ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Wednesday, November 10, 2010

ఆలోచనలు

ఒకో క్షణం,
నన్ను ప్రశ్నిస్తాయి
నా అసహాయతని నిలదీస్తాయి
ఈ విశాల ప్రపంచంలో,
నా అస్థిత్వాన్ని శోధించమంటాయి
నేనేంటో తెలియని నన్ను నిర్దాక్షిణ్యంగా ఒంటరిని చేస్తాయి

చంచలత్వంతో మోసం చేస్తాయి
నా నమ్మకాన్ని వెక్కిరిస్తాయి
వాటిని పంచుకున్న పదిమందిలో
నన్ను అల్పుడుని చేస్తాయి

అనుక్షణం వెంటాడుతూ
నాతో పోరాడతాయి
నే పోరాడలేనని ఎదిరిస్తే
నాకు దూరమై శిక్షిస్తాయి...

5 comments:

Neelima said...

intha bhayankaramina nijaalu bale raasaavu!!

sthottempudi said...

ఆలోచింపజేసే విషయాలు బహు బాగా వివరించారు
తరువాత కవిత లో మిమ్మల్ని ఉత్తేజ పరిచే వాటి గురించి వినాలనుంది !!!

krsna said...

avnu nijame. ento alochanalu. okkosari arthamkaavu.. ontarni chestaayi.. musurulaa kammukuntaayi. baavundi dileep

kiran said...

hmn..100% correct.. :)

పద్మ said...

నిజం. మనలో పుట్టి మనలో ఉండే ఆలోచనలైనా ఒక్కోసారి పరాయివాళ్ళ కన్నా ఎక్కువ వేధిస్తాయి. ఒక్కోసారి ఎంత మురిపిస్తాయో అంత ఏడిపిస్తాయి. అయినా, వాటిని విడిచి మనం బతకలేం. మనల్ని వదిలితే వాటికి అస్థిత్వం ఉండదు. ఎటువంటివి అయినా ఆ అలోచనలు కేవలం మన సొంతం. :)

రాత్రి, చీకటి గురించి రాసిన ఒక పాట గుర్తొస్తోంది.

అంధేరా పాగల్ హై, కిత్నా ఘనేరా హై
చుబ్తా హై డస్తా హై ఫిర్ భి వో మేరా హై