ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Tuesday, November 2, 2010

ఆరాటాల పోరాటాలు

ఎడారి దాటి అలసిన నాకు సముద్రమే ఎదురైందిఅలలా కవ్విస్తూ నను తాకావు నీవునేను ఆరాటపడ్డాను
నీ మనసు తెలుసుకోవాలని
నీతో మనసు విప్పి మాట్లాడాలనుకున్నాను
నీ మనసులో చోటు సంపాదించాలని
నా ఆరాటాన్ని ఆరాధించావు
నువ్వూ నా కోసం ఆరాటపడ్డావు


నీ మనసు విప్పే ప్రయత్నం చేస్తావు
ఆశగా అమాంతం లోనికి చొరబడాలని చూస్తాను
లోన ఇంకెవరో ఉంటారు
వాకిట నుండే వెనుదిరుగుతాను
నే వెళ్ళిపోతుంటే నను ప్రేమగా చూస్తావు
నాకు తెలుసు నువ్వు నన్ను అలా చూస్తావని
అందుకే వీడ్కోలు చెప్పకుండానే వెళ్ళిపోతాను
కన్నీళ్ళకి సిగ్గూ లేదు, ధైర్యమూ లేదుఎప్పుడు ఆరుతుందో ఈ ఆరాటం
ఎందుకు పుడుతుందో తీరం వదిలే ఆ కెరటం?

8 comments:

Paddu said...

సముద్రం అంత లోతు ఉంది దిలీప్ ఈ కవిత..అందుకే వాటిని ఇలా కూడా చెప్పుకోవచ్చేమో...ఆదీ అంతూ లేని ఆరాటాల పోరాటాలు !!

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగుందండి.

మోహన said...

కెవ్వ్వ్వ్వ్........ ఉంది. :)

>>కన్నీళ్ళకి సిగ్గూ లేదు, ధైర్యమూ లేదు
హమ్...

Neelima said...

ఎడారి దాటి అలసిన నాకు సముద్రమే ఎదురైందిఅలలా కవ్విస్తూ నను తాకావు నీవు.......!!!!

Awesome!!!

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

enta chakkani kavita! chadivi vadilESaanu. konni lines gurtocchaayi. podduna maLLi chadivaanu :) office-ki vastunTE ee lines manasunEmO chEstUnE undi. vyaakhya raayamani prErEpinchEstundi.

naaku baaga nacchina bhaavaalu ivi...
నా ఆరాటాన్ని ఆరాధించావు
నువ్వూ నా కోసం ఆరాటపడ్డావు
manasuni maraNaaniki daggaragaa teesekeLLi maLLI jeevita gaDDekkicchEdi idEnEmO!
..
..
కన్నీళ్ళకి సిగ్గూ లేదు, ధైర్యమూ లేదు!
..
ఎందుకు పుడుతుందో తీరం వదిలే ఆ కెరటం?

--- avinEni

Anonymous said...

"నే వెళ్ళిపోతుంటే నను ప్రేమగా చూస్తావు" chala chaala baagundhi Dileep garu..... idi mee writeup ki related kaadhu...kaani endhuko naalo vunna bhadha ni ikkada cheppukovalanipinchindi...Endhuku oke kutumbham lo vunna manushula mansullo raka rakaala bhavalu vuntaayi..okari bhavam kosam inkokari bhaavanni kappeyyalsivastundi...MaaTalatho veDhistaaru..naa aavedhana ardham chesukoru...intlo koduku maatalaki ichinantha importance..koothuru matalaki endhuku ivvaru? Ilantappude anipistundi..Abbai ga endhuku puttaledhu ani. :( Jeevitham meedha virakthi pudutundhi. Sorry if I made you feel bad. Thanks for your post..and keep up the same.

ఏకాంతపు దిలీప్ said...

అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనకి ఎదురయ్యే ప్రతీ ప్రశ్నకీ సమాధానం మనమే కనుక్కోవాల్సి వస్తుంది.సమాధానం కనుగోవడం వేరు. ఆ సమాధానంలో జీవించడం వేరు.

ప్రతీ ప్రశ్నా మార్పుని ఆహ్వానించలేదు. మార్పుని ఆహ్వానించే ప్రతీ ప్రశ్నకి మన కుటుంబం ఎలాంటి సమాధానం ఇస్తుందో ఎలా స్పందిస్తుందో మనం ఆలోచించాల్సిన అవసరం, భాధ్యత మన మీదే ఉంటుంది..

మన ఆలోచనలని ఎప్పటికప్పుడు వాళ్ళకి అర్ధమయ్యేట్టు చెప్పుకోవాలి. అలా పంచుకోకుండా ఒక్కసారిగా నేను ఇలా ఆలోచించి ఇలా చెయ్యాలనుకుంటున్నాను, చేసేసాను అని చెప్తే కుటుంబంలో అందరూ దాన్ని ఆహ్వానించలేకపోవచ్చు.
ఒక్కోసారి తరాల అంతరం వల్ల కావొచ్చు, ఒక్కోసారి మన కుటుంబం నమ్మే విలువలు వల్ల కావొచ్చు, పాటించే పద్ధతుల వల్ల కావొచ్చు...

ఏది ఏమైనా మన కోరికల, రాగద్వేషాలకి అతీతంగా మన కుటుంబాన్ని అంగీకరించి అర్ధం చేసుకోవాలి.
కుటుంబం అనే చిన్న చిన్న ఇంజిన్లు లేకపోతే ప్రపంచం ధృఢంగా నిలబడలేదు. అవే విచ్ఛిన్నమైతే మనుషులు ఒంటరులుగానే మిగిలిపోతారు, ఎవరూ ఎవరికీ ఏమీ కాని మనుషులుగానే మిగిలిపోతారు.

ఒక్కోసారి కష్టంగా అనిపించొచ్చు.. కానీ అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుని మనం చేసే పనుల వల్ల మనం అనుభవించే వాటికన్నా,
ఆలోచించి మనకి సంభంధించినవాళ్ళకి అర్ధమయ్యేట్టు చెప్పుకుని ఆచరించే పనుల్లోనే కష్టం తక్కువ..

ఒక్కోసారి ఆ నిముషంలో ఎందుకు అలా ఉంటున్నారో, ఎందుకు అలా జరుగుతుందో అర్ధం కాదు. తీవ్రత తగ్గిన తరవాత, కొంత కాలం తరవాత ప్రతీదీ తేటతెల్లమవుతుంది...

మన జీవితం మన నిర్ణయాల, ఎంపికల ఫలం.
అలా అయినప్పుడు రేపు ఎలా ఉంటుందో మనకి తెలియదు, ఎందుకంటే రేపు ఏమి నిర్ణయిస్తామో, ఏమి ఎంపిక చేసుకుంటామో చాలా వరకు మనకి తెలియదు కాబట్టి.భవిష్యత్తు గురించి ఎక్కువ ఆందోళణ అర్ధం లేదనిపిస్తుంది.

పైదంతా రాయాలనిపించింది... మీరు ఇక్కడ వ్యక్తీకరించడం నాకు సంతృప్తిని ఇచ్చింది. ఏ సందర్భంలోనైనా వ్యక్తీకరణ మనకి తప్పకుండా ఉపశమనాన్ని కలిగిస్తుంది.

Anonymous said...

Dude the new background is causing strain to my eyes,text isn't clearly visible,plz do something....