గది ఐమూలన కిటికీ వెనక చందమామ ఎదుగుతుంది
పడక మీద కంబళి చాటున దేహం ముడుచుకుపోతుంది
మొహమంతా వెన్నెల పరుచుకుంటుంది
ఏదో తెలియని శక్తి లోలో యుగాల నిర్లిప్తతని బుజ్జగించి నను బయటకు లాగింది
బయటేమో రెపరెపల గాలి..
నిలువలేక నిదుర రాక పడక మీద అటు ఇటు అవుతూ నేనుపడక మీద కంబళి చాటున దేహం ముడుచుకుపోతుంది
మొహమంతా వెన్నెల పరుచుకుంటుంది
ఏదో తెలియని శక్తి లోలో యుగాల నిర్లిప్తతని బుజ్జగించి నను బయటకు లాగింది
బయటేమో రెపరెపల గాలి..
రెప్పలని విప్పారనీయడం లేదు
అది మోసుకొస్తున్న చలి నిలువనీయడం లేదు
చూపులకీ చందమామ చిక్కడం లేదు వెన్నెల కన్నులలో వెలిగిపోతుంది
మనసేమో ఏదో ఆనవాల జాడని శోధిస్తుంది
వెన్నెల ఆచూకి ఈనాటిదా...
పొలం నుండి వస్తూ పందెమాడిన చందమామ
చిరుగాలికి కొబ్బరాకులు చీరేసిన చందమామ
చింతల చీకట్లో దారి చూపిన వెలుగుల చందమామ మనసేమో ఏదో ఆనవాల జాడని శోధిస్తుంది
వెన్నెల ఆచూకి ఈనాటిదా...
పొలం నుండి వస్తూ పందెమాడిన చందమామ
చిరుగాలికి కొబ్బరాకులు చీరేసిన చందమామ
భయాలను భ్రమింప చేసిన వేపాకు చుక్కల చందమామ
వెన్నెల స్నానాల్లో అలల మీద నలిగిపోయిన చందమామ
అరచేత పండిన చందమామ
ఏకాంతంలో తోడైన చందమామ
ఆటుపోట్ల అలజడితో ఎండమావులు చూపించిన చందమామ
వెన్నెలే వెలివేసిన ఒంటరి చందమామ
పున్నమే నిందించిన పున్నమి చందమామ
ఎన్నో కథలు విన్న చందమామ
అబ్బురాల అంతరిక్ష చందమామ
వెన్నెల స్నానాల్లో అలల మీద నలిగిపోయిన చందమామ
అరచేత పండిన చందమామ
ఏకాంతంలో తోడైన చందమామ
ఆటుపోట్ల అలజడితో ఎండమావులు చూపించిన చందమామ
వెన్నెలే వెలివేసిన ఒంటరి చందమామ
పున్నమే నిందించిన పున్నమి చందమామ
ఎన్నో కథలు విన్న చందమామ
అబ్బురాల అంతరిక్ష చందమామ
జాడ తెలియని వేళల్లో ఆ ఆనవాళ్ళే ఆసరా అవుతాయి
వచ్చిపోయే పున్నములయినా అవి పంచే వెన్నెల
వెంటే నిలిచే నీడలవుతాయి
చిత్రం 'విశాల ప్రపంచం' సౌజన్యంతో
10 comments:
చాలారోజులకి ఏకాంతం పరదా తొలగించుకుని, వెన్నెల నీడలలో జ్ఞాపకాల విందుని ఇస్తున్నందుకు పరవశంతో...పద్మం :)
వెన్నెల ఆచూకి ఈనాటిదా...
extordinary tempo maintained after the above lines
wonderful poem
మీరు చూపించిన వెన్నెల నీడల జాడలు చాలా అందంగా ఉన్నాయి.. :)
జాడ తెలియని వేళల్లో ఆ ఆనవాళ్ళే ఆసరా అవుతాయి
Excellent line.
@ పద్మం, మధురవాణి
:)మొత్తానికి వెన్నెల నీడల్లో తలదాచుకుంటున్నాను! :)
@ బాబా గారు
థాంక్స్ అండి. Your comment is special to me as special as your comment on పున్నమి రాత్రి చిమ్మ చీకటి రాజ్యమేలింది
@తులసీమోహన్ గారు
థాంక్యూ :)
పదజాలం చాల బాగుంది ! ఐ విల్ షేర్ థిస్ బ్లాగ్ ఆన్ మై ఫేసు బుక్ ! కృతజ్ఞతలు రచయిత గారికి
2008 లో బ్లాగుల్లోని టపాలతో చేసిన చిన్న ప్రయత్నం
ఈ రొజు ఏదో వెదుకుతుంటే మళ్ళీ కంటపడింది
వీలుంటే మీరూ చూడండి
http://files.koodali.org/johnhyde/amma.pdf
జాన్ హైడ్ కనుమూరి
john000in@gmail.com
జాడ తెలియని వేళల్లో ఆ ఆనవాళ్ళే ఆసరా అవుతాయి
superb...
"జాడతెలియనివేళల్లో ఆనవాళ్ళే ఆసరా" అన్న మాట చాలా లోతైన భావనతో కూడి ఉంది. నిరాశా నిర్వేదంలో కూరుకుపోయినప్పడు, మనల్ని మనం తిరిగి ఆవిష్కరించుకోడానికి కావలసిన ఆశావహ దృక్పధాన్ని చెబుతోంది. అలాలేకపోతే ఈ అనుభూతులకి అర్థం ఉండదు... ముఖ్యంగా కవులకు. మనః పూర్వక అభినందనలు
Post a Comment