ఢిల్లి వాతావరణం అక్టోబర్-నవంబర్లో ఆహ్లాదకరంగా ఉంటుంది…
ఇప్పుడిప్పుడే చలి కాలం మొదలైనట్టుంది…
నేను ఇంటి ముందు పార్క్లో నడుస్తున్నాను…
ఈ వాతావరణం చూస్తుంటె… నాకు...
ఏజెన్సిలొ నేను టేకూరులో ఉన్నప్పటి సాయంత్రం గుర్తుకొస్తోంది...
అప్పుడు చిన్న పడవ మీద టేకూరు ఒడ్డునుండి గోదావరి మధ్యలో ఉన్న ఇసుకతెన్నుల మీదకెళ్ళాను…
వెన్నెల వచ్చే వరకు…
చుట్టు ఉన్న కొండల ఎత్తుల్ని పోల్చుకుంటూ,
వాటి అంచుల్లొ, మబ్బుల్లొ రూపులు వెతుక్కుంటూ,
గూటికెల్లే పక్షుల వరసలని గమనిస్తూ,
ఎగిరే చేపల్ని లెక్కపెడుతూ,
చాలా దూరంలొ ఉన్న పాపి కొండల్ని చూస్తూ,
ఏకాంతంగా ఉండి పోయాను…
అప్పుడు ఒకటి అనిపించింది…
నా చెలి నా పక్కనుంటె ఎంత బాగుండు అని...
ఇప్పుడు ఇలా ఒంటరిగా నడుస్తున్నప్పుడూ...
9 comments:
"నా చెలి నా పక్కనుంటె ఎంత బాగుండు అని..."
ఈ ఒక్క వాక్యంతో మొత్తం ఎత్తుగడనే మార్చేసారు. చాలా బాగుంది.
ఇంత భావుకతకు "గోదారా??" కారణం!! అనుకున్నాను ఇలాంటి పెద్ద ఖజానాయే మీ దగ్గర ఉందని. :-) అసలెవిరినైనా mesmerize చేస్తుంది గోదావరి. ఎంత అదృష్టవంతులండీ మీరు.. ఇసుక తిన్నెలు, పాపి కొండలు, గోదావరి.. పెట్టి"పుట్టారు" మాట.
నేను పాపికొండలు చూట్టానికి వెళ్ళినప్పుడు.. 100 మందున్న పడవలో నా నేస్తం ఎవరో తెలుసా.. "ఏకాంతం" ;-)
నీ పక్కన నిలిచే ఆ చెలి.. నీలోని చెలిని మైమరపించాలి మనసారా కోరుకుంటూ..
పూర్ణిమ
@ మహేష్ గారు
భావుకతకి ఎత్తుగడలు తెలుసంటారా చెప్పండి?!... నెనర్లు :-)
@ పూర్ణిమ
మాది గోదారి...మీది కూడా గోదారేనా? :-) నేను అక్కడ పుట్టడం గత జన్మల్లో ఎప్పుడైనా పుణ్యం చేసుకుని ఉండటం వల్లేనేమో అనుకుంటాను... ఆ సాయంత్రాన్ని నేను మరచిపోలేను. చాలసేపు అక్కడ ఉండి మరలా ఒడ్డుకి వచ్చేసరికి మా పెద్దమ్మ చేపల పులుసు చేసి పెట్టింది. మసలా లేని మంచి రుచి ఉన్న ఆ పులుసుని ఇప్పటికీ మరిచిపోలేను... :-)
missing all that... :-(
నీ మనసైన శుభాకాంక్షలు చూసి మురిసిపోతున్నాను. చాలా చాలా నెనర్లు... :-)
మామూలు పదాలతో ఇన్ని భావాలు పలికించవచ్చని నాకిప్పుడే తెల్సింది.
@దిలీప్, భావుకతలో ఎత్తుగడలు అనిభవించి చెప్పినవాడికి తెలీవు. చదివి అర్థం చేసుకున్నవాడికి తెలుస్తాయి.
అయితే వెన్నెల్లో గోదారి అందాన్ని చూసారన్నమాట.నాకు ఆ ఆదృష్టం లేకపోయింది.
గోదావరి మీదకి మూడు సార్లు వెళ్ళాలి.ఒకటి స్నేహితులతో,ఇంకోసారి ఏకాంతాన్ని అనుభవించడానికి ఒంటరిగా,మూడవసారి ఈ రెండు అనుభవాలను సరదాగా చెప్పుకోడానికి భాగస్వామితో.
ఇంకోసారి వెళ్ళేసరికి మీ మనసెరిగిన భాగస్వామి మీ పక్కనుండాలని కోరుకుంటున్నాను.
మొదలు పెట్టిన భావాన్ని మిగిలిన భావానికి కలపడం బాగుంది.
@ రాధికా గారు
మీ కోరికలన్నీ తీరిపోవాలని.. :-)
@ శ్రీ విద్య
నా లోకంలోకి స్వాగతం :-)
Post a Comment