ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Friday, October 10, 2008

ప్రేమ గోరింటాకు

శీతాకాలపు నిండు వెన్నెల పూట
ఏకాంతం ప్రసాదించిన తొలి 'సాంగత్యపు అనుభూతి '
వారి పెదవులపై మౌన ముద్రలు వేసింది
మౌనాన్ని ఛేదిస్తూ ఆమె అడుగులు తోటలోకి పడ్డాయి
ఆతని అడుగులు ఆమెను అనుసరిస్తూ...

సన్నగా వీస్తూ తాకిన చల్ల గాలి ఆమె పరిమళాన్ని మోస్తూ
ఆతన్ని ఆమె పక్కకి రప్పించింది
చేతులు పలకరించుకున్నాయి.
ఒక్కసారిగా అడుగులు తడబడ్డాయి - ఆపై ముందుకు సాగాయి
వెచ్చదనం మౌనాన్ని కరిగిస్తూ ఉంది...

మత్తెక్కిస్తున్న సంపెంగ ఆమెను ఆహ్వానించింది
కను రెప్పలు వాల్చి ఆఘ్రాణ ముద్రలో ఆమె -ఆమెని చూసి మైమరచిపోయిన ఆతడు
ఆమె ముందుకు సాగింది,
తేరుకున్న ఆతను సెంపెంగతో ఆమె కురులని అలంకరించాడు
ఆమె పెదవులపై నవ్వుల పువ్వులు విరిసాయి - దోసెట్లో పట్టే ప్రయత్నంలో ఆతడు!
మరిన్ని పూలు అడుగులకి తివాచీ పరచాయి
చిటికెన వ్రేళ్ళు ఊసులాడుకుంటున్నాయి...

చెట్ల చాటు తొలగిన పండు జాబిల్లిని చూస్తూ నిశ్చలంగా ఆమె
ఆ కన్నుల్లో వెలుగుని చూస్తూ ఆతడు
చేతులు పెనవేసుకున్నాయి, మనో నేత్రాల చూపులు కలిసాయి
ప్రేమైక స్పర్శతో పండిన ఆమె చేతి ఎరుపుని చూసి
చిన్నబోయింది తోటలోని గోరింటాకు!
మనసులు మౌనంగానే మాట్లాడుకుంటున్నాయి...

24 comments:

ప్రతాప్ said...

అవును మనస్సులకి తెలిసిన భాష మౌనమే. కనులకి తెలిసిన భాష కూడా మౌనమే.
ఆఘ్రాణ అని అనుకొంటాను.

Ramani Rao said...

మౌనమే నీ బాష ఓ మూగ మనసా.. చాలా బాగుంది.

MURALI said...

chala bagundi. manchi feel undi.

ఏకాంతపు దిలీప్ said...

@ ప్రతాప్, రమణి, మురళి
చాలా నెనర్లు :-) ప్రతాప్ సరిదిద్దాను...

Bolloju Baba said...

పునరాగమన స్వాగతం. hope you enjoyed the break.


సన్నగా వీస్తూ తాకిన చల్ల గాలి ఆమె పరిమళాన్ని మోస్తూ ఆతన్ని ఆమె పక్కకి రప్పించింది

ఎంత సటిల్ ఫీల్ అండీ.

వెచ్చదనం మౌనాన్ని కరిగిస్తూ ఉంది... శతాకాలపు వెన్నెల పూట వెచ్చదనమంతా ప్రేమే.

ఒక అందమైన దృశ్యాన్ని కనులముందు ఆవిష్కరింపచేసారు.

@ప్రతాప్ గారూ,
మీరున్నారనే ధైర్యంతోనే నిఘంటువు చూడకుండా ఫోస్ట్ చేసేస్తున్నాం. మీరలా చెపుతూ ఉండాల్సిందే. సరదాగా.

బొల్లోజు బాబా

Anonymous said...

Good one :)

నిషిగంధ said...

Good one!
"ప్రేమైక స్పర్శతో పండిన ఆమె చేతి ఎరుపుని చూసి
చిన్నబోయింది తోటలోని గోరింటాకు!"
చాలా బావుంది :-)

మోహన said...

:) చాలా బావుంది

రాధిక said...

మీరు చదువుతున్న పుస్తకాల ప్రభావం మీ మీద బాగా పనిచేస్తున్నట్టు వుంది.చిక్కబడుతున్నాయి భావాలు.చాలా బాగా రాసారు.

పద్మ said...

అదేంటో కానీ దిలీప్ గారూ, మీ కవితలు/భావాలు చదివితే, కాసేపు అలా స్తబ్దుగా ఉంటే తప్ప వెంటనే మామూలు లోకంలోకి రావటం కష్టం అండీ.

కొన్ని కొన్ని లైన్లు ఎంత గాఢంగా ఉంటాయంటే అవి చదివిన తర్వాత కాసేపటివరకు మౌనంతో స్నేహం చేస్తాను.

చాలా బాగా రాశారు. :)

Unknown said...

wow deepu chala bavundi.ela rayagalugutunarandi babu ila.ok any way congrats and all the best

ఏకాంతపు దిలీప్ said...

@ పద్మ గారు
చాలా రోజుల తరవాత! ఎలా ఉన్నారు?

చాలా ఏళ్ళుగా ఏదో ఎవరూ లేని ద్వీపంలో చిక్కుకుపోయి తన ఆలోచనలని సంకేతాల రూపంలో పంపిస్తుంటే, ఆ సంకేతాలని ఎవరో యధాతధంగా అర్ధం చేసుకుని తిరిగి స్పందన సంకేతాలు నాకు పంపిస్తే ఎంత సంబరపడిపోతానో మీ కామెంట్ చదివినప్పుడు అలా ఉంది నాకు....

you made my day! and my writings too...

Praveena said...

Dileep it's too good as always.Keep going.

పద్మ said...

నా కామెంట్ కన్నా మీ రిప్లై బావుంది. :)

నేను బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? ఈ మధ్య ఆఫీసులో రక్తం ధారపోసే కార్యక్రమంలో బోల్డు బిజీలెండి. :)

ఏకాంతపు దిలీప్ said...

పద్మ గారు,
నేను బాగున్నాను... ఏమీ కాదండి నాకు మీ వ్యాఖ్యే బాగుంది :-) అయితే పని పురుగు అయిపోయారన్నమాట... అయినా ఏకబికిన నాలుగు నెలలు అంత బిజీ బిజీగా ఉంచే ఆ కంపెనీ ఏంటండి...? ఈసారి హెచ్ ఆర్ రాంకుల సర్వే లో తీర్పు నిద్దాము...

saisahithi said...

ప్రేమైక స్పర్శతో పండిన ఆమె చేతి ఎరుపుని చూసి
చిన్న బోయింది తోటలోని గోరింటాకు!
ఎంత మధుర భావన.మనోద్వేగాల్ని రంజింపచేసిన ప్రకృతి ఎంత చిన్న బోయింది!
చాలా బాగుంది.

ఆనంద ధార said...

మీ ప్రేమ గోరింటాకు చూడ ముచ్చటగా వుందండి..మధురాతి మధురంగా హృదయ లోతుల నుంచి రాసిన మీకు మనః పూర్వక అభినందనలు .

Swathi said...

ఆన్నయ్య
మన్స్సులొని బావాలకు కార్యరూపం నీ కవితలు,
అందరి ల గ నాకు పెద్ద పదాలు తెలియవు కాని ఒకతి మాత్రం నిజం
కవితలు చదివాక కొంత సమయం వరకు బయత ప్రపంచం లొకి రాలెకపొతున్నాను
పదలు లెవు న దగ్గర నిన్ను అభినందిచాలంతె

స్వాతి

Anonymous said...

ఏంటి ఇన్నాళ్ళా బ్రేక్? అంతా క్షేమమా?

నేస్తం said...

చాలా బాగా రాశారు. :)

శ్రుతి said...

దీపు!
ఈ రోజే మీ వ్యాఖ్యానం చూసాను. మీ బ్లాగ్ చూస్తే ఇక్కడే నిలబెట్టి మట్లాడేస్తున్నారు. మీ అక్షరలు కదలనివ్వడం లేదు సుమా! అద్భుతంగా ఉన్నాయి మీ భావాలు.

యోగి said...

"వెచ్చదనం మౌనాన్ని కరిగిస్తూ ఉంది...
"

:)

మంచిబాలుడు-మేడిన్ ఇన్ వైజాగ్. said...

baga rasaru...super

kiraN said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు :)



- కిరణ్
ఐతే OK