ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Friday, May 7, 2010

జాబిల్లి


జాబిల్లిని చూస్తున్నాను
ఏంటి అలా చూస్తున్నావని అడుగుతుంది
నీ దరి ఎలా చేరాలా అని ఆలోచిస్తున్నానన్నాను
నవ్వుతూ అది అంత తేలిక కాదంటుంది
ఎందుకు కాదు అని నేను
ఎందుకు చేరాలనుకుంటున్నావని తను

నీ వెన్నెల ఒడిలో సేద తీరాలని ఉంది
ఆ చల్లని వెలుగులో ప్రపంచాన్ని శోధించాలని ఉంది
అని నేను
ఆ వెలుగు నాది కాదు
నేనేమీ ప్రత్యేకం కాదు
అని తను
నా ప్రపంచం లో నీ వెన్నలనే చూడగలుగుతున్నానని నేను
ఈ వెన్నెల లేకపోతె ఏం చేస్తావని తను
ఒకసారి దగ్గర చేసుకున్నాక దూరం కానని నేను
మౌనంగా తను
ముని లా నేను

ఎవరు పాడతారు నాకు
చందమామ రావే జాబిల్లి రావే అని
ఎవరు చేరుస్తారు తనని నా దరికి
నా నీడని తనలో చూసుకునేంత దగ్గరకి

8 comments:

మోహన said...

sweet!! :)

మధురవాణి said...

అద్భుతం!

రాధిక said...

అవును సో స్వీట్ .

సవ్వడి said...

nijaMgaa so sweet.

పద్మ said...

ఎవరు చేరుస్తారు తనని నా దరికి
నా నీడని తనలో చూసుకునేంత దగ్గరకి

:)

Sree said...

bavundi :)

ఏకాంతపు దిలీప్ said...

ఇప్పుడప్పుడే ఇంక స్వీట్స్ తినాలనిపించడం లేదు. :-)

chikki said...

ఎదురుగా క్షీర సముద్రాలున్నా హ్రుదయానికెందుకో దాహంగానే ఉంటుంది
తన సప్త వర్ణాలతో భువిని అలంకరించాలని ఇంద్రధనుస్సు వ్రుధా ప్రయత్నం చేస్తుంది
నింగిని తాకలేనని తెలిసినా కడలి కెరటం యెగసి పడుతూనే ఉంటుంది
నషిస్తానని తెలిసినా పిచ్చి పురుగు దీపం వైపే పరుగులు తీస్తూ ఉంటుంది
కరుణించవని వరమివ్వవని తెలిసినా ఈ హ్రుదయం నిన్నే ప్రేమిస్తుంది
నీ రాకకై వేచి ఉంటుంది.