ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Tuesday, July 15, 2008

కాలపు కడలి కెరటాలు: భయం

ఇంకా నాకు మా ఊరు కొత్తగానే ఉంది. తమ్ముడు నాకు తెలియని వాళ్ళని పరిచయం చేస్తూ ఉండేవాడు. ఈలోగా నా పుట్టిన రోజు వచ్చింది. అమ్మమ్మ దగ్గర పుట్టినరోజు అంటే, గుడిలో పూజ చేయించుకుని క్లాస్ అంతా చాక్లెట్లు, పెన్సిల్లు, ఎరేజర్లు పంచిపెట్టడం. ఇక్కడ పుట్టినరోజు ఎలా చేస్తారో తెలియదు. ఊహ తెలిసాక అమ్మ దగ్గర మొదటి పుట్టినరోజు. అమ్మ వాళ్ళ హడావుడి చూస్తుంటే ఎదో భారీగానె సిద్ధం చేస్తున్నారు అనిపించింది... ఊళ్ళో చూట్టాలంతా వస్తున్నారంట...

ఇంకా క్లాస్లో ఎవరూ ఫ్రెండ్స్ అవ్వలేదు... పుట్టినరోజు అయితే అందరికీ చాక్లేట్లు ఇచ్చేసి ఫ్రెండ్స్ చేసుకోవచ్చు కదా... ఇవన్నీ నన్ను ఆ రోజు కోసం ఎదురు చూసేట్టు చేసాయి...

రేపే పుట్టినరోజు...

అమ్మ వాళ్ళ పిన్ని కూతురు ముందే వచ్చేసింది... ఆ పెద్దమ్మ చేస్తున్న హడావుడి చూసి భలే ఆనందం వేసింది... రేపు ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే కేక్ సంగతి నా చెవిలో పడింది... ఇంక నా ఆనందానికి అవధుల్లేవు... అలా ముందు రోజు పెద్దమ్మ కబుర్లు, చుట్టూ ఉన్న చూట్టాల కబుర్లతో పండగ వాతావరణంలా ఉంది.. అదంతా నా కోసమే అని ఉబ్బి తబ్బిబ్బయిపోయాను...

ఆనందంలో అలిసిపోయి రాత్రికి రేపటి గురించి ఆలోచిస్తూ నిద్రపోయాను...

తొందరగానే నిద్రపట్టేసింది....

నిద్రలో...

పట్ట పగలు... పక్కగా ఉన్న వంట గదిలో అమ్మ వంట చేసుకుంటుంది... అమ్మకి కనపడకుండా హాల్ లో నుండి బేడ్ రూంలోకి నాకు తెలియని ఒక వ్యక్తి, ముసుగుతో అడుగుపెట్టేసాడు... నేను గమనించలేదు... ఇంకో వైపు తిరిగి ఏదో చేస్తున్నాను... శబ్ధం అయి వెనక్కి తిరిగి చూస్తే అతను నాకు దగ్గరగా వచ్చేస్తున్నాడు... నాకు భయం వేసింది... తను ఇంకా దగ్గరకొచ్చేస్తున్నాడు... నేను భయంలో అరవలేకపోయాను... నేను అతనినుండి వెనక్కి జరుగుతున్నాను... తను ఇంకా దగ్గరకి వచ్చేస్తున్నాడు.. నేను ఇంకా వెనక్కి జరుగుతున్నాను... నా వైపు చేయివెయ్యబోతే ఇంక వేగంగా వెనక్కి జరిగాను... అలా జరుగుతుంటే నా తలకి ఎదో బలంగా తగిలింది.... అంతే ఏడుస్తూ నిద్ర లేచాను....

ఏం జరిగిందంటే... నేను కలలో వెనక్కి జరుగుతు, బెడ్ మీద కూడా వెనక్కి వెనక్కి జరిగి తలగడని దాటేసి డబుల్ కాట్ అంచుకు,దానికి ఆనుకున్న గోడకి బలంగా నా తలని గుద్దుకున్నాను....

ఆ తలనొప్పితో తరవాత నిద్ర పట్టలేదు... తరవాత రోజంతా కూడా తలనొప్పి తగ్గలేదు...

అందరు హడావుడి చేస్తుంటే నేను మాత్రం ఎంజాయ్ చెయ్యలేకపోయాను.... :(

సాధారణంగా నాకు కలలు గుర్తు ఉండవు ఎక్కువ రోజులు... కానీ ఈ ఒక్క కల మాత్రం అప్పటి నుండి ఇప్పటి వరకు మరచిపోలేదు...

నిజంగా నిజ జీవితంలో కూడా భయాన్ని అంత భయంకరంగా చూడలేదు....

మీకు వెంటాడే జ్ఞాపకాల్లో ఏమైనా కలలు ఉన్నాయా??

11 comments:

ప్రతాప్ said...

funny..
చివరి వరకు ఆ రోజుకోసం ఎదురు చూసి, ఆరోజే ఆరోజుని అనుభవించకపోవడం నిజంగా వెంటాడే జ్ఞాపకం, మీకొచ్చిన కల అందుకే మీ మస్తిష్కంలో నిలిచిపోయిందనుకొంటాను.

మోహన said...

మీకు ఆ రోజు దృష్ఠి తగిలినట్టుందండీ దిలీప్ గారు..:)

ఇక కలలంటారా.. మనకి అవి ఎక్కువే.. అన్నీ యాక్షన్ మూవీలే.. నేను వీర రేంజి లో ఫైట్లు. ఛేసింగులు. అలా పరుగుపెట్టేటప్పుడు, వాళ్ళూ బైక్ ఎక్కి పారిపోతే, నాకూ అక్కడ ఒక బైక్ ప్రత్యక్షం అవుతుంది. నాకు డ్రైవ్ చెయ్యటం రాదు కాబట్టి, నేను ఉన్నట్టుండి ఒక అబ్బాయినయిపోయి.. మరీ ఛేస్ చేస్తుంటాను. మీరెప్పుడైన విన్నారా ఇలాంటి కలలు?

ఇకపోతే.. భయం కలిగించే కల.. చిన్నప్పుడు, "2000 కి అంతా అయిపోతుంది. యుధ్ధం వస్తుంది." అనే మాటలు నాలో తెలియకుండానే భయం నింపినట్టు ఉన్నాయి. మూడో ప్రపంచ యుధ్ధం వచ్చినట్టు, చైనా జవాన్లు, మా ఇంటి పై దాడి చేసినట్టు కకలావికలంగా [పదం సరైనదేనా?] అంతా చెల్లాచెదురై ఉన్నట్టూ, నేను వీధిన పడ్డట్టు, అప్పుడు అమ్మా, నాన్నా పడవలో ఒచ్చి [అంత క్రితం వాళ్ళు ఊరెళ్ళారులేండి, కలలో..] నన్ను తీసుకుపోయినట్టు... అబ్బో పెద్ద కలే... ఇదే కల నాకు రెండు, మూడూ సార్లు ఒచ్చింది.

అలానే కలలో ఉలిక్కిపడి లేచి, ఇది కలా అని ఊపిరి పీల్చుకున్న కలలూ ఉన్నయి. నా కలల గురించి రాస్తూ పోతే ఒక పెద్ద సైన్స్ పుస్తకం అవుతుంది. నవ్వకండి! నేను కలలో ఐనస్టీన్ ని కూడా చూసాను తెలుసా..? ఇంకా 3డి ఇంద్ర ధనుస్సులు.. ఇక చాలు. మీరు మరీ నవ్వేస్తున్నారు. ఇలా ఐతే నేను ఇక చెప్పను. అంతే..!

కల said...

దిలీప్,
gud narration.
ఏంటో చిన్నప్పటి భయాలని తలుచుకొంటే నాకు ఇప్పటికీ నవ్వాగదు. పక్క ఇంట్లో దెయ్యాలున్నాయని ఎవరో చెబితే అటుపక్కకి వెళ్ళాలంటే భయపడేదాన్ని. ఇప్పటికీ ఆ ఇంటికి వెళ్ళాలంటే భయం. దెయ్యాలు లేవని నమ్మినా కాని, ఈ భయం మాత్రం నన్ను ఇప్పటికీ వదలలేదు.
మోహనా మీ కలలు బావున్నాయి. దీని పైన మీరో post రాస్తే మనస్సారా నవ్వుకొంటాం.

బొల్లోజు బాబా said...

మీరు కవిత్వంలోనే కాదు వచనంలో కూడా దిట్టే.

బొల్లోజు బాబా

Swathi said...

annayya ikkada telugu lo rayalante etla!...naku dotalatla!!!!nenu vetukutunna!!!!!!!1

Swathi said...

naku bayam vesedi okate undi !..adi bayam ane word! chinnappaudu ante 14 yrs ki scooter nerchukuntunna!..ma nanna nerputunnaru nenu mundu ma nanna venka, naku asalu scotter ante pedda deyyamu ani na feeling, naku handle cheyyatam raka, ma voorlo ma intinunchi straight road lo velithe library vastundi..aceelator raise chesi vadilesa ma nannara ki andaru frends pani vallu daggaranunchi MP varaku.. evaro vastunnarani vallani palakaristunnaru na venka nunchi..manaki concentration debbatindi.. anthe library ko 2 metlu untayi..2 metlu accelerator raise chesi ekkinchesa!..gate ku guddi padda!...cinemalo action scene laga undi..naku brake veyyalani anipinchela anthe..appatanunchi..scooter, ante pedda deyyam bootam!!!!!!!!!!! akkade ma tataru maddukuri venkanna garu lechi nilabaddaru leke pothe ayanni guddedanni!!!!!!!scooter bayam......... now my tataru is not with us, still when i see my village library,those reminiscences
provides me bundle of joy & happiness & sad about tataru not with us!!!!!!!!!!!! tell me how to post in telugu!..any one plz!!!!!!!

Swathi said...

అన్నయ్య చలా సంథొషం గ ఉంది...వౌ మనము మన తెలుగు భాష లొ రాసి మట్లడుకొచథ్చు!!!!!!!!!!! థంక్స్ .......

వేణూ శ్రీకాంత్ said...

దిలీప్ గారు, బాబా గారు చెప్పినట్లు మీరు కవిత్వం లోను వచనం లోను రెండువైపుల పదునున్న కత్తి లా దూసుకెళ్తున్నారు.

ఏకాంతపు దిలీప్ said...

@ప్రతాప్
అవునేమో...

@ మోహనా
మీ కలలు భలే ఉన్నాయి... నాకైతే అలాంటి కలలు రాలేదు... నేను వినలేదు కూడా :-) నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కళ్ళూ రాత్రి నీకు ఈ కల వచ్చిందిరా అని చెప్తే, వెంటనే మాకసలు కలలే రావు, వచ్చినా గుర్తు ఉండవు అంటారు...

ప్లీజ్,ప్లీజ్... మీ కల గారు చెప్పినట్టు.. ఒక టప.. కాదు నాఇతే మీరు ఒక బ్లాగ్ రాసెయ్యగలరేమో అనిపిస్తుంది... ప్లీజ్ మొదలుపెట్టరూ...

@కలా
థాంక్స్...

@ బాబా గారు
@వేణూ శ్రీకాంత్ గారు
నేను ఆ ప్రశంసకి అర్హుడుని కానేమో,..

ఏకాంతపు దిలీప్ said...

@స్వాతి
నాకిప్పుడు సంతోషంగా ఉంది... నువ్వు కూడా తెలుగులో బ్లాగ్ చెయ్యడం మొదలుపెట్టు...

రాధిక said...

nijame mohana annattu miku dishTi tagili vuntundi.
@mohana asalu suupar kadaa nii kalalu.
naakayite cinima ki saripadaa story jarigipotundi kalalo.konni gurtuntaayi.maavaariki cepite repe rajamouli ki cepudaam ani vetakaaram cestaaru.