ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...
వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...
Tuesday, April 15, 2008
ఎప్పటిదాకా ఈ పరుగు?
మనసు అను క్షణం నీ కోసం పరుగులు తీస్తుంది
అలసట తెలియకూడదని కబుర్లు చెప్తూ నేనూ దానితో...
.
.
మెరిసీ మెరిసి అలసిన సూరీణ్ని పడమర తన లోయలో దాచుకొంటోంది
నిత్యం పరుగులు తీసే గోదారికీ సంద్రం చేతులు చాస్తుంది
చీకట్లో మగ్గే నింగికీ జాబిల్లి జాబునిస్తుంది
మరి నా నిరీక్షణ ఎప్పుడు ఫలిస్తుంది...?
నీ సంగమంలో ఈ పరుగు ఎప్పుడు నిలుస్తుంది...?
ఆ క్షణాలిచ్చే మధురానుభూతితో
నడవగలను జీవితాంతం నీతో
నేనిక పరుగెట్టలేను...
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
బాగుంది దీపుగారూ.
దీనంతటికీ నాకొక పరిష్కారం కనిపిస్తుమంది.పెళ్ళి చేసేసుకోండి:)
అప్పుడే అలిసిపోతే ఎలా! కోరుకున్న తోడు దొరికేవరకూ ఆగకుండా పరిగెట్టాలి.. తప్పదు :))
@రాధిక గారు, నిషీ గారు
అయితే నాకొక తోడుని వెతికి పెట్టండి... :-)
Post a Comment