ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Monday, July 28, 2008

సాగే స్రవంతి...

పార్క్లో ఫ్లెడ్ లైట్లకి, అలవాటు పడిపోయాను
ఇప్పుడు ప్రతీ రేయీ పగలే
వెన్నెల ఒక గతం. దాని అవసరమూ లేదు

నేను నడుస్తున్నాను-నా ముందు నా నీడ.

ఎదురుగా ఒక తాత
అడుగులో అడుగేసుకుంటూ, బాధ్యతలు తీరినా
ఆ భుజాలు ఇంకా ఏదో బరువు మోస్తున్నట్టు నడుస్తున్నాడు

ఇంతటి వెలుగులోనూ అతని కళ్ళు మెరవడం లేదు
మా చూపులు కలిసాయి..
నీళ్ళు లేని బావిలా నా చూపుని చీకట్లో కలిపేస్తున్నట్టు
ఆతని కళ్ళు నన్ను లోతెంతో తెలియని ఏవో ప్రశ్నలు సంధిస్తున్నట్లున్నాయి..
మా చూపులు విడిపోయాయి...

ఈ వెలుగులో పురుగులు కూడా పెరిగాయి.
చిందర వందరగ గాల్లో నాకు అడ్డంపడుతున్నాయి
వీటికీ అలవాటు పడుతున్నాను.

ఇంతకీ ఆ ప్రశ్నలు -
నాకా?
నా తరానికా?

నేను నడుస్తూనే ఉన్నాను...

ఈ ఫ్లెడ్ లైట్లకి అలవాటు పడిపోయాను
వెన్నెల ఒక గతం. దాని అవసరమూ లేదు..

కానీ కరెంట్ పోతేనో?!

29 comments:

రాధిక said...

చాలా మెస్సేజ్ ని0పారుగా కవితలో.చాలా బాగు0ద0డి.
అవును వెలుగు వెనకకు పెట్టుకుని నీడ ని గమ్యమనుకుని సాగిపోతున్నాము.. కర0టుపోతే ఏము0ది...అ0ధకారమే.భరి0చలేని అ0ధకార0.ఆ పెద్దాయన ప్రశ్నలు ఖశ్ఛిత0గా మన తరానికే.

Anonymous said...

కరంటు అపుడప్పుడు మాత్రమే పోతుంది కదా. కాని వెన్నెల నెలలో ఇరవై రోజుల పైనే ఉండదు కదా?

ఇది కేవలం సరదాకి మాత్రమే..సీరియస్ గా తీస్కోకండి.
ఊరికే రాసానండి. కూడలి లోకి వెళ్ళి చూస్తే క్రొత్తవి ఇంట్రస్టింగ్ వి ఏవీ కనిపించలేదు. మీ కవిత భావం అర్ధమయ్యింది నాకు(కాగితప్పూలకి, నిజం పూలకి ఉన్నా తేడా.). ఊరికే ఊసుపోక tease చెయ్యమనడమన్నమాట).

ప్రతాప్ said...

దిలీప్ బాగా రాశారు.
నేటి తరానికి నిన్నటి తరం సంధించే ప్రశ్నల శరాలకు రేపటితరం ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతుంది. అప్పుడు మనం నిన్నటి తరంగా మిగిలి, రేపటి తరంతో నేటి తరం ప్రశ్నలు మళ్లీ సంధించడం మొదలు పెడుతాం.

MURALI said...

నిజానికి మనతరం కరెంటు మీదే బ్రతుకుతుంది. కరెంటు పోతే ఇక మనం కరెంటుని సృష్టించలేకపోతే అసలు మన జీవితమే లేదేమో?

Srikanth said...

చాలా బాగా రాసారండి
కరెంటుపోతే్ ???
అప్పుడైనా మనకి వెన్నెల గుర్తుకువస్తే చాలు
ఇంకో కృత్రిమ వెలుగు కోసం వెతకుండా

Purnima said...

@independent:
సరదాకి అడిగినా ప్రశ్న బాగుంది. కాస్త సీరియస్స్నెస్స్ ఉండుంటే.. ఇంకో కవిత కాకపోయినా.. వివరిస్తూ కనీసం ఒక వ్యాఖ్యైనా వచ్చుండేది కదా? ;-)

దిలీప్:
ఇక మీకోసం నా ప్రశ్నలు
నీళ్ళు లేని బావిలా నా చూపుని... నీళ్ళెందుకు లేవు?? మీ తరం వాళ్ళు చూసినా నీళ్ళుండవా?? లేక మీ తరం వాళ్ళు అంత లోతుగా చూడడం లేదనా?? (ప్రయోగం మాత్రం సూపర్)

అసలు వెన్నెలా, ఈ విద్యుద్దీపాలు... రెండూ.. external (తెలుగులో??) కదా?? వాటి మీద ఆధారపడడం సబబా?

ఇండిపెండెంట్ గారు అల్రెడీ చెప్పేసిన ఉపమానం (కాగితపు- అసలు పూలు) దృష్టినుండి కాక (అలా అయితే కవితలో చెప్పాల్సింది చెప్పేసారు) .. internal and external sources of light.. నుండి అయితే బాగుంటుంది తరాల అంతరాలు గురించి. ప్రయత్నించగలరా??

అర్ధం కాకపోతే సింపుల్.. లైట్ తీసుకోండి!!

భావకుడన్ said...

independent గారు సరదాగా అన్నా మాట నాకు నిజంగా అనిపించిందండి మీ కవిత చదివితే.

దిలీప్ గారు, మన తరం కొంచం ఎక్కువ పాలే guilty feelings లోనవుతున్నారు అని నా అభిప్రాయం.

నిన్నటి ఆది మానవుని ప్రశ్నించగాలమా
నిప్పును ఎందుకు పుట్టించావని ?

మొన్నటి దేవుని ప్రశ్నించగలమా
మనిషి పుట్టుక ఎందుకని?

నిన్న మొన్నటి జ్ఞాపకాలను
మదినిండా పదిల పరుచుకో నేస్తం

అంతే కాని పునశ్చరణలనూ (reminiscences)
మారుతున్న కాలానికి అలవాటు పడని మనసునూ
ఆధారంగా చేసుకొని అపరాధ భావన రానీకు.

మార్పే కదా అసలైన ప్రకృతి తీరు
లేదెపుడూ కాలానికి స్థిరమైన రూపు.


మీ లోని ఈ భావన మీ nostalgia based తప్ప మరోటి కాదు. nostalgia ను ఆస్వాదించండి అంతే కాని అపరాధ భావనకు తావు ఇవ్వకండి.


content గురించే ఈ విమర్శా అంతా. శైలి, మాటల కూర్పు అన్నీ చాలా బావున్నాయి.

ఏకాంతపు దిలీప్ said...

@ రాధిక గారు
అవును ఇందులో మెసేజ్ ఉంది... కింద రాసిన కారణం వల్ల అసలు తొందరగా అర్ధం కాదేమో అనుకున్నా... మీరు పట్టేసారు... నెనర్లు...

@ మురళి, శ్రీకాంత్
అవును... మీకు నెనర్లు..

ఏకాంతపు దిలీప్ said...

@ ఇండిపెండెంట్
నాకు మీరెవరో తెలుసు కదా ;-) ఇంతకీ ఇంటెరెస్టింగా అనిపించడానికి టీజ్ చేస్తున్నారా? లేక నేను రాసింది ఇంటెరెస్టింగా ఉంటేనా? :-)

@ ప్రతాప్
అవును... అందుకే మనం గతాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు. కొన్ని ప్రశ్నలూ, కొన్ని సమాధానాలూ గతంలోనే ఉంటాయి... వాటిని నిర్లక్ష్యం చేస్తే మనల్ని మనం నాశనం చేసుకున్నట్టే! స్పందించినందుకు మీకు నెనర్లు...

ఏకాంతపు దిలీప్ said...

@ పూర్ణిమ

ముందు నువ్వు పుట్టి తరవాత ప్రశ్న పుట్టి ఉంటుంది... అసలు ప్రశ్నార్ధకం లేకుండా వ్యాఖ్య రాస్తావా నువ్వు?!!

ఇంకోటి... ఇది నీకు ఫస్ట్,లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్... ఇంకోసారి నా బ్లాగులో "లైట్ తీసుకోండి" అని ఉపయోగిస్తే ఊరుకునేది లేదు... అసలు ఆ రెండు పదాలు అంటే నాకు అసహ్యం... యాక్... చీ... హా!

ఇకపోతే నువ్వు అడిగింది...
ఇది పూర్తిగా తరాల అంతరాల గురించే కాదు... ఇందులో ఆ అంతరం గురించి కొంత ఉన్నా, దాన్ని నువ్వు చెప్పిన ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఉపమానాలతో ప్రస్తుతం నేనేమీ చెప్పలేను...

నేను రాసిన దాని గురించి వివరించే ప్రయత్నం...
ముందుగా చెప్పేదేంటంటే ఇవి యెధేచ్చగా వచ్చిన ఆలోచనలు...నేను వాటిని ఒద్దికగా పెట్టడానికి ప్రయతించలేదు... I just held those random thoughts loosely together. I stopped where I felt it conveys something...

ఇక్కడ నాకలవాటైన కవితా వస్తువు వెన్నెల, నా చుట్టూ ఉన్న పరిసరాలనే మరలా ఉపయోగించుకున్నాను...

ఆ తరం శ్రమైక(శారీరక శ్రమ) జీవనాన్ని నమ్మారు... వాళ్ళ శ్రమలో వెన్నెలలా సహజత్వం ఉంది...అది నిస్వార్ధంగా అందరికీ చేరేది...


సౌకర్యాలకి అలవాటు పడిపోయిన ఈ తరం, శ్రమని గౌరవించడం లేదు...

శ్రమని గౌరవించిన ఆ తరాన్ని చివరి క్షణాల్లో కూడా శ్రమని పంచుకోకుండ శ్రమ పెడుతూనే ఉంది...
అది అమ్మైనా, నాన్నైనా, తాతైన ఎవరైనా... దీనికి ఉదాహరణలు కోకొల్లలు మన నిత్య జీవితంలో...మీరే వెతుక్కోవచ్చు... మీ అంతట మీరు శ్రమ పెట్టకపోయినా మీ చుట్టూ ఉన్న ఎక్కువ మంది ఆ తరాన్ని అలానే చూస్తూ ఉంటారు...

చేయూతనివ్వాల్సిన సమయంలో మనం వారికి ఇవ్వకుండా, దానికి బదులు వినయాన్ని మాత్రం నటిస్తాము...అలా నటిస్తున్నప్పుడు వాళ్ళ మనసులో మన వైపు సంధించే ప్రశ్నలు ఏమై ఉంటాయో ఊహించగలరా?వాడు ఏంచేస్తున్నడో తెలిసీ తప్పించుకుని తిరిగేవాడికి ఆ ప్రశ్నలు సమాధానం చెప్పలేనంత లోతుగా ఉంటాయి...వాడు తెలియనట్టు నటిస్తాడంతే..

అక్కడ అతని కళ్ళు నిర్జీవంగా ఉన్నాయి... అంతటి వెలుగులోను మెరవడం లేదు... అలాంటి కళ్ళలో లోతెంతో తెలియని ప్రశ్నలు మరలా చూసాను... వెలుగు లేని ఆతని కళ్ళు నాకు నీళ్ళు లేని చీకటి బావులని గుర్తుకు తెచ్చాయి... వాటి లోతు కూడా తెలియదు...

ఈ సౌకర్యాల వల్ల ప్రపంచాన్ని ఇంకా చిందర వందరగా చేస్తున్నారు ఈ తరం వాళ్ళు..

ఒక్కసారి ఈ సౌకర్యాలన్నీ లేకపోతే ఈ తరం ఏమైపోతుంది..? శ్రమించడం తెలియని ఈ తరాన్ని
చూసి మురిసిపోవాలో, జాలిపడాలో...

ఇంకా ఆ తరంలో ఉన్న సహజత్వం ఈ తరంలో ఉందా?

మోహన said...

@దిలీప్ గారు..

మనిషి తనకు ఉన్నదాన్ని ఎప్పుడూ పట్టీంచుకోడు కదా..!
అమావాస్య రోజు వెన్నెల గురించి తపిస్తాడు. వెన్నెల్లో, విద్యుత్ దీపాల మధ్య అంత వెలుగులోనూ, నీడలో.. కనీసం తాత కళ్ళలో నైనా చీకటి కోసం వెతుకుతున్నాడు.

ఇంతకీ ఆ మనిషికి ఎం కావాలో [ఎం వెతకాలనుకుంటున్నాడో] తెలుసా? లేక వెతుకులాటే అతడి గమ్యమా? ఎందుకంటే వెతికేది దొరకగానే, search subject మరిపోతుంది !!

జగమే మాయ అని ఊరికే అన్నారా ?!! :) ఇదంతా.. constant illusion లా లేదు ?

చూడబోతే దిలీప్ గారూ.. మీరు నన్ను మరో టపా రాసేందుకు ప్రేరేపించెట్టు ఉన్నారు..!! ;)

Purnima said...

Hmmm.. interesting view point!! Have to think abt it..

భావస్వామ్యంలో వార్నింగులు ఉంటాయా?? ఇంటెరెస్టింగ్!! :-) This would be on my mind.

ఏకాంతపు దిలీప్ said...

@ భావకుడన్ గారు

మీ స్పందనకి ముగ్ధుడుని. చాలా నెనర్లు...

ఇక్కడ నేను మారుతున్న కాలాన్ని గురించి కాదు బాధపడుతుంది... అలవాటు పడలేకపోవడమూ కాదు.. ఇది nostalgia నుండి పుట్టినదీ కాదు..

ఇది మన ముందు తరం పట్ల మన భాధ్యత గురించి మాత్రమే... ఇక్కడ నేను బాధ పడుతున్నాను, కానీ గిల్టీ ఫీల్ అవ్వడం లేదు....

మీరు చెప్పిన సంధర్భంలో నేనైతే, మొదట్లో కొంచెం గిల్టీ ఫీల్ అయినా మార్పుకి అలవాటు పడతాను...

ఇంకా పైన వ్యాఖ్యలో నా ఉద్దేశం రాసాను...

ఏకాంతపు దిలీప్ said...

@ పూర్ణిమ
"Hmmm.. interesting view point!! Have to think abt it.."

నా వ్యాఖ్యా? నా వార్నింగా? :-)


"భావస్వామ్యంలో వార్నింగులు ఉంటాయా?? ఇంటెరెస్టింగ్!! :-) This would be on my mind."

వేడుకోలు అయితే తప్పనిసరిగా ఉంటాయి... :-)

ఏకాంతపు దిలీప్ said...

@ మోహన
అవును మోహన... నిజమే కదా... అంత వెలుగులో, చీకటినే వెతుకున్నాను...
నువ్వు మంచి సైకాలజిస్ట్ అవుతావు... నీలో ఆ విషయం ఉంది మోహనా... :-)

ఆ టపా కోసం ఎదురుచూస్తుంటాను.... అవును నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వవా? :-(

Bolloju Baba said...

కవిత చాలా బాగుంది.
చిన్న సందేహం మీ ఇల్లు పార్కు పక్కనుందా?
సరదాగా

బొల్లోజు బాబా

ఏకాంతపు దిలీప్ said...

@ బాబా గారు
నెనర్లండీ... మా బ్లాకులో 4 పార్క్లు ఉన్నాయి... పార్క్ చుట్టూ ఇళ్ళుంటాయి... మా ఇంటి ముందున్న పార్క్లో నడవడానికి సిమెంటు బాట వేసి ఉంటుంది... రెండు నెలల క్రితం ఒక ఫ్లెడ్ లైట్ స్తంభం అందులో నిలిపారు... :-) అదీ సంగతీ! :-)

మోహన said...

Thanks @దిలీప్ గారు. :)
But నేనా సైకాలజిస్టునా ? లేదండీ.. నాకు అంత ఓర్పు ఇంకా లేదేమో!

ఇక ఆటోగ్రాఫ్.. నేను అంత గొప్పదాన్ని కాదేమో! మళ్ళీ ఆలోచించండి. :)

ఏకాంతపు దిలీప్ said...

@ మోహనా
మీకు ఓర్పు లేదంటే నేను నమ్మను... ఏడుస్తూ అయోమయంలో ఉన్న చిన్న పాపని దగ్గరకి తీసుకుని మీ బుగ్గలతో సొంతం చేసుకుని ఆ పాపలో నవ్వు పుట్టించిన మీలో ఓపిక, ఓర్పు లేదంటే ఎవరు నమ్ముతారు చెప్పండీ?

గొప్పవాళ్ళైతేనే నేను ఆటోగ్రాఫ్ అడగను... నన్ను ప్రభావితం చేస్తేనో, నాకు ఇష్టమైతేనో మాత్రమే అడుగుతాను!! :-)
ఆటోగ్రాఫ్ ప్లీజ్!!!

Anonymous said...

పూర్ణిమ గారి క్రింద వ్యాక్యాలు చూస్తే...నాకు
Covey ది '7 habits of highly effective people' లో తను వివరించిన 'internal weather', 'external weather' concept గుర్తొచ్చింది. దాన్ని నేను చాలా సార్లు గుంపుల్లో people ని, impress చెయ్యడం కోసం(చదవని వాళ్ళు ఉంటే)చెపుతా ఉంటాను ;-), కాని ఎప్పుడూ ఆచరించలేకపోయా.(ఏదో కొద్ది సార్లు తప్పితే).

పూర్ణిమ కరక్ట్ గా క్యాచ్ చేశారు..internal sources మీద ఆధారపడితే, ఇంక ఈ external souces ఎందుకని?

ఇది విమర్శ కాదు. దిలీప్ భావం లాగే, ఇది కూడా ఒక ఆలోచన/భావం.

అందుకని, కత్తులు నూరబాకండి ఎవ్వరూ..You are too materialistic..You have no heart అంటా!

భావకుడన్ said...

దిలీపు గారు,

వాదన చేస్తున్నాను అనిపిస్తే చెప్పండి, మానేస్తాను-నా ఉద్దేశ్యం చర్చించాలనే :-)

మీఋ పూర్ణిమకు ఇచ్చిన వివరణలో
౧. ఈ తరం శారీరిక శ్రమను మరిచి పోతున్నారు-అది సహజం కాదు
౨. సౌకర్యాలకు అలవాటు పడ్డ ఈ తరం శారీరిక శ్రమను గౌరవించటం లేదు
౩. శ్రమించటం తెలియని ఈ లోకాన్ని చూసి ....... ఇలా అన్నారు.

మీరు అన్న దాంట్లో ఒక దాంతో ఏకీభవిస్తా--నిజంగా ఆ తరం పట్ల మనం చూపాల్సిన భాద్యత చూపట్లేదు-అది పచ్చి నిజం- పరిస్థితులు ఏమైనా. అందులోనూ socialism definitely తక్కువౌతోంది individualism పెరగటం వల్ల.

కాని నిజంగా ఈ తరానికి శ్రమించటం తెలియదా?
శారీరిక శ్రమ ఒక్కటే గొప్పదా?
మానసిక శ్రమ కాదా?
సౌకర్యాలు లేకుంటే మనం పనులు చేసుకోలేమా?

మీరు చెప్పిన ఉదాహరణ తీసుకున్నా మన దేశంలో ఎంత మంది కరెంటు లేకుండా ఉండటం లేదు? ఎంత మంది బుడ్డి దీపంతో పని సాగించటం లేదు? ఎంత మంది కరెంటు కోతల్లో కూడా జీవన స్రవంతిని సాగించటం లేదు?

పై విధంగా concrete గా కాక abstract గా ఆలోచిస్తే, నాకు ఈ మానవుడు అనే జంతువు చాలా flexible అనే అనిపిస్తుంది. ఇప్పుడు సౌకర్యాలు ఉన్నాయి అనుభవిస్తున్నాడు. అలవాటు పడ్డ ప్రాణి కాబట్టి చిన్న అంతరాయాలకు చికాకు పడ వచ్చేమో కాని లేకపోతె కూలబడిపోడు అని అనిపిస్తుంది. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు, మారటానికి.

ఎందుకంటే పైన చెప్పబడ్డట్టు, మనిషి ఉన్నా దాంతో ఎప్పుడూ సంతృప్తి చెందడు.వెతుకులాటే అతని నిజమైన నైజం.

అందుకని నేను అన్నాను ఇది nostalgia అని. ఇలాటి మార్పులు వస్తుంటే values లోను, మిగతా విషయాలలోనూ, మనం మనకు పరిచయమైన వాటిని కోల్పోతాం అప్పుడు వాటికి చాలా విలువ వస్తుంది, అది ప్రియమవుతుంది --దాన్ని miss అవుతాము --ఇది నా డెఫినిషన్ ప్రకారము nostalgia అంటే.

మనము ఈ పరిణామ క్రమాన్ని longitudinal వ్యూ తీసుకుంటే అర్థము అవుతుంది అపుడు మన "ఆ" తరం కూడా తమ "ఆ" తరానికంటే భిన్నమైన వారని. ఇది తర తరాలుగా జరిగే తంతే అని.

కాని మనం మన జీవిత కాలంలో ఈ మార్పులను "trans sectional" view తీసుకుంటాము కాబట్టి మన మనసు మూలుగుతుంది.

అందుకే "nostalgia", "మార్పులను" ప్రస్తావించాను. ఆలోచించండి.

మురారి said...

chala baagundi. vidagotti analyse chEsEkannaa oka spantaneous reaction gaa chooste baaguntundi.

మోహన said...

I agree with "భావకుడన్".

search is the human nature. And yes.. we are far flexible than what we think we are. Laws of 'nature' and 'survival' define our capabilities.

ika peddala patla badhyata vishayanikivaste, [marola anukovaddu. frank ga na ku anipinchindi cheptunna..] mana ee individulaism ki roots mana kritam generation lone unnayi. so far, we are not the beginners of a change [socially]. But just adjusting to the situation we are in. of course we always got the right and capacity to break the change and lead to a new change - a New world!!

ఏకాంతపు దిలీప్ said...

భావకుడన్ గారు,
సమయం తీసుకుని చర్చిస్తూ మీ భావాలని పంచుకోవడమే కాక, ఆ విధంగా నా భావాలని తిన్నగా చెప్పె అవకాశం కల్పించినందుకు చాలా నెనెర్లు...

మీరు చెప్పిన చాలా విషయాలతో ఏకీభవిస్తాను... కానీ నేను ఈ కవిత రాసిన సంధర్భాన్ని బట్టి మీ వివరణలోవి కొన్ని అప్రస్తుతం ఎలానో చెప్పడానికి ప్రయత్నిస్తాను... మీరు తరానికి తరానికి మధ్య వస్తున్న మార్పు గురించి మాట్లాడుతున్నారు.. నేను మన ముందు తరం పట్ల మన భాధ్యత గురించి మాత్రమే మాట్లాడుతున్నాను... నేను పాత అంతా మంచి, కొత్త అంతా చెడు అని మార్పుని చూస్తూ చింతించే వాళ్ళ గురించి రాయలేదు... నిజానికి నేనూ అలా కాదు... నేను మార్పుకి అలవాటుపడిపోతాను, అర్ధం చేసుకుంటాను, అందరికీ అర్ధమయ్యేట్టూ చెప్పడానికి ప్రయత్నిస్తాను...

శారీరక శ్రమ ఒక్కటే గొప్పది అని నేను అనుకోను... దాన్ని మానసిక శ్రమతో పోటీ పెట్టి చూడాలనుకోను...
సౌకర్యాలు లేకుండా కూడా చాలా మంది మీరు చెప్పిన ఉదాహరణల్లో లాంటి వారు చేసుకుంటున్నారు పనులు... అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ తల్లి దండ్రులకి, తాతలకి శారీరక శ్రమ తగ్గిస్తారు అని చెప్పలేము...

నేను సౌకర్యాలకి అలవాటుపడిపోయిన వాళ్ళు అని ఉదాహరణగా చెప్పాను... నిజానికి అది "గ్లోరిఫై" చేసి చెప్పడానికి మాత్రమే....అందులొ కూడా కొంత మంది ఎలాంటి పరిస్థితుల్లోనైనా బతకగలరు....

కొన్ని ఉదాహరణలు తీసుకుందాము...
మన బట్టలు చాకలి వచ్చి ఉతికి వెళ్ళిపోతుంది... చాకలి రాకపోతే అమ్మ ఉతుకుతుంది... కొందరికి చాకలే ఉండదు... మనం పెరిగాము... మనం కూడా చాకలి పెట్టుకున్నాము... లేకపోతే వాషింగ్ మెషీన్ ఉంది... చాకలీ రాలేదు కొన్ని రోజులు, వాషింగ్ మెషీన్ కూడా అదే సమయంలో పనిచెయ్యడం లేదు... అమ్మ వయసు మీద పడింది... మనం ఒకటి రెండు రోజులు చూస్తాము చాకలి వస్తుందేమో అని... రాదు... అమ్మకి అలా మాసిపోయిన బట్టలు ఉంచడం చిరాకు... నిజానికి అది ఆరోగ్యకరమూ కాదు... శక్తి తెచ్చుకుని ఉతకడానికి ప్రయత్నిస్తుంది... మనం అమ్మా నీకెందుకమ్మా చాకలి వస్తుంది కదా అని ప్రేమ గానో, మందలింపు గానో అంటాము, అంతే గానీ ఆ బట్టలు ఉతకము... ఆ వయసులోనూ శారీరక శ్రమ వాళ్ళకే వదిలేస్తాము...

అక్కడ మనమే అమ్మని అక్కడ నుండి పంపించి బట్టలు ఉతికితే, నిజంగా తనకి తేలికగా ఉండదా? ఆనంద పడదా? సంతృప్తి పడదా? ఒక్క బట్టలు ఉతకడమనే కాదు.. ఇలాంటివి ఇంకా చాలా ఉదాహరణలు...

ఒక ఇంటిలో ముగ్గురు కుర్రాళ్ళు కలిసి ఉంటున్నారు... అందులో ఒకడు పని మనిషితో గొడవ వచ్చి మాంపించేసాడు, వాడు ఇంకో పని మనిషిని పెట్టలేదు... మిగిలిన ఇద్దరు సరె మనమే శుభ్రం చేసుకుందాము అనుకున్నారు... కానీ ఆ పని మనిషిని తీసేసినవాడు అసలు పట్టించుకోవడం లేదు, సాయానికీ రావడం లేదు... అలా 15 రోజులు బాత్ రూములు శుభ్రం చెయ్యలేదు వాడు చెయ్యనిది మనకెందుకని... ఈలోగా ఓనర్ చూసారు... ఒకరోజు ఆ పనిమనిషిని మాంపించిన వాడు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ పోర్షన్లోకి వచ్చి, ఓనరు బాత్ రూము , అది తను ఉపయోగించుకోకపోయినా , శుభ్రం చెయ్యడం మొదలుపెట్టారు.. అక్కడున్నవాడు మీకెందుకండీ అని వినయం నటించాడే గానీ, వంగడానికి కష్టపడుతున్న అతని నుండీ చీపురు తీసుకుని అతనిని ఆపడానికి ప్రయత్నించలేదు... చివరకి ఓనరు శుభ్రం చేసి వెళ్ళిపోయారు...

మన ఇంటీ ఎదురుగా ఉన్న దారిలో చెట్టు కొమ్మ విరిగి దారికి అడ్డంగా వేలాడుతుంది... ఎంత మంది దాన్ని నరికి అడ్డం తొలిగిస్తారు... ఎవరో పెద్దాయన వచ్చి దాన్ని తొలగించేంతవరకు అది అక్కడే ఉంటుంది... అలాంటీ సంధర్భల్లో ఎక్కువగా అలానే జరుగుతుంది...

నిజానికి 90% మనకి శారీరక శ్రమ అవసరం లేదు, మన తరం వివిధ సౌకర్యాల ద్వారా ఆ శ్రమని తగ్గించేస్తుంది... కానీ ఎప్పుడైతే అవసరమైందో, అప్పుడు మనం నిజంగా అందుబాటులో ఉంటున్నామా? ఆ శ్రమ అవసరమైన మన వాళ్ళకి? మనకు మనం?

@ మోహనా
నువ్వు చెప్పినదానితో కూడా నేను ఏకీభవిస్తాను. కానీ అది ఇక్కడ కాదు. వయసు మీద పడిన మన అమ్మతో, నాన్నతో నా పని నాది, మీ పని మీది అనగలమా? అనకపోయినా అదే భావంతో ఉండొచ్చా?

ఆ వయసులో మనం ఏదైనా మనం చెయ్యగలిగే పెద్ద ఉపకారం ఉందంటే అది శారీరకంగా వాళ్ళకి శ్రమ కలిగించకపోవడం. అది మనం నిర్వర్తించాల్సిన కనీస భాధ్యత. మనం తరం మన ముందు తరం కన్నా వేగంగా, ఎక్కువగా సౌకర్యాలకి అలావాటుపడిపోవడం వల్ల ఈ సమస్యని తీవ్రంగా ఎదుర్కుంటున్నాము.. ఈ ఒక్క విషయంలో మన ముందు తరం, వాళ్ళ ముందు తరాన్ని మనం ఇబ్బంది పెట్టినంత పెట్టలెదు అని నాకనిపిస్తుంది...

నేను కేవలం భాధ్యతని మాత్రమే గుర్తు చేస్తున్నాను... అందరూ అలా ఉంటారని కాదు... కానీ ఎక్కువ మంది అలానే ఉంటున్నారు...

రాధిక said...

ఇక్కడ ఎవరికో సమాధానాలు చెప్పాలని నేను ఇది రాయట్లేదు.కవిత మళ్ళా కొత్తగా చదివాకా చెప్పాలనిపి0చిన ఆలొచనలు ఇవి.
కరె0టు పోతే అని కవి అన్నప్పుడు ఆ0ధకార0 తప్ప ఏమీ అనిపి0చదు అనుకున్నాను.నిజమే కర0టుపోతే అప్పుడన్నా వెన్నెలని ఆస్వాది0చాలి కానీ పోయిన కర0టుని తిట్టుకు0టూ ఇ0కా అసహన0తో బ్రతుకుతాము తప్పి0చి అస్వాది0చే మనసు మనకు లేదిప్పుదు.అలాగే మన0 మనకోస0 కష్టపడేవాళ్ళని ఇ0కా కష్టపెదూతూనే వు0టాము మనకు తెలియకు0డానే.మిగతావాళ్ల కోణ0లో నాకు తెలియదు కానీ పిల్లల విషయ0లో మన పనులకి,బిజీ జీవితాలకి అడ్డుగా వున్నారనో,చూసుకోవడ0 కష్టమవుతు0దనో....ఎన్నో కారణాలతో అమ్మావాళ్ళకి మీరే పె0చ0డని ఇచ్చేస్తున్న0.ఒక్కసారి కూడా అరే వాళ్ళు ఇప్పటివరకు కష్టపడ్డారు...ఈ సమయ0లో అయినా వాళ్ళకి సుఖమయ జీవితాన్ని ఇవ్వలేకపోయినా కనీస0 కష్టాన్ని ప0చకూడదు అన్న చిన్నపాటి ఆలోచన కూడా చెయ్యలేకపోతున్నాము.నన్ను కన్నారు కాబట్టి నేను కన్నవాళ్ళని పె0చక తప్పదు అన్న భావ0 తప్పి0చి మరొకటి కనిపి0చట్లేదు.ఈ విషయ0లో అనే కాదు ఇలా0టి ఎన్నో విషయాల్లో మన0 చూపు0డి గుడ్డివాళ్లలా ప్రవర్తిస్తున్నాము.డబ్బు స0పాది0చో,మన హోదా పె0చుకునో చూపి0చి వాళ్ళ కళ్ళల్లో మెరుపులు చూడాలనుకు0టున్నామ్ తప్పి0చి నిజానికి ఏమి చేస్తే వాళ్ళ కళ్ళల్లో మెరుపులు వస్తాయో ఆలోచి0చట్లేదు. బావిలో లోతు తెలియనట్టే మన0 చేసే తప్పులు లోతు కూడా మనకి తెలియన0త చీకటిని ని0పేసుకున్నాము మన చుట్టూ. చెట్టుని కోసి వలయాలను బట్టి ఎన్నేళ్ళ చరిత్ర వున్నదో తెలుసుకు0టున్న0 గానీ,పెద్దవాళ్ళ ముడతలు పడిన చర్మ0 వెనుక చరిత్ర మనకి అవసర0 లేదు.వాళ్ళ ప్రశ్నలు వినే0త ఓపిక మనకి లేనే లేదు.అసలు వాళ్ళ కళ్ళల్లోని చూసే0త తీరికే లేదు మనకు.

ఏకాంతపు దిలీప్ said...

@ రాధిక గారు

ధన్యుడుని. నేను చెప్పాలనుకుని చెప్పలేనిది మీరు చెప్పారు. ఇంతకన్నా ఈ కవిత ఇంకేమీ ఆశించదు...

Swathi said...

annayya nene last comments rayataniki!!!! naku updates pettu kottavi rayagane!!!!!

kavya said...

దిలీప్ గారూ,నేను మీతొ ఏకీభవిస్తాను.నిజంగానే మనం మనకు తెలియకుండానే,మన ముందు తరాల మనసుల నుంచి చాలా దూరం వచ్చేశాం..ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుని ఆ దూరం తగ్గించడానికి ఇటువైపు తిరిగి తప్పకుండా అడుగులు వేయల్సిందే..అప్పుడు ఆ తాత లాంటి వారి కళ్ళలో కరెంటు లేకపొయినా సులభంగా వెలుగును గుర్తించగలం,వెలిగించగలం...

Anonymous said...

chepesavu mama