ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Saturday, July 25, 2009

నీ లీల చేత... {గీతాంజలి ~ 1}

నీవు నాకు అంతం లేకుండా చేసావు, నీ లీల చేత. దుర్బలమైన ఈ పాత్రని నిరంతరం ఖాళీ చేసి, నవ చైతన్యంతో నింపుతావు.

నీ చిరు మురళికి ఊపిరి ఊది కొండల్లో లోయల్లో నిత్య నూతనమైన రాగాలని పలికించినట్టు

అమరమైన నీ చేతుల స్పర్శ చేత, అల్పమైన నా హృదయం కట్టలు తెంచుకున్న ఆనందంతో అనిర్వచనీయమైన అనుభూతిని పలుకుతుంది

అపారమైన నీ కానుకలు నా ఈ చిన్న చేతుల్లోకే చేరుతున్నాయి. యుగాలు జారిపోతున్నాయి, నీవు కుమ్మరిస్తూనే ఉంటావు, అయినా నింపడానికి ఇంకా చోటు ఉంది.Thou hast made me endless, such is thy pleasure. This frail vessel thou emptiest again and again, and fillest it ever with fresh life.

This little flute of a reed thou hast carried over hills and dales, and hast breathed through it melodies eternally new.

At the immortal touch of thy hands my little heart loses its limits in joy and gives birth to utterance ineffable.

Thy infinite gifts come to me only on these very small hands of mine. Ages pass, and still thou pourest, and still there is room to fill.


ఆ మధ్య ఎప్పుడో అనువాదాలు చేద్దామనిపించింది. ఆలోచనా పరిధిని పెంచుకోడానికి, భాష మీద పట్టు సంపాదించుకోడానికి.
కానీ ప్రయత్నం చెయ్యలేదు. బొల్లోజు బాబా గారు హృద్యంగా చేసిన అనువాదాలు చదువుతున్నప్పుడు, నేను కూడా చెయ్యాలని అనిపించేది. అయినా తీరిక చేసుకోలేదు. ఈ మధ్య చావా కిరణ్ గీతాంజలి అనువాదం మొదలపెడితే, నాకూ గాలి మళ్ళింది. ఎప్పుడో చేద్దామనుకున్న దానికి, ఇంతమంది చేస్తూ నాకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంటే, ఇప్పుడు కాకపోతే మళ్ళీ చెయ్యలేనేమో అని నేనూ మొదలుపెట్టాను. ప్రేరణగా నిలిచిన వారిరువురికీ కృతజ్ఞతలతో...

12 comments:

బొల్లోజు బాబా said...

beautiful

as i told earlier, translating anything is to express our gratitude towards the original. isnt it?

you are doing very very well. go ahead

it gives more pleasure in expressing the same in our own tone and also gives us a chance to imbibe more into our hearts such great works.

bollojubaba

ఏకాంతపు దిలీప్ said...

I agree with you Baba gaaru.

Thank you very much for encouraging me.

Swathi said...

ఆన్నయ్య

చాల బావుంది ఎంత అందం గ ఉన్నయి పదాలు అవి పదాలు కాదు ఒక తీపి కమ్మని మధురమైన పుట్త తేనె !!!!! నీ కవిత నేను చావా వెంకట్ గీతాంజలి కి పెద్ద అభిమానిని
కాలమే పెద్ద మందు !!!!!!!


నీ చెల్లాయి
స్వాతి

కాలనేమి said...

Awesome Dileep! Keep writing :)

భైరవభట్ల కామేశ్వర రావు said...

దిలీప్ గారు,

చాలా బాగుంది!

ఉష said...

"నీ చిరు మురళికి ఊపిరి ఊది కొండల్లో లోయల్లో నిత్య నూతనమైన రాగాలని పలికించినట్టు" ఈ భావనలో మమేకమైన మనసు ఈవలికి రానంటుంది. చక్కని అనువాదం, వ్యక్తీకరణ.

పరిమళం said...

చాన్నాళ్ళకు ....మంచిటపాతో మీ పునరాగమనం ! అభినందనలు .

chavakiran said...

Welcome to the club !

Very good going.

Waiting for next ones.

రాధిక said...

చాలా బావుంది దిలీప్.గీతాంజలికి ఎంత మంది అనువాదాలు చేసినా ఇంకా చెప్పాల్సింది వుంటూనేవుంటుంది.చదివిన ప్రతి అనువాదం కొత్త అనుభూతిని మిగులుస్తూనే వుంటుంది.

Koteswara Rao Alla said...

chala bavundhi Dileeep.

మోహన said...

Its good. But I felt its incomplete.

ఏకాంతపు దిలీప్ said...

ప్రోత్సహిస్తున్న అందరికీ నెనర్లు.

భైరవభట్ల గారూ, మీ వ్యాఖ్య నాకు ఉత్సాహిన్నిస్తుంది.