నాకు గుర్తే లేదు
నువ్వే అమ్మవి మమ్మీ అమ్మ కాదు అన్నానంట
కానీ మమ్మీని అమ్మని ఒప్పుకోడానికి ఎన్నేళ్ళు పట్టిందో
నాకింకా గుర్తే
నా చిట్టి చేతులు నీ కోసం ఎన్ని పనులు చెయ్యాలనుకునేవి
పొయ్యిలో పుల్లల్ని, రోటిలో పిండిని ఎగతోయడం
నీళ్ళు పట్టడం, పిడకలు చెయ్యడం
నువ్వు ఏం చేస్తే అదీ నేనూ
మనింటికి కొత్తవాళ్ళెవరు వచ్చినా నా చోటు నీ కొంగు చాటే
ఆడి ఆడి పరుగున వచ్చి నీ ఓడిలో ముడుచుకుని ఒదిగిపోయేవాడిని
నువ్వు తల నిమురుతుంటే అలసట మాయమయ్యేది
నీ ఒడి వాసన నాకింకా గుర్తే అమ్మా
ఆరుబయట నులకమంచమ్మీద నక్షత్రాలని లెక్కబెడుతూ
సమాధానాలు తెలియని ప్రశ్నలెన్ని ఉన్నా
నీ మీద చేయి వేసుకుని పడుకున్న అప్పటి కన్నా
భద్రంగా నేనెప్పుడైనా ఉన్నానా?
నీ మాటల్లో ఎంత ఆపేక్ష నా గురించి చెప్పేప్పుడు
వీడికి నేనే లెక్కలు నేర్పించానని
వీడిని నేనే కాపాడుకున్నానని
వీడు నా పక్కలోనే పడుకుంటాడు అని
నువ్వు జబ్బు పడి ఎముకలైపోయినప్పుడు నిను చూడటానికి వచ్చాను
నను చూడగానే రా నా పక్కన పడుకో అన్నావు
నే పడుకోలేదు, ఏ చిన్న కదలికతో నీ మీద ఒరిగిపోతానేమోనని భయం
కానీ ఇప్పుడనిపిస్తుండి నీ పక్కనే పడుకునుండాల్సింది
16 comments:
ఈ కవిత కూడా అమ్మమ్మలా, చాలా బాగుంది :)
చాలా బాగుందండి. మా అమ్మమ్మ గురించి చదువుతున్నానా అనిపించింది. అమ్మమ్మ గుర్తొచ్చింది.
Idi ma ammammadi naadi story la unde
దిలీప్ కవిత ఇంకా వుంటే బావుండేది అనిపించింది.అమ్మమ్మ గురించి కదా....ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది లే :) చివరి వాక్యాలతో గుండె పిండి ఆరేసారు.పొద్దన్నే కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటే చిరాగ్గా ఒక లుక్కిచ్చి వెళ్ళిపోయారు మావారు.[ఏదో అప్పుడప్పుడు ఏడిస్తే ఎవరన్నా పట్టించుకుంటారు.నాలా అయినదానికి,కాని దానికి కుళాయి తిప్పేస్తే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి.
ammake ammainaa aavida gurinchi enta vinna takkuve anipistundi dileep... nenu amma ane pilichedaanni... amma odi kante bhadram prapamchamlo ledu kada nijangane... naaku aa odi kaavali... ento alisipoyinaa ee tanuvu manasu seda deerchukovaali... aakasamkesi chooste okkasari vacchipo anukodam tappa emi cheyyalenu..
మధురమైన బాల్యం అమ్మమ్మతో ముడిపడే ఉంటుంది ఆ అనుబంధాన్నికళ్ళముందుకు తెచ్చారు మీ కవితతో ....
చాలా బాగుందండి.మా అమ్మమ్మని గుర్తుచేసారు :)
Chala bavundhii
Good one dude....Antaku minchi ei cheppalo teleya ledu
వ్యాఖ్యానించిన అందరికీ నెనర్లు.. మరి మీ మీ అమ్మమ్మల గురించి రాయరే! :-)
అమ్ముమ్మ అనే వ్యక్తిని తల్చుకునేటప్పటికి ఎక్కువ భాగం మధురమైన బాల్య స్మ్రుతులే అందరికీ గుర్తు వస్తాయి.
మీ కవిత చూసి, నేను నా అమ్ముమ్మ గురించి కాకుండా, అమ్ముమ్మగా నా మనవడి గురించి తల్చుకున్నాను. వాడు అమెరికా లో ఉన్నా, మెలకువ గా ఉన్నంత సేపు ప్రతి రెండో క్షణం వాడి గురించిన మధురమైన ఆలోచనలే నా మనసుని కట్టి పడేస్తాయి. నేను ఫోన్ చేసినప్పుడల్లా, వాడు అమ్ముమ్మా నువ్వు ఇక్కడికి ఎప్పుడు వస్తావు, ఆల్రెడీ బయలుదేరావా? కార్ లో ఉన్నావా? ఇంకా ఎంత సేపటికి యైర్ పోర్ట్ చేరతావు? నేను నీ దగ్గర పడుకుంటే నాకు హాయిగా నిద్ర పడుతుంది, అలసట ఉండదు అని వాడు ఆరిందా కబుర్లు చెబుతుంటే, మనసు, కాళ్ళు ఇక్కడ నిలవవు.
ఏమిటో ఈ అనుబంధాలు, ఆరాటాలు. దగ్గర ఉండలేనప్పుడు తీయనైన బాధ.
I didnot see this post till now... Yes amma impac chala untundi...
BTW I didnt understand how to subscribe for ur blog
బాల్యం అంటే అమ్మమ్మ
బాల్యం అంటే అమ్మమ్మ పెట్టె గోరు ముద్దా
బాల్యం అంటే అమ్మమ్మ చేసి ఇచ్చిన కాగితం పడవలు
బాల్యం అంటేనే అమ్మమ్మ
అసలు అమ్మమ్మే లేకపోతె నామటుకు నాకు బాల్యమే లేదు.
కళ్ళు చెమర్చాయి దిలీప్ గారు
ఎందుకో ఇన్ని రోజుల తర్వాత ఇక్కడ కామెంట్ రాయాలనిపించింది.రాస్తున్నా....
నాకు అమ్మమ్మ,నాయనమ్మ,తాతయ్యలు,అత్తలు,పెద్దమ్మలు,పిన్నులు, అందరూ ఉన్నా ఎవరి ప్రేమా పొందలేదు.... అన్నీ తనే అయ్యి పెంచాడు నాన్న... నేను తప్పు చేసినప్పుడు నాన్న, మీదెక్కించుకు తొక్కించుకున్నప్పుడు తాత, నిద్దట్లో లేపి కొసరి కొసరి పెరుగన్నం తినిపించినప్పుడు అమ్మమ్మ,పక్కన పడుకోబెట్టుకుని సుద్దులు చెప్పినప్పుడు నాన్నమ్మ, అమ్మ కొట్టబోతే వెనకేసుకొచ్చినప్పుడు అత్త, బొజ్జ మీద పడుకోబెట్టుకుని జోల పాడినప్పుడు అమ్మ... అవును అన్నీ నాన్నే.. అమ్మ కూడా నాన్నే... ఎందుకంటే అమ్మకి కూడా అన్నీ నాన్నేగా.. అమ్మానాన్నా ఇద్దరూ ఒకటేగా...
Chala bagundi ra.. and very true.....sushma akka
Post a Comment