ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Wednesday, November 23, 2011

మనసైంది…
మాటలతో మొదలైన బంధం చూపులతో రూపు దిద్దుకుంది
చూపుల్లోనే బయట పడ్డ మనసులు బలంగా పెనవేసుకుంటున్నాయి...

మన కలయిక నీ పలుకుల్లో వ్యక్తమవుతున్నపుడు
నా కలలకి నువ్వు భాష్యం చెప్తున్నట్టుంటుంది

నీ చిలిపి విసురుల్లో
నీ వెవ్వెవ్వేల... ఆ ఆ ఆ కారాల
గారాల నయగారాల్లో పులకించిపోతున్నాను

యధేచ్చగా నువ్వు నన్ను నీలో కలుపుకుంటుంటే
నన్ను నేను మరిచిపోతున్నాను

చుట్టూ ఏమవుతున్నా, కాలం ఎరుగక
మనసు ప్రశాంతంగా ఉంది
రేపటి మన మనుగడని ఆవిష్కరించుకుంటుంది..పంచభూతాలు నాకు సరి కొత్తగా ప్రస్ఫుటమవుతున్నాయి

11 comments:

పద్మ said...

very nice దీపు. నీ మనసు చదివించేశావు. :) నీ ఈ గారాల నయగారాల బంధం దినదిన ప్ర'వర్ధ'మానమవ్వాలని కోరుకుంటున్నాను. :)

జ్యోతిర్మయి said...

బావుంది బావుంది..తరువాత..

మధురవాణి said...

:)

సుభ/subha said...

వెవ్వెవ్వే :)

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

వావ్ :-)
మన కలయిక నీ పలుకుల్లో వ్యక్తమవుతున్నపుడు
నా కలలకి నువ్వు భాష్యం చెప్తున్నట్టుంటుంది

చాలా బాగున్నాయ్ ఈ లైన్స్... ఇంకా ఏం రాస్తావో అని వీక్షిస్తూ

నీ...

kiran said...

:))

వేణూశ్రీకాంత్ said...

సూపరుంది దిలీపూ :)

Kranthi M said...

abba emi expression chesaavu dileeep.evarikosam chesavo vallu maatram anthe inka jeevitantam ala padipotaru neeku ;-)

మోహన said...

well expressed.

ఏకాంతపు దిలీప్ said...

@పద్మ,
What a wish! Thanks alot! తనతో వర్ధిల్లుతున్న దీపు :-)

@జ్యోతిర్మయి
:-)

@మధురవాణి
:-)

@subha
ఆ ఆ ఆ!

@Avineni Bhaskar / అవినేని భాస్కర్
:-) thank you! చూద్దాం బావ!


@Kiran
:-)


@వేణూ శ్రీకాంత్
:-P థాంక్స్ వేణూ


@క్రాంతి కుమార్ మలినేని
హ హ హా! థాంక్స్! మనకి అనిపించింది రాస్తాము గాని, అలా అనుకుని రాయము కదా!


@మోహన
Thank you :)

Unknown said...

nice quote
https://youtu.be/2uZRoa1eziA
plz watch our channel