ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...
వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...
Tuesday, August 11, 2009
పువ్వు... { గీతాంజలి ~ 6 }
ఈ చిన్న పూవుని తుంచుకుని తీసుకో, ఆలస్యం చేయకు! లేకపోతే అది వాలిపోయి నేల రాలిపోతుందేమో అని భయంగా ఉంది.
నేను నీ మాలలో చోటు పొందకపోవచ్చు, కానీ ఈ పూవుని నీ చేయి తాకిడితో సత్కరించి తుంచుకో. లేకపోతే నాకు తెలిసేలోగా పొద్దు పోతుందేమో అని, అంజలి సమయం జారిపోతుందేమో అని కంగారుగా ఉంది.
ఈ పూవుకి మంచి రంగు లేకపోయినా పరిమళం గుబాళించకపోయినా నీ సేవలో వాడుకో, మరి సమయం మించిపోకుండా తుంచుకో.
Pluck this little flower and take it, delay not! I fear lest it droop and drop into the dust.
I may not find a place in thy garland, but honour it with a touch of pain from thy hand and pluck it. I fear lest the day end before I am aware, and the time of offering go by.
Though its colour be not deep and its smell be faint, use this flower in thy service and pluck it while there is time.
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
తెలుగులోకొచ్చేసరికి టోన్ లో కొంత మార్ధవం తగ్గినట్లనిపిస్తుంది. కదూ?
ఇలాంటి సందర్భాలలో మాతృకలో లేకపోయినా నేను ప్రభూ అనో, స్వామీ అనో, మహాబలీ అనో కొన్ని విశేషణాలను చేర్చుతాను. అలా చదువుకొని చూడండి మీకే నేను చెపుతున్న పాయింటు అర్ధమవుతుంది.
అలా అన్పించకపోతే తప్పునాదే మీది కాదు, :-))
బొల్లోజు బాబా
బొల్లోజు బాబా
చూడనేలేదు చాలా రాసేసారుగా.బరువైన పదాలు లేకుండా చదువుతుంటే హాయిగా సాగిపోతుంది.
నాకు అలా అనిపించలేదండి. నాకేమనిపిస్తుంది అంటే... గీతాంజలి చదువుతున్నప్పుడు, ఒక్కో పాట ఒక్కో తీరులో ఉంటుంది. రవీంద్రుడు ప్రభువుతో చాలా స్వేచ్చగా మాట్లాడతాడు, తను ప్రేమించేవాళ్ళతో మాట్లాడినట్టు. అది ముఖా ముఖీ మాట్లాడినట్టే ఉంటుంది. దేవుడు పైనా, తను కిందా ఉన్నట్టు ఉండదు ఆ సంభాషణ. దేవుని మహిమని పూర్తిగా ఎరిగిన వాడై, దేవునితో మాట్లాడతాడు. అలా ఒక్కో పాటలో ఒక్కోరకంగా చేరువవుతాడు.
నేను అనువాదం మొదలు పెట్టినప్పుడు, నాకు ఆయా పాటలు ఏయే తీరులో ఉన్నాయో అవే తీరులో ఉంచాలి అని నిర్ణయించుకున్నా. కాబట్టి సాధ్యమైనంతవరకు అనువాదం మాత్రమే చేస్తున్నా, చాలా తక్కువ సంధర్భాల్లో నేను స్వేచ్చని తీసుకుంటున్నా.
రవీంద్రుని మీద అభిమానం, ఆ పాట చదివినప్పుడు నాలో కలిగిన అనుభూతి ఇంకిపోయిన తరవాత, నన్ను ప్రభావితం చెయ్యకుండా..., ఆ పాటని, సాధ్యమైనంత వరకూ ఎలా ఉందో అలానే తెలుగులో రాయడానికి ప్రయనిస్తున్నా... అనువాదకుడిగా రచయితతో ముఖా ముఖి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా...
ఇంకా ఏంటంటే, 27 ఏళ్ళ ఈ వయసులో, నేను ఇలా అనువాదం చేస్తున్నా... ఇంకొక ఐదేళ్ళ తరవాతో, పదేళ్ళ తరవాతో మరలా అనువాదం మొదలుపెడితే ఇలానే రాస్తాను అన్న నమ్మకం నాకు లేదు.. :-) ఎందుకంటే ఒక్కోసారి చదివినప్పుడు ఒక్కో భావాన్ని స్పురింపచేస్తుంది. అది నా మనసు, ఆలోచనలు స్వీకరించడానికి, అర్ధం చేసుకోడానికి ఏ స్థాయిలో ఉన్నాయో అనే దాని బట్టి ఉంటుంది... అందుకనే, సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు చదివి అనువదిస్తున్నా!
ఇక పోతే మీ తప్పేమీ లేదు :-) మీరు మాకు గురు తుల్యులు. మీరు చెబుతుంటేనే కదా నాకు తెలిసేది..
మీ వివరణ బాగుంది.
బొల్లోజు బాబా
dileep gaaru...chalaa baagaa anuvadistunnaru. ee comments section lo mee comment chustunte....meerenta lotugaa ardham chesukuni anuvadistunnaro ardhamavutundi....Keep going
Post a Comment