ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Thursday, November 1, 2007

పిపాసిప్రేమ సౌధం కుప్పకూలి...,
గూడు కట్టుకున్న ఆశలు చెల్లా చెదురై,దిక్కు తోచక
హఠాత్తుగా ఆవరించిన శూన్యతకి ఒంటరైనమనసుతో... ఒక నేస్తం...

పచ్చ నోట్లు పలచనై,
బతుకు బండి భారమై,
అలసిన వదనంతో... ఒక నేస్తం...

సంసార సాగరం ఈదుతూ,
గజిబిజి నడకలతొ బిజీ-బిజీగా సతమతమవుతూ... ఒక నేస్తం...

కాల ప్రవాహంలొ కొట్టుకుపోతూ...
నిన్నటి జాడ మరచి, తోడు విడిచి...
కొత్త స్నేహాలతో వర్తమానంలొనే గడిపే... ఒక నేస్తం...

ఒకరితో కాలాన్ని పంచుకోలేక...
ఒకరితో పంచుకుని...
బరువెక్కిన హృదయంతో నేను...

ఎంతమంది నేస్తాలున్నా...
ఒంటరైన ఈ క్షణాన,నా మనసు...
కొత్త నేస్తాన్ని కోరుకుంటుంది...

నాతో కబుర్లు చెప్పాలని...
నన్ను అలరించాలని...
బరువైన ఈ క్షణాన్ని తేలిక చేయాలని...


12 comments:

జాలయ్య said...

మీ కవితలు బాగున్నాయి.

మీ బ్లాగు జల్లెడకు కలపడం జరిగినది.
jalleda.com


జల్లెడ

Deepu said...

కృతజ్ఞతలండి.. జాలయ్య గారు, అది మీ మారు పేరు అనుకుంటున్నాను..

తెలుగు బ్లాగ్లన్నీ ఒక చోట చేర్చి మంచి పని చేస్తున్నారండి... ఇక్కడ ఇన్ని బ్లాగ్లు ఒకేచోట చూస్తుంటే సంక్రాంతి ముగ్గులన్నీ ఒక చోట చూసినంత ఆనందంగా ఉంది...

కత్తి మహేష్ కుమార్ said...

బాగుంది. కానీ నాకు ఒక దగ్గర భావవైరుధ్యం అనిపించింది.

"ఒకరితో కాలాన్ని పంచుకోలేక...ఒకరితో పంచుకుని...బరువెక్కిన హృదయంతో నేను...
ఎంతమంది నేస్తాలున్నా...ఒంటరైన ఈ క్షణాన,నా మనసు...కొత్త నేస్తాన్ని కోరుకుంటుంది..."

పై వాక్యాలు ఈ క్రింది విధంగా ఉంటే సరిపోయేదేమో అనిపిస్తోంది.

"ఒకరితో కాలాన్ని పంచుకోలేక...మరొకరిని ఎంచుకుని ...బరువెక్కిన హృదయంతో నేను...
ఎంతమంది నేస్తాలున్నా...ఒంటరైన ఈ క్షణాన,నా మనసు...పాత నేస్తాన్ని కోరుకుంటుంది..."

meenakshi.a said...

deepu annayya...
nenu kuda ee line gurinchi adugudaamanukunna,monna mee blog chusinappudu.
meeru aa vaakyam ela feel ayi raasaro naaku teleedu.
kaani naaku appudappudu baadhaga unnappudu..entamandi na chuttura unna ontariga anipistundi....
appudu Edo oka sneha hastam na kannillanu tudiste baundunu anipistundi.enta mandi friends unna manasu oka kotta nestaanni korukuntundi aa kshanam lo...endukala anipistundi???
ee Q mimmalni eppudo adugudaamanukunna..kaani meeru busy kada...anesi urukunna...
annayya ekkuvaga raaste sorry.

Purnima said...

నేను చెప్పనా.. ఏమనిపిస్తుందో..

ఒకరితో కాలాన్ని పంచుకోలేక... ఇప్పుడు నా స్నేహితులందరికీ చాలా దూరంగా ఉన్నాను.

ఒకరితో పంచుకుని... నా సమయాన్నంతా బ్లాగులకు వెచ్చిస్తున్నాను

బరువెక్కిన హృదయంతో నేను... స్నేహితులు లేరన్న లోటు.. కొత్త పరిచయాల్లో అందుకోలేనంత ఆనందం, రెండూ కలిసి గుండెను బరువెక్కిస్తున్నాయి.

నాకు ఆ లైన్లు అతికినట్టు సరిపోతాయి.. ఈ క్షణంలో.

మహేశ్ గారన్న "మరొకరు" కూడా బాగానే ఉంటుంది.. కానీ "అది లేదు కాబట్టి ఇది" అన్న భావం కలిగిస్తుంది. మావాళ్ళంతా నాతో ఉన్నా నేనిలా బ్లాగు చేసేదాన్ని.

పాత స్నేహాలకు విలువిస్తూనే.. మనసు కొత్త నేస్తాన్ని కోరుకుంటుంది. ప్రతీ స్నేహంలో ఒక కొత్త అందం, ఆనందం ఉంటుంది. పైగా నా పాత నేస్తం నాకు దూరమవ్వడానికి జీవితం కారణమైతే.. తనని మళ్ళీ నాతోనే ఉండాలి అని అత్యాశపడను. జీవితంలో ఏ బంధమైనా దగ్గర ఉన్నప్పుడు అనుభవించి.. దూరమైనప్పుడు అభిమానించాలి అని నా అభిప్రాయం.

కవితలోని అందం ఇదేనేమో కదా.. వెత్తుకుంటే.. ఎవరికి కావాల్సిన ఊరట వారికి దొరుకుతుంది. :-)

రాధిక said...

నావరకూ కవిత చాలా సూటిగానే వుంది.
మనం అన్ని సమయాల్లోనూ అందరికీ ఓదార్పును ఇవ్వలేము.కానీ కొందరికి సమయాన్ని వెచ్చించి,కొందరికి వెచ్చించలేకపోవడం నిజమయిన స్నేహితుడికి చాలా బాధకలిగించే విషయం.ఈవిషయాన్ని దిలీప్ బాగానే చెప్పగలిగారు.కొన్ని సమయాల్లో బాధని స్నేహితులతో పంచుకోలేము.ఆ బాధ స్నేహితులనుంచే అయితే[అది పైన చెప్పినట్టు ఓదార్పునివ్వలేకపోయాననే బాధన్నా కావచ్చు]ఆ సమయంలో మనసుకి,మనిషికి ఒక ఆలంబన కావాలి.అలాంటి స్థితిలో పాత స్నేహాలకన్నా కొత్త స్నేహాలే ఎక్కువ ఊరటనిస్తాయి.ఇది చాలామందికే అనుభవమనుకుంటాను.నావరకూ పాతస్నేహల మీద ఎంత నమ్మకం,ఇష్టం వున్నా,కొన్ని సందర్భాలలో కొత్త స్నేహితులకే ప్రాధాన్యం ఇస్తాను.
అదే మహేష్ గారు చెప్పినట్టు పాత నేస్తం అని రాసినా తప్పులేదు.ఎందుకంటే ఎక్కువసార్లు మనం ఓదార్పు పొందగలిగేది పాత స్నేహాలనుండే.ఇక్కడ కవిగారి అప్పటి పరిస్థితిని, మనస్థితిని అర్ధం చేసుకోవాలి అంతే.
పూర్ణిమ అన్నట్టు వెతుక్కుంటే ఎవరికి కావాల్సిన ఊరట వాళ్ళకి లభిస్తుంది.

ఏకాంతపు దిలీప్ said...

@ మహేష్ గారు
మీరన్నది కూడా బాగుంది. కానీ నేను ఆ సంధర్భంలో మరొకరిని ఎంచుకోలేదు. నాకున్నా స్నేహాల్లోనే నా కష్ట సుఖాలని ఒకరితో పంచుకోవాలనుకుని పెదవి విప్పేలోగా వాళ్ళ కష్టాలు నా నోరుని కట్టేసాయి. ఆ నిముషంలో నావి పంచుకోవడం కన్నా వాళ్ళవి పంచుకోడంలోనే గడిపేసాను. ఒకరితో పంచుకోలేక అంటే ఒకప్పుడు నా ప్రియ నేస్తాలైనా వాళ్ళకి ఏ కష్టాలు లేకపోయినా ప్రస్తుతం నా భాధలు వినే మూడ్లో వాళ్ళు లేరు. కొత్త నేస్తాలతో, కొత్త అవకాశాలతో ఆనందంలో వున్న వాళ్ళు "నువ్వు ఎలా ఉన్నావురా?" అనే స్పృహలో కూడా లేరు. వాళ్ళ మూడ్ ని పాడుచెయ్యడం ఇష్టం లేదు.

అలా "ఒకరితో కాలాన్ని పంచుకుని, ఒకరితో పంచుకోలేక..." అని రాసాను.

ఏకాంతపు దిలీప్ said...

@ రాధిక గారు

మీ వ్యాఖ్య చదివిన తరవాత నేను చెప్పేదేమీ లేకపోయినా ఆ సంధర్భాన్ని చెప్దామని మహేష్ గారికి చెప్పాను. నా బ్లాగ్లో ఇంత పెద్ద కామెంట్ రాయడం మీరు ఇదే మొదటిసారి. మీరు స్నేహానికి ఇచ్చే విలువ, ప్రాధాన్యత ని మీ బ్లాగు నిరూపిస్తున్నా, ఈ కామెంట్ మరోసారి ఎలుగెత్తి చాటింది అని చెప్పగలను :-) మీరు స్నేహాన్ని (నన్ను) అర్ధం చేసేసుకున్నారు.

ఏకాంతపు దిలీప్ said...

@పూర్ణిమ

"పాత స్నేహాలకు విలువిస్తూనే.. మనసు కొత్త నేస్తాన్ని కోరుకుంటుంది. ప్రతీ స్నేహంలో ఒక కొత్త అందం, ఆనందం ఉంటుంది. పైగా నా పాత నేస్తం నాకు దూరమవ్వడానికి జీవితం కారణమైతే.. తనని మళ్ళీ నాతోనే ఉండాలి అని అత్యాశపడను. జీవితంలో ఏ బంధమైనా దగ్గర ఉన్నప్పుడు అనుభవించి.. దూరమైనప్పుడు అభిమానించాలి అని నా అభిప్రాయం."

నీ అభిప్రాయం నాకు నచ్చింది. అది మాత్రమే మనకు సాంత్వన కలిగించగలదు. అవును కవితలో వెతుక్కుంటే ఎవరికి కావాలసిన ఊరట వారికి దొరుకుతుంది.

ఏకాంతపు దిలీప్ said...

@ మీను

ఈ వ్యాఖ్యలన్నీ చూసిన తరవాత నీకు అర్ధమయ్యే ఉంటుంది కదా... :-)

కత్తి మహేష్ కుమార్ said...

బాగుంది. కవితతోపాటూ ఈ చర్చలూ కొంత స్వాంతనని కలిగిస్తున్నాయి.

@దీపు ఈ లంకె చూడగలరు http://parnashaala.blogspot.com/2008/06/blog-post_30.html

రాధిక said...

"జీవితంలో ఏ బంధమైనా దగ్గర ఉన్నప్పుడు అనుభవించి.. దూరమైనప్పుడు అభిమానించాలి"......wow...very good one.