ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...
వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...
Saturday, October 27, 2007
మైమరపు
ఇప్పటి వరకూ వాన...
ఇప్పుడే మేడ మీదకి వచ్చాను...
గంట క్రితం ఒళ్ళంతా మేఘాల ముసుగేసుకున్నట్టున్న ఆకాశం,
ఇప్పుడు కోటి కళ్ళతో ఒంటి నిండా వెన్నెల పూసుకుని నగ్నంగా నా కోసం ఎదురుచూస్తున్నట్టుంది...
ఇది చూసి తేరుకుని మళ్ళీ ఆకాశం వైపు చూస్తే..,
చంద్రుడు నాకేమీ తెలియదు,నేనేమీ చూడలేదు అన్నట్టు కొబ్బరాకుల చాటున దాక్కుంటున్నాడు...
నా నుండి ఎంత దాగినా అద్దంలాంటి తడిచిన నేలకి దొరికిపోయాడు...
వీచే చల్ల గాలి తాకీ తాకనట్టు నా చూపుని మరల్చడానికా అన్నట్టు కొంటెగా నన్ను అల్లరి చేస్తుంది...
గూటికి చేరే పక్షులు నా చూపుల దారికి అడ్డంగా వెళ్తూ ఇక చూసింది చాలు అన్నట్టు నన్ను ఆట పట్టిస్తున్నాయి...
ఇంతకీ నేను ఏంచూసాను..?
దేనికీ ఈ మైమరపు?!!!
మూడేళ్ళుగా ఆహ్లాదకరమైన ఇలాంటి ప్రకృతికి దూరంగా ఉన్నాను...
కానీ ఈ మైమరపు నన్ను వెంటాడుతూనే ఉంది...
Subscribe to:
Post Comments (Atom)
14 comments:
ఎందుకండీ ఇలా నాతో ఆడుకుంటున్నారు.ఇవన్నీ గుర్తు చేసి నన్ను ఏడిపించడమే మీ లక్ష్యమా?ఎవరిచ్చారు మీకీ అధికారం?
అన్నట్టు చెప్పడం మరిచాను.మీ బ్లాగుని కూడలికి చేర్చారా? http://koodali.org/add
@రాధిక గారు
ఇప్పుడే చూసాను మీ కామెంట్... మరి మీరు నన్ను ఎన్నిసార్లు ఏడ్పించలేదు?!! :)
తెలుగింటి ఘుమఘుమలని ఆఘ్రాణించినప్పుడు ఆహా! అని రుచి చుడాలనుకోవడాన్ని,
వసంతాల రాకకి కోకిల గానం చేయడాన్ని,
వానని చూసి మయూరి నాట్యం చేయడాన్ని,
మీలో భావావేశం పొంగి పొర్లుతున్నపుడూ స్పందించడాన్ని ఎవరూ ఆపలేరు...
ఇవన్నీ జరుగుతున్నపుడు, నాలాంటి వాళ్ళు అనుకుంటారు ఎవరిచ్చారు వీళ్ళకి ఇలా చెయ్యడానికి ఈ అధికారం అని?
స్పందించ గలిగేవాళ్ళు, అధికారాన్ని తీసుకుంటారు కదా..?!
చూస్తూనే ఉన్నా
@రాజేంద్ర గారు
ఏం చూస్తున్నారండి? :)
నేను ఇక్కడ ఎందుకు కామెంటు రాశానబ్బా?ఏమో కవితలు బాగున్నట్లున్నాయి ,ఇంకోసారి మొత్తం చదివి చూస్తాను
కోటి కళ్ళ నక్షత్రాలను ఆకాసం ధరించింది.
అద్దంలాంటి తడిచిన నేల లో చంద్ర ప్రతిబింబం.
కొబ్బరాకులు, పక్షిగుంపులూ ఏడిపిస్తున్నాయి.
అంతా బాగానే ఉంది.
ఇంతకూ మనలో మన మాట " ఏం చూసారూ?"
బొల్లోజు బాబా
తెలివిగా చాలా మర్మాలు దాచేసి, భావుకత్వం ముసుగేసుకుని కవిత కానిచ్చేస్తావా...? నేనస్సలొప్పుకోను.పూర్తిగా విడమర్చి చెప్పాల్సిందే!
చాలా బాగుంది. "అడగక ఇచ్చిన మనసే ముద్దూ, అందీ అందని అందమె ముద్దూ" అన్నట్లు, బాగుంది.
అవును చెప్పాల్సిందే.. అదే మా డిమాండ్!! నా వోట్ మహేశ్ గారికే!! ;-)
@బాబా గారు
నెనర్లు :-) అది నా బ్లాగుని అర్ధం చేసుకున్న కొద్దిమందిలో ఒకరైన మీ ఊహా శక్తికి వదిలేస్తున్నాను... ;-)
@ మహేష్ గారు
మర్మాలున్నాయి అని మీకు అర్ధమయినప్పుడు, అవి వివరించేస్తే మర్మాలెందుకు అవుతాయి?!! మీ సరదా స్పందనకి నవ్వుతూ నెనర్లు :-)
@పూర్ణిమ
ఇది భావస్వామ్యం. ఇక్కడ స్పందించడాలే కానీ నిలదీయడాలు ఉండవు
;-)
ఒప్పుకున్నా.. స్పందించాలని.
:-) అని రాస్తే నేను నవ్వుతున్నాను అని అర్ధం కదా.. ఇలా నా మనసు నవ్వితే.. ఆ స్పందనెలా రాయాలి?? చెప్తే .. మా డిమాండ్ న్ని వెనక్కి తీసుకుంటా!!
నాకర్ధమయిందేమిటంటే ఆ ప్రకృతిలో మీ మనసుని మీరు చూసుకున్నారు.ఆ నిమిషంలో మీ భావుకతని తెలుసుకున్నారు.అందుకే ఆమైమరపు.
@ పూర్ణిమ
మనసు భాష తెలియాలంటే మనసుతోనే మాట్లాడాలి ;-)
@ రాధికా గారు
:-) దాదాపూ అలానే.. నా మనసు కొణ్ణాళ్ళుగా దేనికోసమైతే పరితపిస్తుందో అది చూసాను. నాకు నేను తిరిగి పరిచయమయ్యాను. ఆ ఆనందంలో మైమరచి భావావేశానికి గురయ్యాను.
Post a Comment