ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...
Showing posts with label అనుజడి. Show all posts
Showing posts with label అనుజడి. Show all posts

Saturday, July 31, 2010

అనుజడి




స్తబ్ధుగా తను
ఎప్పుడు కుండపోతా అన్నట్టు ఆకాశం
దట్టమైన ఆ మేఘాలు ఎక్కడి నీటితో అల్లుకున్నాయో?
ఏ ఆలోచనల ఆవిరి ఆమె కళ్ళలో ముసురుకుందో?
ఏ పవనమో వీచి ఏ మేఘాన్నో కరిగించింది..
జన జనా వాన
చెట్లపైనా
గుట్లపైనా
ఏం జరిగిందో మరి ఆ కళ్ళూ కరిగాయి
టపా టపా కన్నీరు
చెక్కిళ్ళపైనా
గుండెలపైనా
జన జనా వాన
టప టపా కన్నీరు

ఒక్కసారిగా ఆగిపోయాయి

మళ్ళీ ఏం జరిగిందో మరి
జన జనా వాన
టప టపా కన్నీరు

మళ్ళీ ఆగిపోయాయి

వాన కురిసింది కన్నీరు కురిసింది
వాన కురిసింది కన్నీరు కురిసింది

ఏ ఆలోచనల ఆవిరి తన కళ్ళలో ముసురుకుంది?

ఈ జడి ఈ రోజు ఆగేనా?