
ఏ తోటమాలి అంటుకట్టాడో ఆ తీగని
హుందాగా కాస్తుంది నిండుగా విచ్చుకుంటున్న ఆ పూవుని
గాలికి నాట్యమాడిస్తుంది కానీ పడనీయదు
నేలని ముద్దాడిస్తుంది కానీ మట్టి అంటనీయదు
తీగకి పువ్వు ఎప్పుడూ ముద్దే కదా
తన ఒడిని వదులుతుందని తెలిసీ సాకుతుంది!
వదిలి ఎటు చేరుతుందో?
తీగ ఏం చేస్తున్నా
పువ్వుకి ప్రోది చేస్తూనే ఉంటుంది
పువ్వు విధిగా పరిమళాలని వెదజల్లుతుంది
ఇంతకీ ఇక్కడికి ఎప్పుడు చేరాను
ఆ హిమ బిందువే కదా! పువ్వుపై చేరి తెలి కిరణాల మెరుపుతో
నన్నిక్కడికి రప్పించింది.
ఇదిగో! పరిమళాల పరవశపు మైమరపులో నేను
చేరువ కాగలనే కానీ చేరువ చేసుకోలేనే
తీగ నుండి వేరు చెయ్యలేనే
ఆ తీగనే అడగనా?
ఆ పందిరిని అడగనా?
పోనీ, ఆ తోటమాలినే అడగనా?
ఈ పువ్వుకో గమ్యం ఉంటే
అది నా హృదయపు లోగిలి కావాలని
7 comments:
I am not a poetic person but I do like this one.
చాలా బాగుంది దీపూ... :) :)
"పువ్వుకో గమ్యం ఉంటే
అది నా హృదయపు లోగిలి కావాలని"....ఈ లైన్లు కవితని పువ్వంత అందం గా మార్చాయి.ఈ కవితకి గులాబి కన్నా మల్లెతీగనో,సన్నజాజి తీగ ఫొటోనో పెట్టాల్సింది.ఎందుకంటే గులాబీలకి పరిమళంతో ఆకర్షించగలిగే శక్తిలేదు కదా.
@రాధిక గారు
నాకు పూర్తిగా నప్పే బొమ్మ దొరకలేదు. సరే అని, ఒక అందమైన పువ్వు ని పెట్టేసా...
@దిలీప్,
ప్రేమించిన ప్రతివారికీ ఎదురయ్యే సందిగ్ధావస్తే ఇది. బాగుంది.
మీకు పూర్తిగా నప్పే బొమ్మ దొరకనప్పుడు, బొమ్మ అసలు పెట్టకుండా ఉండవలసింది.
భావుకతంటే ఇదన్నమాట! మీ మాటలు ఆ పూతీగకి వినిపించి ఉంటే.. ఎంత సంతోషపడి ఉంటుందా అని ఆలోచిస్తున్నా! :)
Post a Comment