
స్తబ్ధుగా తను
ఎప్పుడు కుండపోతా అన్నట్టు ఆకాశం
దట్టమైన ఆ మేఘాలు ఎక్కడి నీటితో అల్లుకున్నాయో?
ఏ ఆలోచనల ఆవిరి ఆమె కళ్ళలో ముసురుకుందో?
ఏ పవనమో వీచి ఏ మేఘాన్నో కరిగించింది..
జన జనా వాన
చెట్లపైనా
గుట్లపైనా
ఏం జరిగిందో మరి ఆ కళ్ళూ కరిగాయి
టపా టపా కన్నీరు
చెక్కిళ్ళపైనా
గుండెలపైనా
జన జనా వాన
టప టపా కన్నీరు
ఒక్కసారిగా ఆగిపోయాయి
మళ్ళీ ఏం జరిగిందో మరి
జన జనా వాన
టప టపా కన్నీరు
మళ్ళీ ఆగిపోయాయి
వాన కురిసింది కన్నీరు కురిసింది
వాన కురిసింది కన్నీరు కురిసింది
ఏ ఆలోచనల ఆవిరి తన కళ్ళలో ముసురుకుంది?
ఈ జడి ఈ రోజు ఆగేనా?
5 comments:
బాగుంది.
కానీ బొమ్మ కవిత ముందు తేలిపోతుంది.
కనీసం బొమ్మను కవితకు కిందకి జరపగలరు.
కిరణ్ చెప్పినట్ట బొమ్మ కవితముందు తేలిపోయింది. అద్భుతంగ రాశావు!
*"ఏ ఆలోచనల ఆవిరి తన కళ్ళలో ముసురుకుంది?"*
ఏ కన్నీటి ఆవిరి నిన్ను ఇంత గొప్పగా ఆలోచింపజేశాయో?
ఏ భావాల తాకిడి నీ ఈ కవితకు తొలి అక్ష్రాలందించాయో?
మనసుని మైమరిపించింది ఈ కవిత!
*"ఈ జడి ఈ రోజు ఆగేనా?"*
నీ ఈ కవితా వర్షానికెవ్వరు నల్లగొడుగుపట్టడం లేదు.
అనందంగా తలమునకలవుతున్నారు ;) మేఘమా ఆపకు నీ కుండపోతను!
Baagundi
kundapotha vaana aagipothundi jal jlaa paare neetini migilchi, Gundelanu thadipina kanneru aagipothundi gunde bhaaraanni konchem tagginchi ...
kaani aa gunde telisina maro gunde iche odaarpu savvadi vuppongishundi ee gundeni anantha aanadamayam tho .......
కిరణ్, భాస్కర్, వాసు
చాలా నెనర్లండీ.. మొదటినుండీ బొమ్మ ముందు పెట్టి తరవాత రాస్తున్నా కదా, అదే కొనసాగించేద్దాము :)
Post a Comment