandani bhaavaalu..
@Sree,
thank you! :-) aDigitE cheptaarEnTi?
@వనజవనమాలి gaaru,
Thank you, welcome to my blog!
nice...narration
wow...superb!
bhaagundandi, mee kavitha.
well said
Post a Comment