ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Tuesday, May 20, 2008

నింగీ నేలా కలిసేనా..?




చిరుగాలల్లే వస్తావు
స్నేహ మాధుర్యాన్ని రుచి చూపిస్తావు
పెనుగాలై పోతావు
నాలో అలజడినే రేకిత్తిస్తావు
వానల్లే వస్తావు
మోడైన నాలో చిగురాశలొలికిస్తావు
ఉప్పెనై పోతావు
నాలో వరదై పోటెక్కిస్తావు
వెలుగల్లే వస్తావు
నాలో రంగుల్నే నింపుతావు
పగలల్లే వస్తావు
నీ వైపు నడిపిస్తావు
ఇంతలో... చీకట్లో వదిలేస్తావు!
కవ్వించే నా చెలీ!
నా సహనానికి ఈ చెట్టు, ఆ పిట్ట, ఈ గట్టు, ఆ గోదారే సాక్ష్యం!
నేను నిన్ను కలిసేనా?!


ఇది పృధ్వి గారి చిత్రానికి రాసింది... ఆయన మది దోచుకుంది అన్నారు!
ఇక్కడ పృధ్వి గారి చిత్రానికి వచ్చిన స్పందనలు చూడొచ్చు...
http://pruthviart.blogspot.com/2008/04/blog-post_30.html

11 comments:

Anonymous said...

hmm bagundi :)

ఏకాంతపు దిలీప్ said...

థాంక్స్ బిందు :-)

Anonymous said...

చాలా బాగా వ్రాశారు

ఏకాంతపు దిలీప్ said...

థాంక్స్ అండి కీర్తి గారు...

Bolloju Baba said...

చాలా బాగుంది.

బొల్లోజు బాబా

Anonymous said...

ఆ ప్రుధ్వికి చెలి నింగి.....చాల బగుంది నీ అనునయం....
Can you try seeing it in any other angle ....

Anonymous said...

చాలా బాగుంది కవిత్వం. ఇలాంటివి ఇంకా అందించాలని కోరుకుంటున్నాము.

ఏకాంతపు దిలీప్ said...

@ నీలిమ
నెనర్లు.. కొంచెం సాయం చేస్తే చూడగలను :-) నువ్వు ఏ కోణంలో చూస్తున్నావు?

ఏకాంతపు దిలీప్ said...

@నువ్వుశెట్టి బ్రదర్స్
చాలా థాంక్స్ అండి... మీ బ్లాగుని నేను కనుక్కోలేకపోయాను... మీ బ్లాగు లంకె ఇస్తారా నాకు?

saisahithi said...

చాలా బాగుంది.
పృధ్వి గారు రంగులతో ప్రకృతిని చిత్రించగా మీరు ఆ ప్రకృతిని పదాలతో వర్ణించారు.

Cartheek said...

దిలీప్ గారు నెను మొదటి సారి మీ బ్లొగ్ కి వచ్చాను
మీ కవితలు చదువుతుంటె ఎదొ తెలియని ఆనందం అండి.

అన్ని కవితలు చాల బాగున్నయ్

keep it up.