ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...
వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...
Friday, November 23, 2007
గౌతమీ తీరాన...
గౌతమీ తీరాన, ఏకాంత సమయాన..
విరహ వేదనతో నేను,
వీచే గాలుల్లా, సాగే ప్రవాహంలా..
తేలే ఊహల్లో నేను,
గూటికి చేరే పక్షులు,విహరించే చేపలు,
నా ఒంటరితనాన్ని ప్రశ్నిస్తూ ఉంటే...
చెలి రాదే అని, చెంత చేరదే అని..?
వెన్నెల్లో వెచ్చదనాన్ని వెతుక్కుంటున్నాను...
చంద్రుల్లో చెలి ముఖారవిందాన్ని చూసుకుంటున్నాను...
చుక్కల్లో తన చూపుల్ని అన్వేషిస్తున్నాను...
కిన్నెరసాని పాపి కొండల్ని పోటెక్కించినట్టు,
తలచే తలపుల, కలచే కలవరింతల స్రవంతి
నా గుండెల్ని...!
Subscribe to:
Post Comments (Atom)
9 comments:
దీనికి నేను 'గుండె పోటు ' అని పేరు పెట్టాను... కానీ నా చుట్టు ఉన్న నేస్తాలు ఆ పేరుని తట్టుకోలేకపోయారు... :) వాళ్ళ కోసం 'గౌతమీ తీరాన ' అని మార్చాను...
manasu pulkarinchindi....
tanuvu jaladarinchindi....
....ఆపేసారే?ఇంకొంత చదవాలని వుంది.
@రాధిక గారు థాంక్స్ అండి
ఆ స్రవంతి ఆగదండి... :) ప్రవహిస్తూనే ఉంటుంది తను వచ్చే వరకు..
oh! annayya gods gift......no words toe xpress in languages.........
"నా గుండెల్ని...!" అని చట్టుక్కున ఆపేసి, పుటుక్కున గుండెని పిండేసావ్.నీ గుండె కూడా పోటెక్కిందని తెలుస్తున్నా...ఆ anticipation లో ఒక bang ఇచ్చి ముగించావు. చాలా బాగుంది.
ఛాయాచిత్రం చాలా బాగుంది. కవిత(?) సాధారణంగా ఉంది.
WoW! గౌతమీ తీరానికి వెళ్లి వచ్చినట్టుంది. Superb photo!
బాగుందండి
Post a Comment