ఏనాడు కనుగున్నానో నిను
చీకటిని అందంగా చూపే నీ వెలుగులో చుక్కలని తిరిగి లెక్కబెట్టాను
కవ్వించే నీ ఉనికితో నువ్వు పుట్టించిన ప్రశ్నలెన్ని!
ఆ ప్రశ్నల్లో సమాధానాలుగా నే జీవిస్తున్నపుడు ఎంత సంబరం!
గడిచే ప్రతీ క్షణం క్షణపు విలువని తిరగరాసింది
ఇది ఎందాకానో తెలియని నేను నిను అందుకోబోయాను
ఆకాశమంత దూరంగా నువ్వు..
నీ దగ్గరితనపు దూరం కనుగునే ప్రయత్నం నేనాపలేదు
నా నీడే నిను అలుముకుందో
మరి ఏ నీడ నిన్ను కమ్ముక్కుందో
నానాటికీ చిక్కిపోయావు
ఓ నాడు నా కన్నులకి చిక్కకుండాపోయావు
చిన్నబోయిన అవి నిన్ను వెతకడం మానేసాయి
వెలుగునే కనుగొనడం ఆపేసాయి
కాలం ఏ మాయ చేసిందో..
నా చూపుల దారిని మళ్ళించింది
ఇక నే ఎప్పటికీ కనుగోలేనేమొ అనుకున్న నువ్వు
అది నువ్వే - ఎన్నడూ చూడనంత నిండుగా!
పెల్లుబికే ప్రశ్నలు నీ సమాధానాల్లో జీవించమన్నాయి
ఈ క్షణపు విలువ ఎంత అంటూ,
నీ దూరం ఎంత దగ్గర అంటూ..
ఏదో తెలియని భావం కన్నుల్లో ముసురుకుంది
మసక మసకగా నువ్వు
చిత్రం 'విశాల ప్రపంచం' సౌజన్యంతో :)
9 comments:
భరువైన భావలే ఉన్నాయ్ కవిత మొత్తం...
"పెల్లుబికే ప్రశ్నలు నీ సమాధానాల్లో జీవించమన్నాయి"
సమాధానం ఉందో లేదో తెలియకుండా ఎన్నాళ్ళు జీవించగలవు పెల్లుబికే ప్రశ్నలతో?
"ఈ క్షణపు విలువ ఎంత అంటూ"
భవిష్యత్తులో రాబోయే క్షణాలు విలువైనవే అన్న నమ్మకం ఉన్నపుడు వర్తమానంలో కొన్ని క్షణాలను పోగొట్టుకున్నా నష్టం లేదు.
"నీ దూరం ఎంత దగ్గర అంటూ.."
తెలుసుకునే ప్రయత్నం చేశావా?
"ఏదో తెలియని భావం కన్నుల్లో ముసురుకుంది"
ఆ తెలియని భావాలతో ఎక్కువరోజులు గడపకు! భావం పరమార్థం తెలిశాక ఎన్ని యుగాలైనా పర్లేదు.
"మసక మసకగా నువ్వు"
ఆ మసక వెన్నెల, పూర్ణచంద్ర బింబమై నీ ముంగిట వాలాలి అన్న ఆశ నీకుంటే అలానే జరగాలని దీవిస్తున్నా...
బాగుంది.. :)
భాస్కర్ గారు ...మీ కామెంట్ ఇంకా బాగుంది. :) :))
@బావ అది చందమామ! ఆకాశం దాటి ఎలా వస్తుంది? అయినా మనం "చందమామ రావే జాబిల్లి రావే" అని పాడుకోవడం మానము!
@ కిరణ్ :-)
>>మసక మసకగా నువ్వు
మసక తనలోనా..? మీ చూపులోనా? :)
అంత ఆర్ధ్రంగా ఎదురుచూసిన వారు కళ్ళెదుట పడితే కలిగే మసకే కదా అది? అదే అయ్యుంటుంది. :)
me kavita chala bavundi.
http:/kallurisailabala.blogspot.com
О___О
http://news-andrej.blogspot.com/
NEWS
http://news-andrej.blogspot.com/
NEWS
Post a Comment