ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...
Showing posts with label అమ్మాయిలు. Show all posts
Showing posts with label అమ్మాయిలు. Show all posts

Sunday, June 19, 2011

మేఘాల నీడల్లో



ఎటు నుండి వస్తాయో..
అనుకోని వేళల్లో గొడుగు పడతాయి
ఎండల్లో సేదతీరుస్తాయి
వెన్నెల్లో అలరిస్తాయి

కరిగి కదిలిస్తాయి
కదిలి కరిగిస్తాయి

వాటి ఉనికిని కోల్పోయి నా ఉనికిని ప్రశ్నిస్తాయి
కాని నా ఉనికిని ఇష్టంగా చూసేది వాటి నీడల్లోనే

ఎటు నుండి వస్తాయో... ఎటెళ్తాయో..

మేఘాలు ఆడవే అన్నాను కదూ!


.

Tuesday, July 27, 2010

మేఘాలు






ఒక్కోసారి స్తబ్దుగా అల్లుకుంటాయి
ఒక్కోసారి ఉరుములు, మెరుపులతో విజృంభిస్తాయి
ఒక్కోసారి వాయు వేగంతో విన్యాసాలు చేస్తాయి

ఎప్పుడు కరుగుతాయో
ఎప్పుడు కలవరపెడతాయో
ఎప్పుడు మురిపిస్తాయో

అంతే చిక్కవు
కానీ ఎప్పుడూ కవ్విస్తూనే ఉంటాయి

మేఘాలు ఆడవే అయి ఉంటాయి.