ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Friday, January 18, 2008

ముత్యాల ముగ్గు


తీరైన తన నడకతొ లయబద్ధంగా సవ్వడి చేస్తున్న పట్టీలు
నా చూపుని తన వైపు మరల్చాయి...
సింధూరం, పసుపు పచ్చల పట్టు పరికిణీని మునివేళ్ళతో
కొంచెం పైకి లాగి తను కలియతిరుగుతుంది వాకిట దేని కోసమో వెతుకుతూ...
ఏదో కనుగున్నట్టు ఇంట్లోకి పరుగెట్టింది...

నేను తనకోసం ఎదురుచూడకుండా ఉండలేకపోయాను...

ముగ్గు గిన్నెతో తను బయటకొచ్చింది
పైటను నడుముకు చుట్టుకుని, పరికిణీ సర్దుకుని
ఒంటి కాలిపై భారం మోపి, కూర్చుంది ముగ్గుపెట్టటానికి...
నేను అలానే చూస్తున్నాను...
తన వేళ్ళు ఏదో మాయం చేస్తున్నట్టు
చక చకా చుక్కలు పెట్టుకుంటూ వెళ్తున్నాయి
ఆ వేగంతో చుక్కలని అనుసరించడానికి ప్రయత్నించిన నా కళ్ళు తిరిగాయి...

ఒకసారి పైకి చూసాను
నింగిలో చుక్కలు నేలపై ఆమె వేలు జారిన చుక్క చుక్కలో
పోలికలు వెతుక్కుంటు మురిసిపోతున్నాయి ఎంచక్కా...
అదే పనిగా... చంద్రుడు లేడని గుసగుసలాడుతున్నాయి
అది విని నెలరాజు మోము చిన్నబోయింది,
రోజు తనతో ఊసులాడే చిన్నది తనని ఈరోజు మరచిపోయిందని...

నేను తేరుకుని తనవైపు చూసాను
ముంగురులను పైకి పోగు చేసుకుంటూ తను పైకి లేచింది
ఒక్కసారి తనివితీర కిందకిచూసింది
తన చూపుల్ని నా చూపులు అనుసరించాయి
ఆహా... ఎంతటి అందమైన ముగ్గు...!
చంద్రుడు చిన్నబోవటంలో అర్ధం వుందనిపించింది...

ముగ్గుని చూసుకున్న ఆనందంతో తన కళ్ళు మెరిసాయి
పెదవులపై నవ్వులు విరిసాయి
ఆ నవ్వులో తడిసిన ముగ్గు ముత్యాల ముగ్గయ్యింది
ఆ ముంగిట వెలుగులు నింపింది...

20 comments:

రాధిక said...

ఆ అమ్మాయి వేళ్ళ సందుల్లోంచి ముగ్గు జారుస్తుంటే మీరు మనసు జార్చుకున్నారా?ఇంతకీ మీకు ముగ్గు నచ్చిందా లేక ముగ్గు పెట్టిన అమ్మాయి నచ్చిందా? :)
"నింగిలో చుక్కలు నేలపై ఆమె వేలు జారిన చుక్క చుక్కలో
పోలికలు వెతుక్కుంటు మురిసిపోతున్నాయి ఎంచక్కా..."
"ఆ నవ్వులో తడిసిన ముగ్గు ముత్యాల ముగ్గయ్యింది"
చాలా చాలా బాగుంది.

ఏకాంతపు దిలీప్ said...

@రాధిక గారు
మనలో మన మాట... అందమైన అమ్మాయి ఎలా పెట్టినా ముగ్గు బాగానే ఉంటుందండి.. :-) అసలు మాటేంటంటే ముగ్గు పెట్టే అమ్మాయి, ముగ్గెలా ఉన్నా కూడా నచ్చుతుంది... :-) ఏమొ, నిజంగా అంత చక్కటి దృశ్య కావ్యాన్ని చూస్తే మనసు జారవిడుచుకుంటానేమొ...!!


చాలా చాలా థాంక్స్ అండి...

Anonymous said...

chaala baaga raasavu.
naa flash back lo sankranthi rojulu gurthu vachhayi.
keep writing, its a gift.
God Bless You!!!

Anonymous said...

annayya amazing kavithalu.............ne talent ki hatz offffffffffffff!!!!!!!!!!

Anonymous said...

ammayi bomma drawn by u

Spartan said...

this is a wonderful description ra...its very very close to the natural situation.
the Comparison was awesome....
"ఆ నవ్వులో తడిసిన ముగ్గు ముత్యాల ముగ్గయ్యింది"
this was a very beautiful line...

మోహన said...

>>ఆ వేగంతో చుక్కలని అనుసరించడానికి ప్రయత్నించిన నా కళ్ళు తిరిగాయి...
>>ముంగురులను పైకి పోగు చేసుకుంటూ

సహజమైన క్రియలు. అందమైన వర్ణనలు. చాలా బాగుంది.

Unknown said...

ఆమె ముత్యాలని ఏరి ముత్యాల ముగ్గుగా వేస్తే
మీరు అక్షర ముత్యాలతో మరో ముగ్గు వేసారు.

వేణూశ్రీకాంత్ said...

చాలా బావుంది దిలీప్

Purnima said...

Beauty!! Can't get better than this.

సూర్యుడు said...

కవిత చాలా బాగుంది :-)

~సూర్యుడు :-)

Bolloju Baba said...

కవిత కొద్దిగా పల్చగా ఉన్నట్లనిపిస్తున్నా, చాలా బాగుంది.
కవిత్వానికి దూరంగానూ (కవిత్వం అంటే ఏమిటి) వచనానికి దగ్గరగానూ (మరి వచనకవిత్వం అంటే ఏమిటి) అనిపిస్తుంది.
నాకలా అనిపించింది అంతే. మీకు కోపం వచ్చినా అదంతే. (కొంచెం ఎక్కువ కోపం వస్తే అంతే కాదు)

సరదాగా
బొల్లోజు బాబా

ఏకాంతపు దిలీప్ said...

@ మోహన గారు
మీకు నచ్చినందందుకు సంతోషం :-)


@ వేణు శ్రీకాంత్ గారు
మీకు నెనర్లు :-)


@ ఫణి గారు
చాలా పెద్ద పేరు మీది. మరి నా ముగ్గు బాగుందో లేదో చెప్ప లేదు. :-)
ఇంకా అక్కడ అమ్మాయి ముత్యాలతో ముగ్గెయ్యడం లేదు. తను నవ్వుతుంటే ముత్యాలు రాలి ముగ్గులో పడితే ఆ ముగ్గు ముత్యాల ముగ్గైపోయింది :-)
ముత్యాల ముగ్గు అనే మన వాడుకకి నా భాష్యం చెప్దామని అలా రాసాను!

ఏకాంతపు దిలీప్ said...

@పూర్ణిమ
Thank you. It means alot to me!



@రవీంద్ర
మీరు నా స్నేహితుడు రవీంద్రో ఇంకో బ్లాగరు రవీంద్రో అర్ధం కావడం లేదు.. థాంక్స్ అండి..

@ సూర్యుడు
సంతోషం.. :-) నెనర్లు..

ఏకాంతపు దిలీప్ said...

@ బాబా గారు
:-) నాకేమీ కోపం రాలేదు. కానీ మిమ్మల్ని ఆ సందేహంలో పడేసినందుకు సరదాగా సంతోష పడుతున్నాను :-) నాకు కనిపించిన దృశ్యాన్ని, నా ఊహని, ముత్యాల ముగ్గు కి భాష్యం చెప్పాలనే కోరిక జతైనప్పుడు రాసాను ఇది...

నిషిగంధ said...

నువ్వేమన్నా అనుకో(మరీ ఎక్కువ అనుకోకు), నేను వచనంలానే చదువుకున్నా.. అలానే చాలా బావుంది :-)

నిషిగంధ said...

చిన్నప్పుడు పండుగ రోజు పొద్దున్నే స్నానం చేసి పట్టు లంగా వేసుకుని ముగ్గు వేస్తానంటే మా అమ్మ అస్సలూరుకునేది కాదు.. బట్టలు పాడైపోతాయని.. ఇప్పుడు నీ ముగ్గులో నా ఫాంటసీని చూసుకుంటున్నా :-)

ఏకాంతపు దిలీప్ said...

@ నిషిగంధ గారు
మీరు ఎమైనా అనుకోండి. మిమ్మల్ని ఆ పదాలతో పాటూ మీ ఊహాలోకంలోకి తీసుకెళ్ళగలిగానా లేదా అన్నదే నాకు ముఖ్యం.. :-) నెనర్లు.

Unknown said...

ఆ అమ్మాయి చేతిలోనుంచి రాలిన ముగ్గు ఆల్చిప్పలో పడిన నీటి బిందువయ్యింది. ఆమె నవ్వు సోకగానే ముత్యమై వెలికి వచ్చింది.
(ఆమె ముత్యాలను ముగ్గు పెట్టలేదని తెలుసు, కానీ ఎందుకు ముత్యాలను పెట్టిందని రాసానంటే... ఎంత మొక్క నాటాము అన్నా సరే ఆ మొక్క రావడానికి విత్తనం నాటాల్సిందే.)

ఇక నా పేరంటారా, మా అన్నయ్య పేరు కన్నా చిన్నదే (మిరియాల శ్రీ వెంకట సత్య సూర్య క్రిష్ణ ప్రసన్న దిలీప్ ).అంత పెద్ద పేరవడం వల్ల ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుస్తున్నారు (ఫణి, ప్రదీప్ , అర్జున్ , సత్య ఇలా...). ఎంత పెద్దదైనా నా పేరు నాకు ముద్దే...

మీ కవిత నచ్చబట్టే, ఆ కవిత చదివాక సంక్రాంతి ముగ్గుల సంబరాలు గుర్తు రాబట్టే వ్యాఖ్య రాసాను.

Kranthi said...

దిలీప్ చదివింది అంతా నిజంగా చూస్తున్నట్టుగా ఉంది.ముగ్గుకూడా కనపడింది కానీ, అమ్మాయే సరిగ్గా తలెత్తలేదు ఎవరో తెలీలా? అడ్రసు తెలిస్తే చెప్పు ఒక అప్లికేషన్ పెట్టుకుంటా.;-)