వర్ష నా ముందు నగ్నంగ ప్రత్యక్షమైంది
తను నా కళ్ళలోకి సూటిగా చూస్తుంది
ఆ చూపులో...
అచంచలమైన ప్రేమ, తరగని సానుభూతి,
అంతులేని ఔదార్యం, చెరగని నమ్మకం కనుగొన్నాను...
నేను తప్పించుకోలేకపోయాను ఆ చూపు నుండి, నిస్సహాయుడిలా
నిశ్శబ్ధాన్ని చేధిస్తూ,తనకు చీర కట్టమంది
నేను నిచ్చేష్టుడిలా ఉండిపోయాను తన మాటలు వింటు...
తనకి 12 కుచ్చిళ్ళు కావాలని, 12 రంగుల్లొ ఉండాలని అంటు
నా చేతిలో ఒక తెల్ల చీర పెట్టింది...
నేను కుచ్చిళ్ళు పేర్చుతూ, ఒక్కొ పేటకి రంగు అద్దడానికి ప్రయత్నిస్తున్నాను...
రంగులద్దుతుంటే, ఒక్కో రంగుకు నా చేత
ఆత్మ విశ్వాసంతో,
క్రమ శిక్షణతో,
దీక్షతో,
సత్సంకల్పంతో,
సాటివారిపై నమ్మకంతో,
నిజాయితితో,
ప్రణాళికతో,
ఆరోగ్యంపై శ్రద్ధతో,
ఉత్సాహంతో,
సానుకూల దృక్పధంతో,
నిత్యం జాగురూకతతో,
చిరు నవ్వుతో
తనని ఎదుర్కుంటానని ప్రమాణం చేయించుకుంది, నా నుదుటి మీద చెయ్యి వేసి...
నేను కుచ్చిళ్ళను ఒద్ది పెట్టి, లేచి తనకు పైట కప్పడానికి ఎదురునిలిచాను...
ఆ చూపుని తప్పించుకోలేకపోయాను...
ఆ కళ్ళలో అదే ప్రేమ,సానుభూతి,ఔదార్యం,నమ్మకం
తను నా చెయ్యి పట్టుకుని
పన్నెండు రంగుల కుచ్చిళ్ళను తన్నుతూ ముందుకు సాగింది...
నా పాదాలకి తన నడక విదిల్చిన రంగులు అద్దుతుంటే,
తన అడుగులని అనుసరించాను...
తను ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురువెళ్తు అదృశ్యమైంది!
నేను నా పాదాలకి, చేతులకి పన్నెండు రంగులతో
తనకి చేసిన ప్రమాణాలతో ఏకాకిలా..
నిద్రలొ అటు ఇటు కదులుతున్న నన్ను
నా స్నేహితుడు హెచ్చరించాడు,కదలకుండ నిద్రపొమ్మని...
కళ్ళు తెరిచి చూసాను....
నా చేతులకి, పాదాలకి రంగులు లేవు,
ప్రమాణాలు మాత్రం లీలగా గుర్తు వస్తున్నాయి...
ఆ స్పృహతో నేను కొత్త వర్షానికి ఎదురు నిలిచాను చిరు నవ్వుతో...
స్నేహితులకి నూతన సంవత్సర శుభాకాంక్షలతో...
8 comments:
చాలా మంచి కాన్సెప్ట్.రాయడం చాలా కష్టమే.అభినందనలు.
నా బ్లాగులో మీ బ్లాగుకు లంకె వేస్తున్నాను.అభ్యంతరం వుంటే తెలియచేయగలరు.
@రాధిక గారు
చాలా థాంక్స్ అండి. నాకు ఏమీ అభ్యంతరం లేదు. నేను గౌరవంగా భావిస్తున్నాను...
దీపు గారు నమస్తే
ఒహ్ ఎంత చక్కగా వర్ణించారు మీ మనోభావాన్ని "కల" అంటూనే కాలాన్ని చెప్పారు మనిషి వీవితం లో ఎలాంటి హద్దులు నేర్చుకోవలో అవేన్ని రకాలో ఎంత చక్కని వర్ణనా నిజమే కదా
ఆత్మ విశ్వాసంతో,
క్రమ శిక్షణతో,
దీక్షతో,
సత్సంకల్పంతో,
సాటివారిపై నమ్మకంతో,
నిజాయితితో,
ప్రణాళికతో,
ఆరోగ్యంపై శ్రద్ధతో,
ఉత్సాహంతో,
సానుకూల దృక్పధంతో,
నిత్యం జాగురూకతతో,
చిరు నవ్వుతో
ఇవన్ని ఉంటేనే గా మనిషికి సంపూర్ణత
చక్కని భావాన్ని మక్కువగా తెలియచేసిన మీ భావుకత కి నమస్సుమాంజలి
మీ సహ బ్లాగరు
ఉష
@ఉషా గారు చాలా థాంక్స్ అండి..
anna chal bavundi matalu levu varnichadaniki................
deepu gaaru adirindandi.kotta topic kotta kavitha kotta comment uuuuuuuu keka proceed.
http://www.srushti-myownworld.blogspot.com
chala bagundi manchiiii feel undi kala kani kala ante idenemo anela undiiiiiiii
Post a Comment