ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Friday, October 29, 2010

కడలి - ఆకాశం

పున్నమి తెచ్చిపెట్టే ఆకాశపు అందాలు చూస్తూ
ఆ పున్నమి తనలో పుట్టించే ఆశల కెరటాలతో
ఆకాశాన్ని అందుకోవాలనుకునే కడలి
కడలి ఆశలని తనివి తీరా ఆస్వాదించే ఆకాశం

పున్నమి జారిపోయింది
ఆశలూ అణిగిపోయాయి

ఎవరెవరు ఎవరెవరికి ఎవరో?

భావావేశపు అలలు సద్దుమణిగి
లోపలికి వెలుగు వ్యాప్తి చెందితే
కడలి ఆకాశాన్ని అందుకోవాలనుకోదేమో
ఆశ పడ్డ ఆకాశాన్ని నిందించకుండా
దాని అందాన్ని ఆస్వాదిస్తుంది
ప్రశాంతతలో అంతఃప్రకాశంతో తన అందాన్నీ ఆస్వాదిస్తుంది

అపుడు ఎవరికి వారికి ఎవరెవరు ఏంటో ద్యోతకమవుతుంది

కడలి ఆకాశానికి దూరంగా ఉంటూనే ఆవిరై చేరుతుంది
ఆకాశం కడిలికి దూరంగా ఉంటూనే తియ్యని వాన జల్లై వాలిపోతుంది


--------------------------------------------------------------------------------
నేను నా బ్లాగులో రాసినదానికన్నా బ్లాగ్ స్నేహితుల బ్లాగుల్లో రాసినవే ఎక్కువ. వాటిని నా బ్లాగులో కూడా పెట్టమని అడిగేవారు.బద్ధకంతో ఇక్కడ పెట్టే వాడిని కాదు. ఇప్పుడు ఎందుకో బుద్ధి పుట్టింది.మీకు మీ మీ బ్లాగుల్లో నేను రాసినవి నచ్చి గుర్తుంటే నాకు చెప్పండి. ఇక్కడ పెట్టేస్తే ఓ పనైపోతుంది... :) నాకు గుర్తున్నవి కొన్ని నా బ్లాగ్ కి జత చేస్తా...

5 comments:

మధురవాణి said...

ఎంతందమైన అనుబంధం కదూ!
మళ్ళీ మళ్ళీ చదివి ఆనందించడం తప్ప ఇంకేమీ చెప్పలేం! :)

Anonymous said...

చల్లని చిరుగాలి అంటుంది నాతో ఊసులాడతాను అని
పున్నమి వెన్నెల అంటుంది నాకు త్రోవ చూపిస్తానని
ఎగసే కెరటం అంటుంది నీ కన్నీళని నాలో కలుపుకుంటానని
నేస్తమా ఈ ఏకాంతంలో మనసులో ఉప్పొంగే భావాలెన్నో
ఆ భావాలు భావనలు నన్ను అడిగిన గాలికి తెలియవు,
నిండు చంద్రుడికి తెలియవు,కెరటానికి అసలే తెలియవు..
తెలిసిన నువ్వు నన్ను వదిలి దోరంగా వెళ్ళిన నీ
జ్ఞాపకాలు ఇంకా నాలో మెదులుతూనే ఉన్నాయి.....
ఏకాంతంలో గుర్తుచేస్తూనే ఉంటాయి.......
నేస్తం.....@ shiny
తపించే హృదయం.

Manasa said...

Chala bagundi andi mee Ekantavela blog..Liked this poem a lot!

rishi said...

vaana mayuram
nemalikannu pasithnam
sandram vennela
manasu mamatha
anthaha prakaasame..
anthaa teliyachestadaa?
evariki evaro...a payanamo.?
baavundi.. maalathi..maadhvam..laa

Manasa Chamarthi said...

boy, you better start writing again!
Yes, I have few poems that you have written on Anil's orkut pages and on our photographs!

Let me check and get back to you