ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Tuesday, April 1, 2008

ఏదీ నీ తోడని..?!!!



ఆకాశం నిర్మలంగా ఉంది
ఎటువైపు చూసినా జాబిల్లి జాడ తెలియడం లేదు
చుక్కల ఆనవాలూ లేదు
చల్ల గాలి నేనున్నానంటూ నా భుజం తడుతుంది,దానికి నా పరిస్థితి అర్ధమైనట్టు!!

నా చూపులు సర్దుకున్నాయి...

నా ముందు చేతిలో చేయి వేసుకుని నడుస్తున్న భామ్మ, తాత,
...కలిసిన ఆ చేతులకు ఎన్నేళ్ళో?!
బెంచి మీద కూర్చుని దగ్గరితనపు మైమరపులో కొత్తగా పెళ్ళైన జంట,
...దగ్గరితనపు భాష అనుభవించేవాళ్ళకే తెలుస్తుందేమో?!!
దారికి అడ్డంపడుతూ ఆడుకుంటున్న కుక్కలు,
గాలికి ఊగుతున్న ఉయ్యాలల జోడి,
తేలుతున్న ఊగుడు బల్ల...

నా ఎదురు పడుతూ పదే పదే నా ఒంటరితనాన్ని ప్రశ్నిస్తున్నాయి...

ఏదీ నీ తోడని..?!!!

నేను నడుస్తూనే ఉన్నాను....


--------------------------------------------------
ఆకాశం నిర్మలంగా ఉంది
ఎటువైపు చూసినా జాబిల్లి జాడ తెలియడం లేదు
చుక్కల ఆనవాలూ లేదు
చల్ల గాలి నేనున్నానంటూ నా భుజం తడుతుంది,దానికి నా పరిస్థితి అర్ధమైనట్టు!!

నా చూపులు సర్దుకున్నాయి...

మా ఇంటి ముందున్న పార్క్లో నడుస్తున్నాను....

నా ముందు చేతిలో చేయి వేసుకుని నడుస్తున్న భామ్మ, తాత,
(నాలో నేను... కలిసిన ఆ చేతులకు ఎన్నేళ్ళో?!)
బెంచి మీద కూర్చుని దగ్గరితనపు మైమరపులో కొత్తగా పెళ్ళైన జంట,
(...దగ్గరితనపు భాష అనుభవించేవాళ్ళకే తెలుస్తుందేమో?!! )
దారికి అడ్డంపడుతూ ఆడుకుంటున్న కుక్కలు,
గాలికి ఊగుతున్న ఉయ్యాలల జోడి,
తేలుతున్న ఊగుడు బల్ల...

నా ఎదురు పడుతూ పదే పదే నా ఒంటరితనాన్ని ప్రశ్నిస్తున్నాయి...

ఏదీ నీ తోడని..?!!!

నేను నడుస్తూనే ఉన్నాను....

12 comments:

రాధిక said...

సమూహం లో ఏకాంతాన్ని వెతుక్కుంటున్నారా?
కలిసిన చేతులకు ఎన్నేళ్ళో?ఈ భావానికే ఇవ్వొచ్చునేమో నూరు వరహాలు.
మీ చుట్టూ వున్నదానిని అద్భుతం గా వివరించారు.అభినందనలు.

పద్మ said...

కాదేమో రాధిక గారూ. ఏకాంతంలో సమూహాన్ని(తోడు) ఆహ్వానిస్తున్నారేమో. :p

// కలిసిన ఆ చేతులకి ఎన్నేళ్ళో //

ఈ లైను వదలి ముందుకి వెళ్తేగా మిగతా కవితని ఆస్వాదించటానికి.

Swathi said...

bavundi..chala ekantham...ontaritanam......chala baga touch chesavu.............kottaga pelliayina janta..basha...oh! marvelous...spectacular.......

Purnima said...

hmm.. chaala baaga raasaru.. eduru choodadam enta kashtamani..

Anduke evaro oka kavi ela annadu
"Eduru choopula baadha lone enduko ee teeyadanam"
"Virahamannadi lekhapothe valapukedi vechhadanam"

నిషిగంధ said...

దీపూ, ఎప్పటిలానే చాలా బావుంది.. మీ భాషలో చాలా ఈజ్ ఉంటుంది, అందుకే తొందరగా నచ్చేస్తుంది :)

ఇకపోతే.. మీరేమీ అనుకోనంటే.. అస్సలంటే అస్సలు అనుకోకపోతే రెండు, మూడు సవరణలు..

మొదటిది - 'మా ఇంటి ముందున్న పార్క్ లో నడుస్తున్నాను '.. ఈ లైన్ తీసేయండి.. అది చెప్పకపోయినా తర్వాత లైన్స్ చదువుతుంటే తెలిసిపోతుంది పాఠకులకి.. అలా తెలిసేలా ఫీలింగ్ కలగజేసేదే కవిత..

రెండోది - బ్రాకెట్లు తీసేయండి.. ఫ్లో చాలా బావుంటుంది అప్పుడు..

మూడోది - 'నాలో నేను - కలిసిన ఆ చేతులకు ఎన్నేళ్ళో!? ' ఇందులో 'నాలో నేను ' తీసేయండి.. 'కలిసిన ఆ చేతులకు ఎన్నేళ్ళో!? ' అనుకోవడమే స్వగతం.. మళ్ళీ దానికి 'నాలో నేను ' జత చేయక్కరలేదు..

I really hope you don't mind me suggesting the corrections..

ఏకాంతపు దిలీప్ said...

@రాధిక గారు
మీ కామెంట్ నన్ను ఈ బ్లాగ్ప్రపంచంలో పడిపోకుండా నడిపిస్తుంది... చాలా థాంక్స్... :-)

ఏకాంతపు దిలీప్ said...

@రాధిక గారు, పద్మ గారు

సమూహంలో ఉన్నా తప్పించుకోలేని ఒంటరితనం నన్ను ఏకాకిని చేస్తుంటే, సమూహంలో కూడ ఏకాంతం అనుభవిస్తున్న ఆ జంటలని చూసి ఒక తోడుని ఆహ్వానిస్తున్నాను.... ఒంటరితనాన్ని తప్పించుకుందామని, సమూహం కూడా చేధించలేని ఏకాంతాన్ని సొంతం చేసుకుందామని....

ఏకాంతపు దిలీప్ said...

@పూర్ణిమ గారు
థాంక్స్ అండి... అలాంటి అర్ధం వచ్చేట్టే, నేను " గౌతమీ తీరాన" రాసాను.... చూసారా?

ఏకాంతపు దిలీప్ said...

@ నిషిగంధ గారు

ముందుగా నేను అసలు అస్సలస్సలసలు అసలు అనుకోలేదు అని తెలియచేసుకుంటున్నాను... :-)
మీ సూచనలకి చాలా చాలా థాంక్స్...
నేను రాసేవి కవితలు అని చాలాసార్లు నాకు అనిపించవు.అలా నేను కవిత రాయడానికి ప్రయత్నించను సహజంగా.కవిత అనేది చాలా పెద్ద విషయం అనుకుంటాను.దేన్ని కవిత అంటారో కూడా నాకు తెలియదు.ఎవరివైన చదివితే పొందిక,భావం బాగుంటే కవిత అనుకుంటా. ఈ బ్లాగుల వల్లే నేను ఎంతో కొంత చదవగలుగుతున్నాను... తెలుగు మీడియం లొ పదో తరగతి వరకు చదువుకున్నాను అన్న కాంఫిడెన్స్ తప్పితే నాకు తెలిసింది, చదివింది తక్కువే... :-)

అలా మదిలో మెదిలే భావాలని రాయడానికి ప్రయత్నిస్తాను. నన్ను నేను భావుకునిగా, వర్ణన కారునిగా అనుకుంటాను. కాబట్టి నాకు తోచినట్టు రా రాతల్లొ భావుకత, వర్ణన కనపడుతుంది.వాటినే మార్పులు చేర్పులతో మంచి కవితలా చూడొచేమొ.నేను రాసేదానిలో ఒక మంచి కవిత అయ్యే విషయం ఉంటే అలా ప్రయతించదానికి ఇబ్బంది పడను... అది నాకు ఇంకా ఆనందాన్నిస్తుంది...

మీ సూచనలతో మార్పులు చేసిన తరవాత, పొందిక బాగుంది... ఇలానే చెప్తుంటారని ఆశిస్తున్నాను... కృతజ్ఙతలతో...

సుజాత వేల్పూరి said...

'కలిసిన ఆ చేతులకు ఎన్నేళ్ళో' ఈ ప్రయోగం చాలా టచింగ్ గా ఉంది. నిషి గంధ గారి సూచనలు బాగున్నాయి. నిజానికి 'కవిత ' కి ప్రత్యేక నిర్వచనం ఏమీ లేదండీ! మదిలో మెదిలే భావాలని అందంగా చెప్పడమే కవిత్వం! కొంతమంది సూటిగా చెప్తారు(శివారెడ్డి గారు, జయప్రభ ). మరికొంత మంది సంక్లిష్టంగా రాస్తారు....వేగుంట మోహన ప్రసాద్ గారి కవితలు చదివారా! మీ భావాలు, వాటి వ్యక్తీకరణ చాలా బాగున్నాయి.

ఏకాంతపు దిలీప్ said...

@సుజాత గారు
చాలా థాంక్స్ అండి.. నేను మీరు చెప్పినవేవీ చూడలేదు... అవకాశం వస్తే తప్పకుండా చూస్తాను...

Nrahamthulla said...

భార్యపై సామెతలు
ఆలు మంచిదని అనబోకురన్నా అదివచ్ఛి మనఇంట అణిగియుండేదాక
ఆలికి లొంగినవాడు అరగాణిలో పడినవాడు అటిటు ఔతారు
ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా?
ఆలికి అదుపు ఇంటికి మదుపు
ఆలితో కలహించి ఆకాలికాదని పస్తు పండెడువాడు పంజు వెధవ
ఆలికి గంజిపోయనివాడు ఆచారం చెప్పినట్లు
ఆలిని అదుపులో పెట్టలేనివాడు అందరినీ అదుపులో పెట్టగలడా?
ఆలిని ఒల్లని వాడు ఈలకూరలో ఉప్పులేదన్నాడట
ఆలిని విడిస్తే హరిదాసు సంసారం విడిస్తే సన్యాసి
ఆలి పంచాయతీ రామాయణం పాలి పంచాయతీ భారతం
ఆలి మాటవిన్నవాడు అడివిలో పడ్డవాడు ఒకటే*ఆలు ఏడ్చిన ఇల్లు ఎద్దుఏడ్చిన సేద్యం ముందుకురావు
ఆలు కుదురైతే చేను కుదురు
ఆలుమగల కలహం అన్నం తినేదాకనే
ఇంటికి దీపం ఇల్లాలు
ఇల్లాలి శుభ్రత ఇల్లు చెబుతుంది
ఇల్లు చూసి ఇల్లాలిని చూడమన్నారు
భార్యమాట బ్రతుకుబాట
భార్య అనుకూలవతి ఐతే సుఖి లేకుంటే వేదాంతి ఔతారు
ఇల్లాలు గుడ్డిదైతే ఇంటికుండలకు చేటు
ఇల్లాలులేని ఇల్లు దయ్యాలకొంప