ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...
వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...
Saturday, December 1, 2007
నాలోనే ఉన్నావు...
నీ తలపుల తారలెన్నో
నా హృదయాకాశం లో...
నా ఆశల కిరణాలెన్నో
నీకై చూసే చూపుల దారులలొ...
రగిలే జ్వాలలెన్నో
నీ ఊహల విరహంలో...
నిన్ను నాకు దగ్గర చేసిన దూరాన్ని అడుగు...
నీ కలలతో పగలు రేయి ఒకటైపోయిన కాలాన్ని అడుగు...
భాధ కూడా తియ్యగా ఉంటుందని తెలిపే
ఈ దూరాన్ని, కాలాన్ని ఈక్షణాన స్తంభించిపోని...
నీ కలలతో, తలపులతో, విరహంతో
ఈ క్షణం నిలిచిపోని...
కానీ ఎంత వరకు?
చెలీ ఎంత వరకు...? నీ రాకకై...
Subscribe to:
Post Comments (Atom)
11 comments:
"నిన్ను నాకు దగ్గర చేసిన దూరాన్ని అడుగు...
నీ కలలతో పగలు రేయి ఒకటైపోయిన కాలాన్ని అడుగు..." wow....too good
@రాధిక గారు
థాంక్స్ అండీ
దీపు గారు ! నా బ్లాగ్ లో మీ కామెంట్ చూసి
మీకు thanks చెబుదామని మీ బ్లాగ్ కి వచ్చి
"ఏకాంత వేళ...మీలో ఉప్పొంగిన భావాల్ని" చదివాను.
చాలా బాగా వ్యక్త పరిచారు.
keep writing
thank u for the comments in my blog:)
చాలా బాగ రాశారు.
మీ బ్లాగు కూడలి లో వున్నట్లు లేదు. తొందరగా కలపండి.
-- విహారి
భాధ కూడా తియ్యగా ఉంటుందని తెలిపే
ఈ దూరాన్ని, కాలాన్ని ఈక్షణాన స్తంభించిపోని...
Nice expression!!Keep writing....And BTW...nice layout and color...:)
Deepu...u finally made itt...Im sooooo happy...keep going....I would love to see many more....ur vennela :-)
nice blog brother keep it.
Next time we will copy u r material to print in our magazine
Naresh Babu Bojedla
దీపు గారు చాలా బావుందండీ.
ఈ క్షణం నిలిచిపోవాలని కోరుకున్నప్పుడు ఇంక ఎంతవరకు అన్న ప్రశ్నకి తావు ఉందా?
పద్మ గారు
ఒకరి కోసం నిండుగా ఎదురు చూస్తున్నాం అనే స్పృహ ఎంత బాగుటుందీ! ఎదురుచూపుల పొడవు పెరిగే కొద్దీ గుండే భారం ఎంత బాధగా ఉంటుంది!
"విరహము కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురము కాదా". :)
Post a Comment