ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Wednesday, July 28, 2010

బెంగతో తపిస్తున్నా..





చందమామ, చావిడి నాకోసమే ఎదురుచూస్తున్నాయి…
నా తోడు నాతో ఉంటే ఈ సాయంత్రం చల్ల గాలిలో సరాగాల సరిగమలే కదా..

~~~~~~~~~~~~~~





ఎదురుగా చందమామ
ఏం ఆలోచిస్తున్నావు అంది?
మౌనమే నా సమాధానం…
చూసావా నువ్వెక్కడికెళ్తే నేనక్కడ నీతో ఉన్నాను అంది
ఏం ఆలోచిస్తున్నానో తనకి తెలుసు అన్నట్టు కొంటెగ రెట్టిస్తూ…
అప్రయత్నంగానే మౌనం వీడిపోయింది
అన్నాను చందమామతో…
నువ్వు ఎక్కడికొచ్చినా ఆకాశంలోనే నీ గూడు
తను రాలేకపోయినా నా ఎదలోనే తన గూడు
ఎక్కడికెళ్ళినా ఆ నది నిన్ను తనలో నిలుపుకున్నట్టు అని..
చందమామ నవ్వుతుంది.. మురిపెంగా…
నది ఎదలో ఆ నవ్వులు మరింత మెరిసాయి…


~~~~~~~~~~~~~~





చందమామని జల్లెడతో పట్టాలని ఆ ఆనకట్ట ఆకాశానికేగుతుంది…
ఎంత ఎత్తులో ఉందని ఆ నది చందమామని పట్టింది?


~~~~~~~~~~~~~





నీకూ నాకూ మధ్య ఆ తెరలు ఈ దూరం తరిగే వరకే!


~~~~~~~~~~~~~~~






ఎన్ని సంద్రాలు దాటినా
ఎన్ని దారులు మారినా
నా గమనమూ నువ్వే
నా గమ్యమూ నువ్వే

ఎన్ని భాషలు నేర్చినా
ఎంత మందిని కలిసినా
నా ఊహలు నువ్వే
నా జాబిలి నువ్వే

~~~~~~~~~~~~~~~


నా ఫ్రెండ్, పెళ్ళానికి దూరంగా డబ్లిన్ లో విరహంతో,బెంగతో ఒంటరిగా ఏం చెయ్యాలో తెలియక కేమెర తో ఫోటోలు తీసుకుంటున్నాడు. ఇందులో ఫోటోలు వాడు తీసినవే. వాళ్ళిద్దరి కోసం నా రాతలు జోడించాను.

10 comments:

Paddu said...

చాలా బావుంది దిలీప్....
ఎలా అంటే.. రోజంతా క్షణం తీరిక లేకుండా అన్ని పనులతో సతమతమవుతున్నపుడు... నీ కవితలు ఒక ఆటవిడుపులా అనిపిస్తాయి... ఒక్కసారిగా మదిలో ఉండే గజిబిజి ఆలోచనలు అన్నీ మాయమై ప్రశాంతంగా ఉంటుంది..

ఈ కవిత మీ స్నేహితుని గురించి అయినా అందులోని సహజత్వం...మనసుని మరింత కట్టిపడేలా చేస్తుంది :)

Paddu said...
This comment has been removed by the author.
Paddu said...

నాకు కూడా బెంగ ఎక్కువయింది.. ఈ ప్రశాంతతని నేను మళ్ళీ పొగొట్టుకుంటానేమో అని..
నాకు ఒక ఉపాయం తట్టింది...నీ కవితలతో స్నేహం చేస్తే ఆ ప్రశాంతత నాతోనే ఉంటుంది కదా...

నన్ను స్వార్ధపరురాలిని చేస్తున్నావు సుమా !!!

మధురవాణి said...

మొదటి రెండు ఫోటోలు చూసి, మీర్రాసింది చూసాకా.. ఫోటోలు చూసే రాశారా ఇంతలా అతికినట్టు.. అని అడుగుదాం అనుకున్నాను. కానీ, ఆ విషయం మీరే చెప్పేశారు చివరికి :-)
ఫోటోల్లోంచి మాటలు వినిపిస్తున్నట్టుంది. అంత బాగా రాసారు. ఫొటోల్లోనూ, మీ కవితలోనూ మీ స్నేహితుడి ఫీల్ మాకూ కనిపించింది. :-)

ఏకాంతపు దిలీప్ said...

@పద్దూ చదువుతూ ఉండు.. :) నా బ్లాగుకి ప్రశాంతత గారంటీ అని టాగ్ లైన్ పెట్టేసుకోవోచ్చేమో :)

@మధురవాణి గారు,
నెనర్లు.. మా వాడు కూడా అలానే అన్నాడండి. :)

Krishna said...

Well Said, Dileep. That was nice.

సీత said...

:D

srikanth Chundi said...

Dileep,

Chala baagunnayi. Simply Awasme ra. neelo inta Kavitwam daagi undani college days lo kuda anukoledu....

Thanks
Srikanth

ఏకాంతపు దిలీప్ said...

@Sita
:-)

@Krish

Thank you!

@ Srikanth gaaru

college lo eppuDainaa raastE kadaa meeku telisEdi?! :-)

vasu said...

chala bagundhi...