ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Monday, August 17, 2009

వినతి... {గీతాంజలి ~ 7}నా పాట తన అలంకరణలని వదులుకుంది. తనకి అలంకారాల, ఆహార్యాల అతిశయం లేదు. ఆభరణాలు మన కలయికని చెడగొడతాయి; అవి నీకూ నాకూ మధ్యగా వస్తాయి; వాటి గలగలలు నీ మెత్తని మాటలని ముంచేస్తాయి.

నా కవి గర్వం నీ ఎదుట చిన్నతనంతో చచ్చిపోతుంది. ఓ కవీశ్వరా, నీ పాదాల చెంత కూర్చున్నాను. ఆ వెదురు వేణువులాగా, నీ చేత రాగాలు నింప, నా జీవనాన్ని నిరాడంబరంగా, సరళంగా మాత్రం చేసుకోనివ్వు.
My song has put off her adornments. She has no pride of dress and decoration. Ornaments would mar our union; they would come between thee and me; their jingling would drown thy whispers.

My poet's vanity dies in shame before thy sight. O master poet, I have sat down at thy feet. Only let me make my life simple and straight, like a flute of reed for thee to fill with music.

6 comments:

రాధిక said...

"నీ చేత రాగాలు నింప, నా జీవనాన్ని నిరాడంబరంగా, సరళంగా మాత్రం చేసుకోనివ్వు."
అద్భుతమైన భావనని ఎక్కడా తగ్గకుండా పలికించారు.కొద్దిగా స్వేచ్చ తీసుకుని మీదైన అనుభూతిని,భావాన్ని కూడా జోడిస్తే మీరు అనువాద కవిగా కాకుండా కవి గా మరో మెట్టెక్కినట్టవుతుంది గా.ఆలోచించండి.

chavakiran said...

బాగుంది.

-- ఆహార్యాల
ఈ పదం నాకు తట్టలేదు :)

Ram said...

Just install Add-Telugu widget button on your blog. Then u can easily submit your pages to all top Telugu Social bookmarking sites.

Telugu Social bookmarking sites gives more visitors and great traffic to your blog.

Click here for Install Add-Telugu widget

బొల్లోజు బాబా said...

ఓ కవీశ్వరా

అక్కడ నేను పూర్తిగా చేతులెత్తేసాను.
గూడ్ ఎక్స్ప్రెషన్

బొల్లోజు బాబా

పరిమళం said...

మీ అనువాదం చాలా బావుందండీ ...

మోహన said...

>>ఆ వెదురు వేణువులాగా, నీ చేత రాగాలు నింప, నా జీవనాన్ని నిరాడంబరంగా, సరళంగా మాత్రం చేసుకోనివ్వు.

Beautiful!!