ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Sunday, December 16, 2007

విరహం


ఇప్పుడే కురిసిన వాన జల్లు పరిసరాలని పులకరింప చేసింది
చెలి కలయికని తెలిపే ఊహలు నా మనసుకి కలిగించే పులకరింత లాగా...

వాన జల్లుకు తడిసన మట్టి వాసన గమ్మత్తుగ ఉంది
చెలి చేరువలో వెళ్తున్నప్పుడు గాలి వాసన కలిగించే మత్తులాగా...

చల్ల గాలులు, కారు మబ్బులు
లేని వెచ్చదనాన్ని, రాని వెన్నెలని గుర్తు చేస్తున్నాయి...

చెలి దూరంగా వుంది
తన కలవరింత ప్రకృతి ఆస్వాదనని దూరం చేస్తుంది...

చెలీ రావే,వరాలీవే,
వెతికా నిన్ను వీచే గాలుల్లో
కన్నా నిన్ను కారు మబ్బుల్లో...
వెచ్చదనం ఏదని? వెన్నెల రాదే అని?
చెలీ రావే,వరాలీవే...

8 comments:

రాధిక said...

చాలా బాగుందండి.ముఖ్యం గా మొదటి 4 లైన్లు మంచి ఫీల్ ని ఇచ్చాయి.

శీను said...
This comment has been removed by the author.
శీను said...

చెలి రావే, నా సఖుడిని చూడవే,
విరహం తో, ఈ ఎకాంతంలో,
అలుపెరుగని తన తపనని చూడవే,
చెలి రావే, వరాలీవే...

Anonymous said...

coool guru ...aripichav :) touchyyy

mahigrafix said...

వాన జల్లుకు తడిసన మట్టి వాసన గమ్మత్తుగ ఉంది
చెలి చేరువలో వెళ్తున్నప్పుడు గాలి వాసన కలిగించే మత్తులాగా... మీ కవితలో ఇది చాలా బాగుంది.
(visit my forum:
www.mahigrafix.com/forum
you can get lot of multi-media tutorials in telugu and many more, flash, photoshop, tally, msoffice, 3d, blog editing, etc)

పద్మ said...

కారుమబ్బుల్లో చెలిని కన్నారా? అంత నలుపా మీ చెలి? :ప్

సుజాత వేల్పూరి said...

పద్మార్పిత గారూ,

కారుమబ్బుల్లో కనపడేది నలుపు కాదండీ, మెరుపుతీగ!:-)

ఏమంటారు దిలీప్?

ఏకాంతపు దిలీప్ said...

@పద్మ గారు
నా చెలి అనుకున్నాక నలుపేంటండి? తెలుపేంటండి?

@సుజాత గారు,
అంతే కదండీ! :)