ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Thursday, August 19, 2010

మానస గిరి

చిందరవందరగా మనసు
ఒక రూపు రాని అదుపు లేని ఆలోచనలు ఎన్నో
మదిస్తాయి మరిపిస్తాయి మొరపెడతాయి
అపుడపుడూ ఆశ్చర్యంగా ఒకదానితో ఒకటి అల్లుకుంటాయి
అందమైన కవితలవుతాయి
అక్కడక్కడా వ్రేళ్ళూనుకుని నిటారుగా నిలబడి
ఆ కొండ ఏటవాలుని వెక్కిరిస్తున్న సరుగుడు చెట్లలా
నా మనసుని వెక్కిరిస్తాయి
చూడడానికి అన్ని చెట్లూ ఒకేలా ఉంటాయి
అయితే అవ్వనీ కొండ నిండుగా ఉన్నాయి
కొండని కొలవాలనుకునే వాళ్ళకి ప్రతి చెట్టూ కొలువే
ప్రతి చెట్టూ కొండని అధిరోహించడానికి స్పూర్తే
కొండ ఎదుగుతుందట తెలుసా
ఎంత ఎదుగుతుంటే అన్ని చెట్లు
ఎవరు అధిరోహిస్తారో ఆ కొండని?
ఆక్రమించి చదును చేస్తే బాగుండు..

7 comments:

మోహన said...

Beautiful analogy, wonderfully executed.
Hats offf!!! :)

కానీ నాకో డౌట్..
ఎవరెస్ట్ అధిరోహించిన వాడికి ఏ చెట్టు స్పూర్తి అయ్యింది? :)

krsna said...

బాగుంది. ముందు టైటిల్ చూడకుండ చదివాను. చివరి రెండు లైనులు చదివాక టైటిల్ చూసాను. మంచి కవితే గాని మొత్తానికి మనసు చిందర వందరగా ఉంది అంటారు అంతేనా!!??

manasa said...

ఆహ్హ!
ఎవరు అధిరోహించినా...చదును చెయ్యడమెందుకు దిలీప్..
వాళ్ళ ప్రేమ తొలి ప్రభాత కిరణం లా వెచ్చగా తాకుతుంటే, నీ మానసమేమో కరిగిపోయే 'హిమగిరి'గా మారుతుంది..!!

మోహన said...

@manasa

very well said! :)

ఏకాంతపు దిలీప్ said...

@మోహనా
ఏదొక కొండకి ఏది ఎమైనా సరే కమిట్ అయిపోయితే ఎలా ఉన్నా అధిరోహించేస్తారు..

@కృష్ణా
మనసు నిండా ఉండే అన్ని భావాలని ఇవి అని పోల్చుకోలేము, మాటల్లో పెట్టలేము.. ఒక్కోసారి పెట్టడానికి ప్రయత్నిస్తే చిందరవందరగానే ఉంటుంది.. కానీ ఒక్కోసారి ఆశ్చర్యంగా చాలా అందంగా సంతరించుకుంటాయి.. ఆ భావాలే మన మనోఫలకం మీద నిలుస్తాయి... అవే ఒక్కోసారి మనల్ని ఇతరులతో ఇతరులని మనతో పోల్చుకునేట్టు చెయ్యగలుగుతాయి...

@మానసా
ఎంత స్వీట్గా చెప్పావూ... :)

పరిమళం said...

"మానస గిరి" శీర్షికకి కవిత రాశారో లేక కవితకి శీర్షిక వెదికారో మరి ! రెండూ అందంగా అమరినై !

ఏకాంతపు దిలీప్ said...

పరిమళం గారు,
కట్రా నుండి బస్సులో వస్తూ కొండలని చూస్తూ ఆ కొండలకి నా మనసుకి పోలికలు అల్లుకున్నా... రాస్తున్నప్పుడు శీర్షిక అనుకోలేదు ఎప్పటిలాగే, రాసేసరికి అదే తట్టింది.. :)