ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Thursday, March 6, 2008

ఏదీ నా చుక్క?!!!అద్దాల కిటికీ నుండి నిశీధిని నిశితంగా చూస్తూ
ఏముంది? ఈ రేయి రంగు కలిసిన నింగిలో..
నా కళ్ళని కవ్వించే దాని విశాలత్వమేమో
అప్పటి వరకు గందరగోళమై అంతా ఆవరించిన ఆలోచనలు చిన్నవై ఎటోపోతాయి
మనసుకి చల్లని ప్రశాంతతని పంచుతుంది

కానీ ఇంతలో ఒక తలపు పెద్దదై అంతా ఆవరిస్తుంది
ఏదీ నా చుక్కని?

చమక్కుమంటూ ఒక చుక్క, నన్ను చూసావా అంటున్నట్టు
ఆ చూసాను... అదిగో ఇంకో చుక్క

ఇలా ఎన్ని చుక్కలని లెక్కపెట్టలేదు ఇప్పటికి?
కానీ ఎప్పుడైనా అలసిపోయానా...?

అదిగదిగో దూరంగా పట్టించుకుంటే గాని పట్టలేని పాలపుంత
ఎన్ని పుంతలు తొక్కలేదు... నీ కోసం వెతుక్కుంటూ...

హైవే మీద కేశినేని బస్సులో వెనక హాయిగా ఉయ్యాలూపినట్టుంది
నా కనురెప్పలు వాలుతూ తేలుతున్నాయి..
ఇది అలుపు కాదు తెలుసా?
అసంకల్పిత ప్రతీకార చర్య
కళ్ళుమూసుకుంటే తను చేరువవుతుందేమోనని చిన్ని ఆశ
కలలోనైనా...

ఏదీ నా చుక్క?!!!

18 comments:

రాధిక said...

ఈ కవితని మొదట చదివినప్పుడు చెలి కోసం తపిస్తూ రాసినట్టనిపించింది.రెండవసారి చదివితే ఆకాశం లో తారకలతో మాట్లాడే భావకుడి మది కనిపించింది.కేశినేని వెనుక సీటు ఇంత బాగుంటుందని ఎప్పుడూ తెలియలేదు.ఎప్పుడు తిట్టుకుంటూ భజన చేసుకోవడమే.

నిషిగంధ said...

చాలా బావుందండీ. అందమైన చుక్కల రాత్రిని కళ్ళముందుంచారు :-)

దీపు said...

@రాధిక గారు,
చాలా థాంక్స్ అండి. నాకు కవితలు రాసేవాడు అనేదానికన్నా భావకుడు అంటేనే సంతృప్తిగా ఉంటుంది.. చాలా సార్లు నేను రాసేవి కవితలు అంటే నాకే ఇష్టముండదు...
ఇంక నేను ఎక్కిన కేసినేని బస్ విజయవాడ టు బెంగుళూరు... కొత్త బస్ అనుకుంట స్పీడ్ బ్రేకెర్లు వచినప్పుడు కూడా చాల స్మూత్గా ఉండింది ప్రయాణం...

దీపు said...

@ నిషిగంధ గారు

చాలా థాంక్స్ అండి.. మీరు నా కామెంట్ కి రెప్లై ఇవ్వకపోతే ఇబ్బందిపెట్టానేమొ అనిపించింది.. చదివిన వెంటనే భావావేశంలో అది పోస్ట్ చేసేసాను...

ఇంకా బస్ కిటికీలొనుండి చుసినప్పుడు రాసిందంది... ఒకసారి మధ్యలో బస్ దిగినప్పుడు పైకి చుస్తే అన్ని చుక్కలు ఎప్పుడు చుదలేదు అన్నట్టు ఉన్నాయి ఆకాశం నిండా...

దీపు said...

@ రాధిక గారు

దీన్ని ఇంతకుముందు నా రాతలు చదవని వాళ్ళకి చూపిస్తే ఎమీ అర్ధమవ్వనట్టు మొహం పెట్టారు... చదివిన వాళ్ళకి చూపిస్తే చెలి మీద ఇంకొటి రాసాడు అనుకున్నారు... నెను చెప్పాలనుకున్నది వెంటనే అర్ధం కాదెమొ అనిపించింది... చీకటి ఆకాశం నాకు ఎందుకు ఇష్టమో మొదటి నాలుగు వరసల్లో రాసాను...

నిషిగంధ said...

అయ్యో, మీరేమీ ఇబ్బంది పెట్టలేదు దిలీప్ గారూ.. నాకు వర్క్ లో బోల్డన్ని సినిమా కష్టాలు.. అందుకే online లో ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను.. అందుకే రిప్లై ఇవ్వలేదు..

మొదటి ఖండిక నాకు చాలా నచ్చింది.. ఇంకా చెప్పాలంటే మీ గ్రీటింగ్ అయిడియా కి అది చక్కగా సరిపోతుంది.. ఏమంటారు? :-)

ఒక సూచన. మీ బ్లాగ్ బాక్ గ్రౌండ్ కలర్ బ్లూ అవటం వలన linked text కనిపించటం లేదు.. చీకట్లో చేతులు చాచి తడుముకున్నట్లు మౌస్ ని అటూ ఇటూ తిప్పి పట్టుకోవాల్సివస్తుంది :))

arunakiranalu said...

deepu garu mee kavithalanni chadivanu chala bavunnai andi meeru prakruthi premikulu anukunta..manchi kavitha chadivamu.chala thanks andi.. aruna

deepu garu nenu kotha bloger nandi create chesa but adi disply lo ela pettalo thelitam ledu, i mean andaritho na bavalanu andaritho panchukonevidhamga.. blog settings kuda thelitam ledandi pls. helpme.. arunakiranalu.blogspot

నువ్వుశెట్టి బ్రదర్స్ said...

అనుకోకుండా, మీ బ్లాగులో కొచ్చి పడ్డాను. ఈ కవిత చదువుతుంటే, రకరకాల భావాలు మెదిలాయి. కేసినేని బస్ అనుభవాన్ని సూపర్ గా ఇరికించారు. మంచి భావాన్ని మంచి కవిత ద్వారా అందించారు.

arunakiranalu said...

deepu garu

chala thanks andi.. kani kudali lo jalleda lo yela cherchalo thelitam ledandi

aruna

swathi said...

annaya! chukka kavitha bavundi kesineni travels! oh!...........marvelous annayya....

valli said...

Dilip!!!
Nee kavithalaki pedda fan ayyipoyanu,nuvvu edaina kotha kavitha raasava ani visit chesanu, happy ga velthunnanu.
God Bless You!!!!

దీపు said...

@ నిషిగంధ గారు

థాంక్స్ అండి... ఇప్పుడు విజిటెడ్ లింక్ రంగు మార్చాను... మీ పొలిక భలె ఉంది... "చీకట్లో చేతులు చాచి తడుముకున్నట్లు మౌస్ ని అటూ ఇటూ తిప్పి పట్టుకోవాల్సివస్తుంది :))" అలా పోల్చగలరు కాబట్టే మీరు అంత అందంగా రాయగలరేమొ...
త్వరగా మీరు సినెమ కష్టాల నుండి బయట పడాలని కోరుకుంటున్నాను :)

దీపు said...

@నువ్వుశెట్టి బ్రదర్స్
థాంక్స్ అండి.. ఆ బస్ లో ఉన్నప్పుడు తట్టింది కాబట్టి, బస్ ని కూడా ఇరికించేసాను :)

Abhisarika said...

Varnana,Bhavana,OOha pradhanam ga sage me kavitha meedi yenta sunnitamina saralo chebutundi chaduvutunanta sepu nenu meloki parakaya pravesam cheyagaliganu nenu palapuntaladaka velli vachanu .......................................................

దీపు said...

@అభిసారిక గారు
చాలా థాంక్స్ అండి... మీకు నచ్చినందుకు సంతోషం.. మీరు ఇంక బ్లాగు మొదలుపెట్టలేదు... తొందరగా... రండి.. తెలుగు తోటలో కొన్ని మొక్కలు నాటుదాము... పువ్వుల పరిమళాన్ని ఆస్వాదించడానికి, పంచడానికి :-)

ప్రసాద్ said...

దీపు గారూ,
మీ కవితా వనాన్ని "స్నేహమా" రాధిక గారు పరిచయం చేశారు.

మీ వర్ణనలు బాగున్నాయి. ఇంకా చదవాలి మిగిలినవన్నీ.

--ప్రసాద్
http://blog.charasala.com

భావకుడన్ said...

దిలీప్ గారు,

చాలా బాగుంది మీ వర్ణన.

నాకేమో మీరు "మీ చుక్కని" ఊహిస్తూ- అక్కడ ఉన్న చుక్కల్ని వర్ణిన్చారేమో అని అనిపించింది.

కేసినేని ప్రస్తావన కొస మెరుపు.

మీ బ్లాగు పేరు కూడా బావుంది

ఏకాంతపు దిలీప్ said...

@భావకుడన్ గారు

అవునండి.. ఆ చుక్కలని చూస్తే నా చుక్క గుర్తొచ్చింది... అలా రాసాను :-) అది కేశినేని లో బెంగళూరు వెళ్తున్నప్పుడు రాసింది..
మీకు నా నెనర్లు.