ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Friday, June 4, 2010

ప్రియోదయం చూడాలని


ఏ కోడో కూస్తుందని
నీ ఉనికిని చాటుతుందని
ఎటు సాగినా
మెలకువ నను వీడలేదు
నే నడకా ఆపలేదు
నిద్ర నన్నావహించనంటుంది
నడక పరుగవుతానంటుంది
దిక్కులు తెలియకుండా సాగుతుంది నా పయనం
నీ దిక్కుకి చేరుకోవాలని
నీలో నా మనోదయాన్ని చూడాలని

3 comments:

venkataramana said...

కోట శ్రీనివాస్.. కోడిని వేలాడదీసి 'కోడి కూర' తిన్నట్టుగా.....'ప్రియ' అని వ్రాసున్న అట్టముక్కని ఇ౦ట్లో తూర్పు దిక్కున వేలాడదీసి రోజూ ఉదయాన్నే సూర్యుడివైపు చూడు..... "ప్రియోదయ౦" కనిపిస్తు౦ది. ;) ;)

ఏకాంతపు దిలీప్ said...

@Ramana
Good one :) అందుకే నిన్ను నా బ్లాగ్ లోకి రావద్దనేది.

Vardhika said...

:-)