ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Wednesday, July 29, 2009

నీ సమక్షంలో... {గీతాంజలి ~ 5}



నీ పక్కన కూర్చునే క్షణ కాలపు భోగం కోసం నేనడుగుతున్నాను. నా చేతిలో ఉన్న పనులన్నీ తరువాత పూర్తి చేస్తాను.

నీ మోముకి కనుచాటుగా నా హృదయానికి అలుపు లేదు తెరపి లేదు, నా పని అంతులేని ప్రయాస అవుతుంది ఒడ్డేలేని సాగరంలో చిక్కుకున్నట్టు

ఈరోజు వేసంగి నా తలుపు తట్టింది తన కువకువలు కిలకిలలతో; తుమ్మెదలు తమ గాధలని తెరపి లేకుండా గానం చేస్తున్నాయి పూతోట కొలువులో

నాలో ఊరట వెల్లివిరుస్తున్న ఈ మౌన సమయాన, నీ ఎదుట ప్రశాంతంగా కూర్చుని నా జీవన సంకల్పాన్ని గానం చేస్తాను.




I ask for a moment's indulgence to sit by thy side. The works that I have in hand I will finish afterwards.

Away from the sight of thy face my heart knows no rest nor respite, and my work becomes an endless toil in a shoreless sea of toil.

Today the summer has come at my window with its sighs and murmurs; and the bees are plying their minstrelsy at the court of the flowering grove.

Now it is time to sit quite, face to face with thee, and to sing dedication of live in this silent and overflowing leisure.

2 comments:

చావాకిరణ్ said...

బాగుంది.

Rajasekharuni Vijay Sharma said...

మీ కవిత చాలా బాగుంది. మీ పరిచయం మరింత బాగుంది. మీ భాషాభిమానం, సంస్కృతీ సాంప్రదాయాలపై మీకున్న గౌరవం అభినందించదగినవి.