ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Thursday, November 11, 2010

కవిత-వర్ణన-భావుకత-వచనం

ఏమైనా, హృద్యమైన భావోద్రేకాలని సూటిగా చెప్పాలి అంటే నేను రాయడాన్ని ఆశ్రయించను. కవితా మార్గాన్ని అసలు ఎంచుకోను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నా చేత చెప్పించుకోవాలి అంటే, ముందు తను నాకేంటో అనేది నేను చెప్తుంటే వినాల్సిందే.. :) అలా చెప్పడం మొదలుపెట్టిన తరవాత, తను ఎంత ఎదురు చూసినా అసలు తనని ప్రేమిస్తునానని కూడా చెప్పకపోవచ్చు. కానీ, నా మాటలని తను వెతుక్కుంటే అంత కన్నా బరువైన, విలువైన భావాలని తను ఏరుకోవచ్చు. అసలు ఆ మాటలకోసమే ఎదురు చూసి, ఈ సుత్తంతా ఎందుకు అంటే, తనకి నా భావోద్రేకాలు అర్ధం కానట్టే! అప్పుడు అసలు తను నన్ను అర్ధం చేసుకున్నట్టేనా? ప్రేమించినట్టేనా? కానీ నేను తనని ప్రేమిస్తున్నాను అని నా ప్రతి వర్ణనలోనూ చెప్తున్నానే... నా వర్ణనలకి, నాలో భావావేశానికి ఆమే మీద ప్రేమే ప్రేరణే... కానీ కేవలం నా భావాన్నే వ్యక్తపరచాలి అంటే, నాలో భావావేశాన్ని నేను ఎవరితో పంచుకోను...

తనని చూడగానే పరుగున చెంత చేరి హత్తుకుని నువ్వంటే నాకిష్టం అంటే, అది చెప్పడానికి ఇలా పరుగుపెట్టి హత్తుకోవాలా? అక్కడ ఉండే చెప్పొచ్చు కదా అంటే..?! నా భావావేశం ఏం కానూ? దాన్ని ఎవరితో పంచుకోనూ?

అలంకారాలూ, అతిశయాలు లేని కవితను నేను అన్ని కాలాల్లో ఆస్వాదించలేను. నా వర్ణనని, భావావేశాన్ని పంచుకోలేని తను నా ప్రేమనీ ఆస్వాదించలేదు,నేను కూడా...

ఇంతకీ ఏది కవిత? ఏది వర్ణన? ఏది భావుకత? ఏది వచనం?

6 comments:

మధురవాణి said...

"ఇంతకీ ఏది కవిత? ఏది వర్ణన? ఏది భావుకత? ఏది వచనం? "
మీరేదో ఈ ప్రశ్నకి సమాధానం చెప్తారని నేనొస్తే మళ్ళీ అదే ప్రశ్న వేస్తున్నారే! ;)
ఈ పోస్ట్ ఆ నాలుగింటిలో దేని కిందకి వస్తుందో నాకు తెలీదు గానీ, 'చాలా బాగుంది' అన్న భావన మాత్రం వచ్చింది. :)

పద్మ said...

అలంకారాలు, అతిశయాలు, కవితలు, భావుకత్వాల వెల్లువ ఎంత ముఖ్యమో ఆ ముచ్చటైన మూడు పదాలు కూడా అంతే ముఖ్యం. ఎప్పుడు ఏది అన్నది తెలిస్తే ప్రతి పదం అలంకారాతిశయంతో కూడిన కవితే. :)

Anonymous said...

kavitha,varnana and bhavukatha priyuralike artham avuthundi thane cheppali.ha ha ha ...

Unknown said...

kavitha,varnana and bhavukatha priyuralike artham avuthundi thane cheppali.ha ha ha ...

MURALI said...

ప్రక్రియ ఏదయితేనేం వస్తువు ముఖ్యం. అది బాగుంది.

ఏకాంతపు దిలీప్ said...

:-)