ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...
వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...
Wednesday, November 7, 2007
ప్రకృతి నీతో మమేకమవుతుంటే...
సంధ్యా పవనం -
నీ కురులని సుతారంగా కదిలిస్తున్నప్పుడు...
వేకువ చలి -
నీ చేతులతో నిన్ను నువ్వు చుట్టుకునేట్టు చేస్తున్నప్పుడు...
ఉదయించే సూరీడు -
నీ నుదుటి బొట్టుని చూసి,
తన ప్రతిబింబమని మురిసిపోతున్నప్పుడు...
కూసే పక్షులు -
నువ్వు చలిలో వణుకుతూ చేసే
ప్రార్ధనా గుస-గుసలు విని
ఎవరీ కొత్త పక్షి అని
ఆశ్చర్యంతోఅన్నీ నీ వైపు చూస్తున్నప్పుడు...
తొలి మంచు -
నువ్వు గుడి చుట్టు ప్రదక్షిన చేస్తుండగ,
నీ చెంప వాలున జారే
చెమట బొట్టు మీద కిరణాలు పడి మెరిసిపోతుంటే,
అది చూసి అసూయ పడుతున్నప్ప్పుడు...
నేను ఆ ప్రకృతిని మిస్స్ అవుతున్నాను...
నా చెలీ... నిన్ను మిస్స్ అవుతున్నాను...
Subscribe to:
Post Comments (Atom)
12 comments:
excellent annayya.......
baagundi marinni rayandi abhinandanalatho...
నీ విరహం
మా పాలిట వరమై,
నీ చెలి తాపం
మా పాలిట కవితాలోకమై
ఇలా సాగాలని స్వార్థంతో
ఒక్కక్షణం కోరుకున్నా...
మరో రెప్పపాటులో
నా పెదవులపై
నీ చెలి నీ చెంతచేరిన
వైనాన్ని వినాలనే ప్రార్థన
అసంకల్పితంగా ఉదయించింది
@ మహేష్ గారు
నేను తరించిపోయాను. ఈరోజు నాకు గాలీ,నీరు,తిండి అవసరం లేకుండానే బతికేస్తానేమొ అనిపిస్తుంది... చాలా చాలా నెనెర్లు :-)
ఆస్వాదించడంతో పాటే అభినందించడమూ నేర్చుకోవాలి... ఇప్పుడే రానారె రాసిందేదో చదువుతున్నా!! ఎలా అభినందించాలి?? గుండె బరువును.. ఎదురుచూపుల వేదనను?? :-( భాషా, భావం బాగున్నాయి.. కానీ అది రాసిన మనసు వేదనే కష్టంగా ఉంది.
@ పూర్ణిమ
:-( ఎలా?
మామూలుగా చదివితే అందులో వేదన ఎవరికీ కనపడదేమో? మంచి ఆస్వాదనలానే అనిపిస్తుంది... నువ్వు కనిపెట్టేసావని ఆనందించాలో లేక నా గుండె మరో సారి బరువెక్కిందని ఊరకుండాలో అర్ధం కాని పరిస్తితి నాది ఇప్పుడు...
నువ్వు రానారే టపా చదివేసరికి అక్కడ నా వ్యాఖ్య నీకు కనపడి ఉంటుంది... :-) coincidence!
simply superb
sahithee yanam
అందాన్ని ఆనందించాలనే ఆవేదన మనకేనా..
అక్షరాలను అందంగా ఆడవారికోసం అల్లడం మనకేనా...
ఆలోచనలను అలవోకగా అందివ్వడం వారికేనా..
ఆశ్చర్యపరిచే ఆకర్షనలతో అస్తవ్యస్తంచేయడం వారికేనా...
అనిపిస్తున్నది నాకు ఇలాంటి మీ అందమైన కవితను చదువుతుంటే..మీరెమంటారు.
నిజము చెప్పనా నాకు తెలిసింది దిలీప్ గారు, ఒక్కోసారి అనిపిస్తుంది మనము ప్రేమగాగా ఆరాదిస్తున్నా, స్నేహంగా అభిమానిస్తున్నామనలాంటి బావనలు వారికి రావని.మనం కవితల్లో వెతికే ఆ అందమైన ప్రకృతి సిరి మనకు ఎప్పుడూ మిస్ అవుతూనే వుంటుంది లేకుంటే ఇలా మనం ఆవేదన చెందలేమేమో.. ఇది నా అంతరంగిక భావం.కాని మీ ఆలోచనలేమిటో నాకు తెలియవు. కాని కవిత బావుంది.
@పృధ్వి గారు
ఒక చిత్రకారుడు అడగాల్సిన ప్రశ్నలు కావు ;-) నా ఉద్దేశం మన భాధ్యతలని మనం ప్రశ్నించుకోకూడదు అని! అలా ప్రశ్నించడం మొదలుపెడితే మనం అలసిపోతాము. మనలో సృజనాత్మకత నీరసిస్తుంది.
మీ భావాలని పంచుకున్నందుకు నెనర్లు. నాకు అలాంటి ఆలోచనలే ఒకప్పుడు కలిగేవి. :-) నా ఆలోచనలని కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
ఆడవారు భావాభివ్యక్తీకరణ మగవారి స్థాయిలో మొదలుపెడితే అది ఉప్పెనై కూర్చుంటూంది. మీరు,నేను ఉనికిని కోల్పోతాము. తరాలుగా వాళ్ళ భావాలని ఒక రకంగా వ్యవస్థీకరించడం జరిగింది. వాళ్ళు కూడా అలా ఉండటమే వాళ్ళకి శ్రేయస్కరం అని నమ్మి అత్యధికులు అలానే ఉండటానికి అలవాటైపోయారు. పదే పదే మనం మీరు ఇలా ఉంటే మాకిష్టం, అలా ఉంటే మాకిష్టం అని చెప్తుంటే ఎలా ఉండాలో తెలియక అయోమయంలో కొంతమంది గడిపేస్తారు. కొంతమంది సరే నీకిష్టమొచ్చినట్టే ఉంటామని అలానే ఉంటారు. అలాంటి చోట భావవ్యక్తీకరణ జరగదు. అలాంటీ వ్యవస్థీకరణ వాళ్ళ విషయంలో ఎక్కువగ ఉంది కాబట్టి మనలా వాళ్ళు ఎక్కువగా కనపడరు.
ఇక నాకు తెలిసిన స్నేహాలని గమనిస్తే, వాళ్ళు స్వేచ్చగ ఉన్నప్పుడు వాళ్ళు పలికే భావాల్లో ఉన్న సమయస్పూర్తి, ఆకర్షణ,ఉత్సాహం,ఆలోచన మనకి తీసిపోదు. మనల్ని దాటిపోతుంది. ఇందాకే నా దగ్గరి స్నేహితుడు అంటున్నాడు, తన కాబోయే అమ్మాయి ఎదైనా అడిగితే కవితలతో సమాధానం ఇస్తుందని. వాడిని అడిగితే కనీసం ఒక్కటైనా నువ్విచ్చావా అని, వాడికి ఆ అమ్మాయి అంటే ప్రేమున్నా నాకు ఆసక్తి లేదు అనేసాడు. అదే అమ్మాయి నా బ్లాగు చూసి, అన్నయ్య నువ్వు కోరుకున్నది జరగాలి అని వెంటనే నా బ్లాగులోని అంశాలతోనే ఒక కవిత అల్లి పంపింది.
ఇంక మనలా భావాల్ని అందంగా వెలిబుచ్చడం, అందాన్ని ఆనందించాలనే ఆవేదన, ఆరాధన, అభిమానం ప్రకటించడం లాంటివి తీసుకున్నా మన బ్లాగ్ప్రపంచంలోనే తిరుగులేని ఉదాహరణలు చూపించగలను. స్నేహమా రాధిక గారు, నిషిగంధ గారు. వాళ్ళు ప్రకృతి, ప్రేమ, స్నేహం, సహజీవనం గురించి రాసినంత విరివిగా బ్లాగుల్లో ఏ మగవాడు రాయలేదు అని నా పరిశీలన. ఈ మధ్య పూర్ణిమ టపాలని గమనించారా?
పురుష పదజాలంతో ఒక్కమాటలో చెప్పాలి అంటే భావ వ్యక్తీకరణలో మనం "బరితెగించినంతగా" కొన్ని కారణాల వల్ల వారు తెగించలేరు.. :-) అవి వాళ్ళు తెగించాల్సిన వాళ్ళ దగ్గరే తెగిస్తారు.
@బాబా గారు
థాంక్స్ అలాట్..
దిలీప్. దంచేసారు..
deepu annayya chaala baundi..
Post a Comment