ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Thursday, November 18, 2010

ఆదర్శం- స్వార్ధం

నాకు తెలిసిన ప్రపంచం ఎప్పుడూ ఆదర్శాల కోసం జీవించడం లేదు... ఆదర్శాలు కూడా స్వార్ధంలో నుండి పుట్టుకొచ్చిన కోరికలే. మనకిష్టమైన వాటిని( అవి ఏవైనా) కుటుంబమో, సమాజమో, ప్రభుత్వమో ఏవో చెప్పి దూరం చేసే ప్రయత్నం చేసినప్పుడు ఒక ఆదర్శం పుట్టుకొస్తుంది... (లేకపోతే అప్పటివరకు పట్టించుకోని ఆదర్శాలని ఆశ్రయిస్తారు) అది ఒక్కోసారి వెంటనే అందరి అంగీకారం పొంది మార్పుకి దోహదం చేస్తుంది. ఒక్కోసారి వెంటనే అంగీకారం పొందదు. మార్పు మెల్లగా వస్తుంది.ఒక్కోసారి అలా కొందరి స్వార్ధంలో నుండి పుట్టిన కోరికలు అందరి అంగీకారం పొందవు, అవి అందరికీ ఆదర్శాల్లా కనిపించవు... ఒక్కోసారి కొన్ని ఏళ్ళ తరవాత అలా వచ్చిన మార్పు మంచికోసమొచ్చిందా, చేడూ కోసం వచ్చిందా అనే మీమాంశ కూడా జరుగుతుంది. చాలాసార్లు, ఆ ఆదర్శాలు వాళ్ళ కోరికలు తీరేవరకే, తీరిన తరవాత వాటితోనే జీవిస్తున్నారా లేదా అనేది అప్రస్తుతం అయిపోతుంది...



ఈలోగా ఆ ఆదర్శాలని అనుభవించిన తరానికి కొత్త కోరికలు పుట్టుకొస్తాయి... మరలా కొత్త ఆదర్శాలు, కొత్త ఆశయాలు...


అందుకే ఆదర్శానికి మూలాలు ఆ ఆదర్శాన్ని ప్రకటించే వారి స్వార్ధం లోనే ఉంటాయి. దాన్ని నిస్స్వార్ధంగా, దాని వల్ల తనకి ఉపయోగం లేకపోయినా, కేవలం ఆదర్శం కోసమే బతికే వాళ్ళు లక్షల్లో ఒకళ్ళు ఉంటారు...


ఎప్పుడైతే నేను అది తెలుసుకున్నానో, ఆదర్శాలని వెక్కిరించే వాళ్ళని అసహ్యించుకోవడం మానేసాను... ఎవరి స్వార్ధం వారిది అని మనసులో అనుకుని :-) ఎప్పుడో ఒకసారి వాళ్ళ స్వార్ధం కోసం ఆదర్శాన్ని ఆశ్రయిస్తారు, లేకపోతే స్వార్ధం కోసం ఆదర్శాన్ని వదిలేస్తారు...

ఆదర్శాలు నమ్మేవాళ్ళూ, నమ్మని వాళ్ళు ఒకరికొకరు హాని తలపెట్టుకోనంతవరకు నాకూ ఓకె.నేను పట్టించుకోను... నా స్వార్ధం నాది, నా ఆదర్శం నాది. వాళ్ళ స్వార్ధం వాళ్ళది, వాళ్ళ ఆదర్శాలు వాళ్ళవి...

7 comments:

మోహన said...

>>ఎప్పుడో ఒకసారి వాళ్ళ స్వార్ధం కోసం ఆదర్శాన్ని ఆశ్రయిస్తారు, లేకపోతే స్వార్ధం కోసం ఆదర్శాన్ని వదిలేస్తారు...
:)

>>ఆదర్శాలు నమ్మేవాళ్ళూ, నమ్మని వాళ్ళు ఒకరికొకరు హాని తలపెట్టుకోనంతవరకు నాకూ ఓకె.

హ్మ్...
తనతో పాటు పది మందికి ఉపయోగపడే కోరిక/పని ఆదర్శం అనీ...
తన కోరిక తీరెందుకు పక్క వాడు నష్టపోయినా పర్లేదు అనుకొవటం స్వార్థం అనీ..
ఇలా ఎవేవో లేబుల్స్.. తగిలించేస్తారు.

అసలు ఎందుకు బ్రతుకుతున్నా అన్న విషయం మర్చిపోతున్నారు మనుషులు. ఏం చేసినా సుఖం గా ఉండాలన్న కోరికే కదా మూలం?!

ఆ సుఖం కొంత మందికి ఏదైనా సాధించటం లో దొరకచ్చు కొంత మందికి ప్రేమ లో.. కొంతమందికి త్యాగం లో కొంత మందికి మరోదానిలో..

కానీ అన్నీ తాత్కాలికమే! నిజమైన సుఖం ప్రశాంతతలోనే కదా...!!

ఏం చెప్తాం... అన్నీ లీలలే కదా... :)

శివ చెరువు said...

స్వార్ధం.. ఆదర్శం రెండూ కోరికలే..

స్వార్ధం: తనకు లేక తన వారికి మాత్రమే

ఆదర్శం: నేను అని గీసున్న గీత కన్నా బయటకి వెళ్లి పనిచేసేది .. పనికొచ్చేది.. చిన్న పెద్ద .. పరిచయస్తులు పరిచయం లేని వాళ్ళు .. అనే తేడా దానికి తెలియదు.. ఆదర్శం అనేది Power full desire. "Its an achievement after great difficulties"

త్యాగం: దీనికి నేను కన్నా బయటవాల్లంటేనే ప్రేమ. ఇదీ కోరికే.. ఒక ఛాయిస్..

ఎవరి వారి "Personality" బట్టి వాళ్ళ ఎంపిక ఉంటుంది

Padmarpita said...

నేను శివచెరువుగారితో ఏకీభవిస్తున్నాను.

సీత said...

emitoi.. ee madhyana emi rayatledu? emayyadu neeloni bhaavukudu?

sneha said...

"ఆదర్శాలు నమ్మేవాళ్ళూ, నమ్మని వాళ్ళు ఒకరికొకరు హాని తలపెట్టుకోనంతవరకు నాకూ ఓకె."
బాగా చెప్పారు నా అభిప్రాయం కూడా అదే

MURALI said...

నిత్యం కొత్త ఆదర్శాలు పుట్టుకోచ్చే ఈ లోకంలో సమాజమెప్పుడూ ఆదర్శవంతంగా కనిపించదు.

ఏకాంతపు దిలీప్ said...

కదా మురళి.. ఒక్కోసారి అనిపిస్తూంది ఇలా వచ్చే మార్పు అవసరమా అని! కోర్కెలు తీర్చుకున్నాక వదిలేసే ఆదర్శం, కోరిక మోహంలో ఆ కోరికని తీర్చుకునే హడావుడిలో మిగిలినా విషయాలని పట్టించుకోకుండా .. అది తీరాక ఆదర్శం ఉండదు, పట్టించుకోని విషయాలు మళ్లీ మళ్ళి ఎదురయి ప్రశ్నిస్తుంటే ఏంటో ఆ జీవితాలు..!