ఆకాశం నిర్మలంగా ఉంది
ఎటువైపు చూసినా జాబిల్లి జాడ తెలియడం లేదు
చుక్కల ఆనవాలూ లేదు
చల్ల గాలి నేనున్నానంటూ నా భుజం తడుతుంది,దానికి నా పరిస్థితి అర్ధమైనట్టు!!
నా చూపులు సర్దుకున్నాయి...
నా ముందు చేతిలో చేయి వేసుకుని నడుస్తున్న భామ్మ, తాత,
...కలిసిన ఆ చేతులకు ఎన్నేళ్ళో?!
బెంచి మీద కూర్చుని దగ్గరితనపు మైమరపులో కొత్తగా పెళ్ళైన జంట,
...దగ్గరితనపు భాష అనుభవించేవాళ్ళకే తెలుస్తుందేమో?!!
దారికి అడ్డంపడుతూ ఆడుకుంటున్న కుక్కలు,
గాలికి ఊగుతున్న ఉయ్యాలల జోడి,
తేలుతున్న ఊగుడు బల్ల...
నా ఎదురు పడుతూ పదే పదే నా ఒంటరితనాన్ని ప్రశ్నిస్తున్నాయి...
ఏదీ నీ తోడని..?!!!
నేను నడుస్తూనే ఉన్నాను....
--------------------------------------------------
ఆకాశం నిర్మలంగా ఉంది
ఎటువైపు చూసినా జాబిల్లి జాడ తెలియడం లేదు
చుక్కల ఆనవాలూ లేదు
చల్ల గాలి నేనున్నానంటూ నా భుజం తడుతుంది,దానికి నా పరిస్థితి అర్ధమైనట్టు!!
నా చూపులు సర్దుకున్నాయి...
మా ఇంటి ముందున్న పార్క్లో నడుస్తున్నాను....
నా ముందు చేతిలో చేయి వేసుకుని నడుస్తున్న భామ్మ, తాత,
(నాలో నేను... కలిసిన ఆ చేతులకు ఎన్నేళ్ళో?!)
బెంచి మీద కూర్చుని దగ్గరితనపు మైమరపులో కొత్తగా పెళ్ళైన జంట,
(...దగ్గరితనపు భాష అనుభవించేవాళ్ళకే తెలుస్తుందేమో?!! )
దారికి అడ్డంపడుతూ ఆడుకుంటున్న కుక్కలు,
గాలికి ఊగుతున్న ఉయ్యాలల జోడి,
తేలుతున్న ఊగుడు బల్ల...
నా ఎదురు పడుతూ పదే పదే నా ఒంటరితనాన్ని ప్రశ్నిస్తున్నాయి...
ఏదీ నీ తోడని..?!!!
నేను నడుస్తూనే ఉన్నాను....