పార్క్లో
చిలకల జంట
కలిసి తింటున్నాయి
~~~
అతడు ఆమె
అతడామె
ఆమ్యతడు
~~~
అన్నీ
జంట మందారాలే
ఆ మందార మొక్కకు
~~~
కార్లో
ముందు అతను ఆమె
వెనుక నేను
~~~
వర్షం మొదలైంది
చేతిలో టీ కప్పు, బాల్కనీలో బట్టలు
ఏం చెయ్యను?
~~~
ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద
మల్లెపూలు అమ్ముతున్నారు
తీసుకోనా?
~~~
10 comments:
ఆఖరికి ఎమంటావు నీకు తొడు కావలి అంటావు తెచ్చుకో మేము వద్దు అన్నామా? చెప్పు..
మహా అంటే వచ్చి పప్పు అన్నం తినేసి వెళ్తాము
:)
@Ki2
:)) భలే చెప్పారు.
@దిలీప్
పప్పన్నం కి మేం రెడీ, మీదే ఆలస్యం!!;)
మీకు పప్పన్నం కావాలంటె CMH రోడ్ లో శ్రీదేవి రెస్టారంట్ ఉంది. అక్కడ రకరకాల పప్పన్నాలు బాగుంటాయి వెళ్ళీ తినండి.. X-(
అబ్బే, మీకు అర్థం కాలేదు. ఆ శ్రీదేవి మీ పక్కన ఉన్నప్పుడో లేదా ఆ శ్రీదేవే స్వయంగా వండగా మీరు వడ్డించే పప్పన్నం అన్నమాట. అర్థం చేసుకోరూ. ;) :p
దిలీప్ గారు: శ్రీదేవి హోటల్లో ఓ సారి భోజనంలో జెర్రి వచ్చిందని మాకు ఈ మెయిల్సొచ్చినయ్.
hmmmm... todu kaavalanipistondi annamaata...
విషయం మల్లెపూల వరకు వచ్చిందంటె...
తోడు కవలనే కదా అర్దం.
ఇంకెందుకు ఆలశ్యం? పప్పు అన్నానికి నెను కూడా
Ready
Post a Comment