ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Sunday, November 18, 2007

నేను నా ఊరు వెళ్తున్నాను...


గోరు ముద్దలు తిన్న
చిన్న 'అంచు పళ్ళెం',
అమ్మమ్మ పక్కలో ఆరు బయట
పడుకున్న నులక మంచం,
ఇప్పటికి మూడు తరాలని
ఊపిన ఉయ్యాల,
పెరటి చివరన ఊరి కాలవ ఒడ్డున
తుమ్మ చెట్లకి వేలాడే పిచ్చుక గుళ్ళు,
ఆ చెట్లపై అటు ఇటుతిరిగే గుఱ్ఱాలు,
ఓనమాలు దిద్దిన శివాలయపుగుడి అరుగులు,
బస్ స్తాండ్ ఎదురి రామాలయం,

నా కోసం ఎదురుచూస్తుంటే..,
దీపావళికి నేను నా ఊరు వెళ్తున్నాను...

9 comments:

శీను said...

wow.......
nice memories........

keep writing..

రాధిక said...

ఊరెళ్ళి వచ్చేసారా?నేస్తాలందరూ ఎలా వున్నారు?కొన్నాళ్ళుగా తీరిక లేకుండా వున్నాను.మీ కవిత చదివాకా తీరిక చేసుకోవాల్సి వస్తుంది ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకోడానికి.చాలా థాంక్స్.

Ki2 said...

Devidi roopamla unde aa prakruthi and baavanni poosa guchinattuga alarimpachesiti nee vakyalu mrudhuvuga thaakuthunnatuga undi!

ఏకాంతపు దిలీప్ said...

ఊరి నుండి వచ్చేసానండి. బస్ లో వెళ్తుంటే ఆ జ్ఞాపకాలు ఆలోచనల పైపొరల్లోకి వచ్చాయి. వాటినే అలా రాసాను. అందరు కుశలమే. ఈసారి నా చిన్ననాటి స్నేహం శేఖర్ని కలవగలిగాను. వాడికి ఉద్యోగం వచ్చిందని తెలుసుకుని చాలా సంతోషం కలిగింది...
మీ రాక కోసం నా బ్లాగ్ ఎదురుచూస్తుంది... తీరిక చేసుకుని పోస్ట్ చేసినందుకు చాలా థాంక్స్ అండి.నాకు చాలా ఆనందంగా ఉంది..

Anonymous said...

Dilip!
Naaku peotic ga raayatam raadu kaani nee kavitha dwara nenu kooda mana ooru vellagaligaanu. okkasariga oorilo pradesalanni kallamundu kadilaayi.
chaala baaga raasavu.
you are gifted.
God Bless You!!!

Purnima said...

ఇది నేను చదివిన మీ మొదటి కవిత. మీరు రాసిన రెండు రోజులకే చదివాను. కానీ అప్పుడు బ్లాగు కాదు కదా.. కనీసం కమ్మెంట్ రాయడం కూడా రాదు తెలుగులో.. అందుకే ఏమి చెప్పలేదు అప్పుడు.

ఇప్పుడెందుకో కొత్తగా చెప్పాలనుంది. :-)

Anonymous said...

baagunDi .... :-)

Sudha said...

mee blog chala bagundandi....enduko manasu baleka... mee bolg lo adugu pettanu....enta relaxed ga unnano ippudu....

Thanks
Sudha

ఏకాంతపు దిలీప్ said...

You made my day Sudha! Thank you! Have good time...