చందమామ, చావిడి నాకోసమే ఎదురుచూస్తున్నాయి…
నా తోడు నాతో ఉంటే ఈ సాయంత్రం చల్ల గాలిలో సరాగాల సరిగమలే కదా..
~~~~~~~~~~~~~~
ఎదురుగా చందమామ
ఏం ఆలోచిస్తున్నావు అంది?
మౌనమే నా సమాధానం…
చూసావా నువ్వెక్కడికెళ్తే నేనక్కడ నీతో ఉన్నాను అంది
ఏం ఆలోచిస్తున్నానో తనకి తెలుసు అన్నట్టు కొంటెగ రెట్టిస్తూ…
అప్రయత్నంగానే మౌనం వీడిపోయింది
అన్నాను చందమామతో…
నువ్వు ఎక్కడికొచ్చినా ఆకాశంలోనే నీ గూడు
తను రాలేకపోయినా నా ఎదలోనే తన గూడు
ఎక్కడికెళ్ళినా ఆ నది నిన్ను తనలో నిలుపుకున్నట్టు అని..
చందమామ నవ్వుతుంది.. మురిపెంగా…
నది ఎదలో ఆ నవ్వులు మరింత మెరిసాయి…
~~~~~~~~~~~~~~
చందమామని జల్లెడతో పట్టాలని ఆ ఆనకట్ట ఆకాశానికేగుతుంది…
ఎంత ఎత్తులో ఉందని ఆ నది చందమామని పట్టింది?
~~~~~~~~~~~~~
నీకూ నాకూ మధ్య ఆ తెరలు ఈ దూరం తరిగే వరకే!
~~~~~~~~~~~~~~~
ఎన్ని సంద్రాలు దాటినా
ఎన్ని దారులు మారినా
నా గమనమూ నువ్వే
నా గమ్యమూ నువ్వే
ఎన్ని భాషలు నేర్చినా
ఎంత మందిని కలిసినా
నా ఊహలు నువ్వే
నా జాబిలి నువ్వే
~~~~~~~~~~~~~~~
నా ఫ్రెండ్, పెళ్ళానికి దూరంగా డబ్లిన్ లో విరహంతో,బెంగతో ఒంటరిగా ఏం చెయ్యాలో తెలియక కేమెర తో ఫోటోలు తీసుకుంటున్నాడు. ఇందులో ఫోటోలు వాడు తీసినవే. వాళ్ళిద్దరి కోసం నా రాతలు జోడించాను.