చిరుగాలి కవ్వింపుగా కదం తొక్కుతోంది
ఏ కార్యం తలపోసిందో!
ఆతని కోసమేనేమో!
దూరంగా గాలికి విన్యాసాలు చేస్తున్న ఆ కురులు ఆమె ఉనికిని ఇట్టే తెలిపేసాయి!
గుండె కవాటపు వేగంతో ఆతని అడుగులు
ఆతని రాకని గమనించిన ఆమె క్షణాల్లో మొహం చాటుకుంది
ఎదురుచూపులకి ఎరుపెక్కిన ఆమె కళ్ళు
ఆతని చూసిన కోపంతో ఎరుపెక్కిన ఆమె బుగ్గలు
ఇంకాసేపట్లో ప్రళయం అన్నట్లు...
అడుగులు మందగించాయి..
చూపులు కలిపే ఆతని ప్రయత్నం విఫలం
బుజ్జగింపుల నిట్టూర్పులు వ్యర్ధం..
మోకరిల్లిన అతను
మౌనమే మధ్యవర్తిత్వం నెరపుతుంది
చేయి కలిపిన అతను
ఆమె స్పందనే తెలియనట్లు!
చొరవ చేసి చూపుని బంధించే ప్రయత్నంలో
నిండుగా ఆతని రెండు చేతుల్లో ఆమె బింబం
చూపు కలవక, రెప్ప నిలవక
కనులలోన కొలనులాయెను
ఎర్ర జాబిలి ఎరుపు పోయెను
కోపమేమో కౌగిలాయెనే!
మనసు మాటలు మౌ.....న..మే!
8 comments:
First thing's first - Welcome back!! :)
now..... WoooooW!!!!
Title అదిరింది.
కవిత ఇంకా అదిరింది.
This is worth the wait!!!
>>>చూపు కలవక, రెప్ప నిలవక
కనులలోన కొలనులాయెను
Loved this line. :)
Keep rocking!
Really nice.
చాలా కాలం తర్వాత వచ్చిన పున్నమి ఇది. నిండువెలుగులు వెదజల్లినది...
దూరంగా గాలికి విన్యాసాలు చేస్తున్న ఆ కురులు ఆమె ఉనికిని ఇట్టే తెలిపేసాయి!
గుండె కవాటపు వేగంతో ఆతని అడుగులు
నాకిది బాగా నచ్చింది.
చూపు కలవక, రెప్ప నిలవక
కనులలోన కొలనులాయెను
ఈ కవి హృదయం అద్భుతం!
చూపు కలవక, రెప్ప నిలవక
కనులలోన కొలనులాయెను
ఇందులో మొదటి లైను దగ్గరే అర్ధమవుతుంది తర్వాతి లైనులో చెప్పబోయే భావపు తీవ్రత..చాలా అద్భుతంగా ఉంది దిలీప్ :)
chala chala bagundi andi mee kavitvam....
@ విశాల, భాస్కర్
నాకే అనిపించింది.. నాలో ఆ పార్శ్వాన్ని మళ్ళీ కనుకొన్నట్టు! :)
అందరికీ నెనర్లు! :-)
hello dileep garu naperu kuda dileep. mee kavithalu aa anubhothjulu chal bagunnai , mee la kakapoina appudappudu konni kavithalu rastuntanu meeku ishtamaithe vatini kuda ikkada post cheyyocha na mail address dileepkumarbscmlt@gmail.com, dilchakri143@gmail.com
Hi Dileep, Thank you. mee rachanalu mee bloglO unTEnE baagunTundi. mee blog lonW raastuu unDanDi. All the best.
Post a Comment