ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Friday, April 9, 2010

'బజ్' ప్రేరేపితాలు :-)

మబ్బు పట్టిన ఆకాశపు అసలు రంగేంటో?
నాకు తెలిసేదెలా?

~~~~~~~~~~

వయసు మలుపుల్లో
మనసు చెట్టుకు వలపు దెబ్బలు
ఎదురుచూపులకు కళ్ళు కాయలు

~~~~~~~~~~

యాతమేసి తోడినా ఏరు ఎండదు
ఎన్ని బంధాలల్లుకున్నా మనసు పందిరి కూలదు

~~~~~~~~~~


నీకు తెలుసా
చేరువవ్వాలనే చొరవలో ఏకాంతం మన మధ్య తెరలని తెరచిందని
తెలుసుకోవాలనే తపనలో మన మౌనం కూడా ఊసులు పలికిందని

అసలు నీకెమైనా తెలుసా
ఇప్పుడీ ఏకాంతంలో మన మధ్య ఈ తెరలు ఎందుకో? అటూ ఇటూ ఒంటరిగా
మన మౌనం ఎందుకు మూగబోయిందో? అసలు ఊసులే కరువవుతూ

~~~~~~~~~~

3 comments:

manasa.chamarthi said...

యాతమేసి తోడినా ఏరు ఎండదు
ఎన్ని బంధాలల్లుకున్నా మనసు పందిరి కూలదు

perfect!

రాధిక said...

"వయసు మలుపుల్లో
మనసు చెట్టుకు వలపు దెబ్బలు" awesome

"ఎన్ని బంధాలల్లుకున్నా మనసు పందిరి కూలదు" yes true

Rao S Lakkaraju said...

"వయసు మలుపుల్లో
మనసు చెట్టుకు వలపు దెబ్బలు"
Beautiful it is.